.
నటుడు శివాజీ ఇటీవల చేసిన వ్యాఖ్యలు, ఆపై వెంటనే చెప్పిన క్షమాపణలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి… ఈ నేపథ్యంలో వెటరన్ హీరో నరసింహ రాజు గారి గతాన్ని విశ్లేషిస్తే, తెలుగు సినీ పరిశ్రమలో “ముక్కుసూటితనం” ఎంత ఖరీదైనదో అర్థమవుతుంది.
సినిమా ‘సింహాసనాలు‘… నలిగిపోయిన ‘నరసింహ‘ రాజులు!
Ads
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక అలిఖిత నియమం ఉంది..: “ఇక్కడ టాలెంట్ కంటే టోన్ (స్వరం) ముఖ్యం…” అంటే.. ఎంత బాగా నటిస్తావన్నది కాదు, ఎంత బాగా స్వరం అదుపులో పెట్టుకుని, ఎంతగా లొంగి ఉంటావన్నదే ఇక్కడ కెరీర్‌ను డిసైడ్ చేస్తుంది.
శివాజీ ఎందుకు క్షమాపణ చెప్పాడు..? నిజం మాట్లాడటం వేరు, దాన్ని ‘పద్ధతి’గా చెప్పడం వేరు… శివాజీ వాడిన ఆ రెండు పదాలు (Unparliamentary words) ఆయుధాలయ్యాయి… క్షమాపణ చెప్పకపోతే ‘మా’ (MAA) అసోసియేషన్ నుండి మహిళా కమిషన్ దాకా, అటు నుండి పొలిటికల్ సెంటర్స్ దాకా ఇష్యూ వెళ్లేది…
కెరీర్ చిక్కుల్లో పడుతుంది… ఇప్పుడిప్పుడే కాస్త బిజీ అవుతున్నాడు… అది క్లోజ్ అయ్యే ప్రమాదం ఉంది… అందుకే, తన వాదనలో నిజమున్నా, లేకపోయినా… వాడిన పదాల విషయంలో వెనక్కి తగ్గి “సారీ” చెప్పేయడమే సేఫ్ అని ఫిక్స్ అయ్యాడు.
బాటమ్ లైన్…: ఇక్కడ బతకాలంటే ‘హిపోక్రసీ’ (కపటత్వం) టన్నుల కొద్దీ ఉండాలి… లేదంటే పాతాళానికి తొక్కేస్తారు!
ఫ్లాష్ బ్యాక్…: నరసింహ రాజు కెరీర్‌ను దెబ్బతీసిన ఆ ‘నిజం’! నేటి శివాజీకి జరిగినట్లే, 1977లో అప్పటి ‘ఆంధ్రా కమల్ హాసన్’ నరసింహ రాజు గారికి ఒక చేదు అనుభవం ఎదురైంది. అది ఆయన స్టార్ ఇమేజ్‌నే తుడిచేసింది…
ఏం జరిగింది..? (1977 దివిసీమ ఉప్పెన) తుఫాను బాధితుల కోసం ఎన్టీఆర్, ఏఎన్ఆర్ నేతృత్వంలో లారీలతో ఊరూరూ తిరిగి చందాలు వసూలు చేశారు. నరసింహ రాజు ఆ ఊరేగింపులో పాల్గొనలేదు. పైగా ఆయన ఒక మాట అన్నాడు…
"స్టార్స్ అంతా కలిసి తిరగడానికి అయ్యే ఖర్చు కంటే, అందరూ కలిసి ఒక 15 లక్షలు డొనేట్ చేస్తే సరిపోతుంది కదా! ప్రజల దగ్గర మళ్ళీ వసూలు చేయడం ఎందుకు?"
