ఆయా పార్టీల సోషల్ మీడియా విభాగాలు, సొంత మీడియా సంస్థలు తమ నాయకుడిని, తమ పార్టీని ఎప్పుడూ పాజిటివ్ యాంగిల్‌లో చూపించడానికి ప్రయత్నిస్తాయి… అలా ప్రయత్నించడం వాటి కర్తవ్యం… అదే సమయంలో ప్రత్యర్థి పార్టీ విధానాల్ని తూర్పారబట్టడం, తమ పార్టీ విధానాల్ని జస్టిఫై చేయడడం కూడా సాధారణమే…
కేవలం ఒక నాయకుడి కోసం సినిమా తీయడం అంటే, తన ప్రతి చర్యనూ జస్టిఫై చేయాలి, ఇప్పుడు ఎన్నికల ముందు పొలిటికల్ ఫాయిదా కోసం తీయబడిన సినిమా కాబట్టి ఇమేజ్ బిల్డింగ్ కూడా అవసరం… యాత్ర-2 చేసింది అదే పని… ఐతే దీన్ని బయోపిక్ అనలేం… వైఎస్ మరణం నుంచి జగన్ అధికార ప్రస్థానం దాకా తీయబడిన పరిమితమైన కథ… వైఎస్ లెగసీ జగన్‌దే అని చాటడానికి చేసిన ప్రయత్నం…
వైఎస్-చంద్రబాబుల రాజకీయ వైరం నుంచి ప్రస్తుతం జగన్ ముఖ్యమంత్రిత్వం దాకా అన్ని పరిణామాలూ అందరికీ తెలిసినవే… కాకపోతే ఒక్కో పార్టీ జనం ఒక్కో కోణంలో అర్థం చేసుకుంటుంది… జగన్‌ను వ్యతిరేకించడానికి చంద్రబాబుకు జస్టిఫికేషన్ ఉంటుంది… జగన్‌ను నిలువరించడానికి సోనియాగాంధీకి జస్టిఫికేషన్ ఉంటుంది… కాంగ్రెస్ విడిచిపెట్టి సొంత పార్టీ పెట్టడానికీ జగన్‌కు జస్టిఫికేషన్ ఉంటుంది… ఎటొచ్చీ చూసే కోణాలు, అర్థం చేసుకునే తీరు వేర్వేరు…
Ads
అయితే… యాత్ర మొదటి భాగం తీసినప్పుడు జగన్ ప్రతిపక్షంలో ఉన్నాడు… జనం తనను లీడర్‌గా యాక్సెప్ట్ చేస్తున్న దశ… ఇంకా వైఎస్ లెగసీని, వైఎస్ జ్ఞాపకాల్ని జనం మరిచిపోని కాలం… అందుకేనేమో ఆ సినిమాకు మంచి విజయం దక్కింది… ప్రేక్షకులు ఓన్ చేసుకున్నారు… కానీ ఈ యాత్ర సీక్వెల్‌కు పెద్దగా బజ్ రాలేదు… పైగా జగన్ ఇప్పుడు అధికారంలో ఉన్నాడు… అధికారంలో ఉన్న నాయకుడి చర్యల్ని జస్టిఫై చేస్తూ, ఇమేజ్ బిల్డింగ్ చేస్తుంటే అది భజనలా ఉంటుంది…
పైగా ఈ సినిమాలో కొత్తగా తెలుసుకునే సంగతులేమీ లేవు… అన్నీ, అందరమూ చూస్తున్నవే… అందుకే సాక్షి టీవీ చూస్తున్నట్టుగా ఉంది… మీకు గుర్తుందా..? సాక్షి టీవీలో పదే పదే ‘పెద్దాయనా పెద్దాయనా’ అనే పాట వచ్చేది… ప్రియదర్శిని రామన్నయ్య నేతృత్వంలో రూపొందిన పాట… అప్పట్లో అది గూస్ బంప్స్ తెప్పించేది… యాత్ర సీక్వెల్‌లో పాటలు పెద్దగా కనెక్టయ్యేట్టు లేవు… కాకపోతే ఓ పాజిటివ్ అంశం ఏమిటంటే…
యాత్ర దర్శకుడు ఎవరినీ చిల్లరగా చూపించే ప్రయత్నం చేయలేదు… వరుస పరిణామాల్ని ఓ క్రమపద్ధతిలో, అక్కడక్కడా ఎమోషనల్ ఇష్యూస్ టచ్ చేస్తూ… ఎక్కువగా జగన్‌ను బాగా ఎలివేట్ చేయడానికే ప్రయత్నించాడు తప్ప… తన ప్రత్యర్థుల మీద విషాన్ని, ద్వేషాన్ని, అక్కసును జల్లడానికి ప్రయత్నించలేదు… హుందాగా కథ నడిపాడు… అందుకే రాంగోపాలవర్మ వ్యూహాన్ని తీవ్రంగా ఖండించి, అడ్డుకుంటున్న టీడీపీ క్యాంపు కూడా ఈ యాత్ర జోలికి రాలేదు… కాంగ్రెస్ కూడా విమర్శించలేదు…
మమ్ముట్టి పాత్ర యాత్ర మొదటి భాగంలోనే అధికం… ఎందుకంటే ఆ కథలో హీరో వైఎస్… ఈ సీక్వెల్‌లో ఆయన పాత్ర పరిమితం… కానీ హుందాగా, బాగా చేశాడు… ఐనా మమ్ముట్టికి నటనలో వంక పెట్టడానికి ఏముంటుంది..? జీవా కూడా జగన్ పాత్రలోకి దూరడానికి బాగా కష్టపడ్డాడు… పర్లేదు… మిగతా పాత్రలకు ఆయా నటులు వోకే… భారతీరెడ్డి పాత్ర చేసిన నటి ఎవరో గానీ బాగుంది, బాగానే చేసింది…
అయితే ఇలాంటి పొలిటికల్ ఇమేజ్ బిల్డప్ సినిమాల్లో క్రియేటివిటీ లెవల్స్ ఏమీ ఉండవు… అందుకే అందరినీ కనెక్ట్ కావు… వైసీపీ వాళ్లకు ఫీల్ గుడ్ మూవీ,.. మిగతా వాళ్లకు జస్ట్, వోకే వోకే సినిమా… అంతే… చివరగా… జగన్‌తో పడటం లేదు కదా, సో, మొత్తానికే షర్మిల పాత్రను ఎత్తేశారు… సో, జగన్‌కు నచ్చినట్టు, జగన్‌కు అచ్చి వచ్చేట్టు… అదలాగన్నమాట…
Share this Article