అయోధ్య రాముడి గుడి స్థలం కోసమే కాదు… గుడి చందాల సేకరణ కూడా ఉద్రిక్తతల్ని, హింసను తీసుకొస్తోంది… విరాళాల సేకరణలో ఉన్న రింకూ శర్మ అనే కార్యకర్త ఢిల్లీ దారుణ హత్యకు గురయ్యాడు… అది రాజకీయ ప్రకంపనల్ని కూడా సృష్టిస్తోంది… తెలంగాణలోనూ టీఆర్ఎస్ కొంత రచ్చ చేయడానికి ప్రయత్నించింది… మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు… బీజేపీని వ్యతిరేకించడం పేరిట నానా యాగీకి దిగి, అయోధ్య రాముడికి వ్యతిరేకమని ముద్రలు వేయించుకుని, ఇదేదో పార్టీకి కౌంటర్ ప్రొడక్టుగా మారుతోందని తెలిసి, పైనుంచి అక్షింతలు కూడా పడటంతో ఇక సైలెంట్ అయిపోయారు… ఒకాయన రశీదు పుస్తకాలేవీ, ఎవరు ఈ డబ్బులకు జిమ్మేదారి అనడిగాడు, మరొకాయన బీజేపీ బిచ్చమెత్తుతోందన్నాడు, ఇంకొకాయన రాముడు అక్కడ పుట్టనేలేదన్నాడు.., చివరకు హన్మకొండలో ఉద్రిక్తతలు, ఇళ్లపై దాడులు, కేసులు, బందులు, అరెస్టుల దాకా వెళ్లింది… చివరకు మా భద్రాద్రి రాముడు వేరు, మీ అయోధ్య రాముడు వేరే అని వేరుబియ్యం కూడా పోశారు… గుడికి చందాలివ్వడమే తప్పు అన్నంతగా ప్రచారం జరిగింది…
ఇదంతా సరే.., మరి ఈ ప్రతికూలతల నడుమ కూడా ,ఇంతకీ తెలంగాణలో బీజేపీ పరివార్ ఎంత వసూలు చేయగలిగింది…? జనం రియాక్షన్ ఏమిటి..? టీఆర్ఎస్ ప్రభావం ఎంత..? కాస్త ఆసక్తికరమైన ప్రశ్నే కదా… సంఘ్ పరివార్ చెబుతున్న లెక్కలు, వివరాల ప్రకారం… జనవరి 15 నుంచి ఫిబ్రవరి 15 వరకు మాత్రమే ఈ విరాళాల సేకరణ… నేరుగా ఆన్లైన్లో కూడా చాలామంది విరాళాలు జమచేశారు… కానీ కార్యకర్తలకు డబ్బులిచ్చి, రశీదులు తీసుకున్న వివరాల మేరకు ఇప్పటికి 100 కోట్ల పైచిలుకు డబ్బు వచ్చింది… ఒక్క తెలంగాణ నుంచి ఈ మేరకు డబ్బు వసూలు కావడం విశేషమే… జాతీయ స్థాయిలో 1500 కోట్ల దాకా వసూలైనట్టు చెబుతున్నారు… గుడి నిర్మాణానికి 1000 కోట్లు చాలు, ఇంకా వచ్చిపడుతున్న నిధులతో గుడికి ఆనుకుని ఉన్న భూములను కొని, డెవలప్మెంట్ ప్లాన్ విస్తరించనున్నట్టు ట్రస్టు ప్రతినిధులు చెబుతున్నారు… అయితే..?
Ads
సంఘ్ పరివార్ కార్యకర్తలు ఇల్లిల్లూ తిరగడం వెనుక అదనపు ఉద్దేశాలు కూడా ఉన్నయ్… అయోధ్యలో గుడికి నిధుల సమస్య లేదు… యాదాద్రికి తెలంగాణ ప్రభుత్వం 2000 కోట్లు ఖజానా నుంచి ఇచ్చినట్టుగా… మోడీ లేదా యోగి ఇస్తే సరిపోతుందనేది చాలామంది భావన… (సోమనాథ్ గుడిని గతంలో ప్రభుత్వమే నిర్మించింది…) కానీ రామాలయ నిర్మాణ ట్రస్టు దాన్ని తోసిపుచ్చింది… పార్టీలు, ప్రాంతాలు, మతాలు, కులాలకు అతీతంగా అందరినీ భాగస్వాములను చేయాలని తలపెట్టింది… అందుకే ఈ చందాల సేకరణ… కాంగ్రెస్ సహా ఇతర బీజేపీయేతర పార్టీల నాయకులు, కొన్నిచోట్ల హిందూయేతరులు కూడా చందాలు ఇచ్చారు… సో, రాముడి గుడి కేవలం బీజేపీ గుడి కాదు… ఆ గుడి కోసం అది పోరాడవచ్చుగాక, కానీ పూర్తిగా దానికి రైట్స్ లేవు… అది రాముని ఆరాధించేవారందరి గుడి… ఒక్క తెలంగాణలో తీసుకుంటే… 32 లక్షల కుటుంబాల్ని కార్యకర్తలు కలిశారు… దాదాపు 2.25 లక్షల మంది కార్యకర్తలు తిరిగారు… చందాలు ఇచ్చినవాళ్లంతా బీజేపీ కాదు కదా…!!
Share this Article