ఇది నిష్ఠురంగా ఉన్నా నిజం… కానీ ఆ మాట అగ్ర హీరోల అహాన్ని (Ego) దెబ్బతీసింది… పైగా తనే సొంతంగా లక్ష రూపాయలు డొనేట్ చేసినా ఎవరూ పట్టించుకోలేదు…
ఫ్యాన్స్ ‘పొగ‘… హీరోల ‘సెగ‘
అప్పటి స్టార్ హీరోల ఫ్యాన్స్ అసోసియేషన్లు ఆయన సినిమాలను అడ్డుకుంటామని వార్నింగ్‌లు ఇచ్చాయి… ఆశ్చర్యకరంగా ‘జగన్మోహిని’ లాంటి ఇండస్ట్రీ హిట్ కొట్టినా, నరసింహ రాజుకు అవకాశాలు రాకుండా ఇండస్ట్రీలోని పెద్దలు ‘బాయ్‌కాట్’ చేశారు… ఒక్క విఠలాచార్య, దాసరి నారాయణరావు తప్ప ఎవరూ ఆయన్ను పిలవలేదు…
రాజు గారి ప్రస్థానం…: వడ్లూరు నుండి కెనడా విల్లాల దాకా! నరసింహ రాజు జీవితం ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాంటిది. ఆయన జర్నీలోని కొన్ని ఆసక్తికర అంశాలు…
- తొలి చిత్రం…. నీడలేని ఆడది (1974)…
- గోల్డెన్ పీరియడ్… తూర్పు-పడమర, కన్య-కుమారి, ఇదెక్కడి న్యాయం…
- బిజినెస్ మైండ్…. దాసరి రిసార్ట్స్ మేనేజ్ చేస్తూ రోజుకు 40 వేల లాభం చూపించిన ఘనుడు…
- వారసత్వం…. కొడుకుని సినీ రొంపిలోకి దింపకుండా కెనడాలో సెటిల్ చేశాడు…
అప్పుడు నరసింహ రాజంటే క్రేజుండేది… సినిమా బ్యాక్ గ్రౌండ్ లేదు… ఎవరి పుష్ లేదు… 1980 లో రిలీజ్ అయిన పున్నమి నాగులో రాజు హీరో అయితే చిరంజీవి విలన్… చిరంజీవి ఈ స్టేజ్ కొచ్చాడు కదా… దానిపై మీ అభిప్రాయమేమిటి అనడిగితే… తడబడ లేదు… ‘‘అభిప్రాయం ఏముంది..? కష్టపడ్డాడు… పైకొచ్చాడు… కాలం అనుకూలించింది… చాలా జాగ్రత్తపరుడు… బాగా ప్లాన్ చేసుకున్నాడు… నేను ప్లాన్ చేసుకోలేదు… అప్పట్లో మాదాపూర్ లో 90 రూపాయలు అంకణం… కొనలేదు… మద్రాస్ లో ఉండే నాకు హైదరాబాద్ లో స్థలమెందుకులే అనుకున్నా…’’ అన్నాడు తను…
నేటి స్థితి…. 74 ఏళ్ళ వయసులోనూ చార్మ్ తగ్గలేదు… చక్రవాకం వంటి సీరియల్స్‌తో మెప్పించాడు… శివాజీ అయినా, నరసింహ రాజు అయినా… స్వరం అదుపులో ఉండాలి… అణకువ, వినమ్రత, అదుపు కనిపించాలి… ఆల్రెడీ చాన్నాళ్లుగా అజ్ఞాతంలోనే ఉన్నాడు… అందుకే శివాజీ తన వ్యాఖ్యల తరువాత వెంటనే రియలైజ్ అయ్యాడు…
- “క్షమాపణ” అనే కవచాన్ని తొడుక్కున్నాడు… ముక్కుసూటిగా ఉండటం గొప్పే కానీ, సినిమా ఇండస్ట్రీ లాంటి గ్లామర్ ప్రపంచంలో అది ‘ఆత్మహత్యా సదృశ్యం’… కాస్త తేడా కొట్టినా ఇక్కడ ఆదుకునేవాడు ఉండడు… ఆడుకునేవాళ్లు తప్ప… అన్నట్టు… నిన్న ఆయన బర్త్ డే… (సోషల్ మీడియాలో కనిపించిన కొన్ని పోస్టులకు కొంత అదనపు సొంత కవిత్వం)
Share this Article