Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఎగ్జిట్ పోల్స్… ఎప్పుడూ నిజం కావు… అలాగని అబద్దాలైపోవు…

June 3, 2024 by M S R

ఎక్జిట్ పోల్ లెక్కలు ఏమిటీ? అవన్నీ నిజమవుతాయా? అసలు ఎక్జిట్ పోల్ లెక్కలకి శాస్త్రీయత ఉందా? ఇది కేవలం సాంపుల్ సర్వే మాత్రమే!

ఎందుకంటే సర్వే చేసే ఏజెన్సీ లు సేకరించే డాటా ఎదైతో ఉందో అది కేవలం చాలా తక్కువ శాతానికి పరిమితం అవుతుంది.  మన దేశంలో ఉన్న ఓటర్ల సంఖ్య 100 కోట్లు అనుకుందాం, కానీ రాండమ్ గా సెకరించే డేటా 10 లక్షలకి మించదు. అదే ఎక్కువ సాంపుల్.

ఈ 10 లక్షల మంది ఓటర్లను, దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఓటు వేసి బయటికి వచ్చిన వాళ్ళని అడిగి తెలుసుకుంటారు.
అంటే డబ్బు, సమయం, మాన్ పవర్ తో ముడిపడి ఉంటుంది. ఈ విషయ సేకరణ కోసం కనీసం 5 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది కానీ ఇంత ఖర్చు పెట్టీ ప్రతీ మీడియా సంస్థ విషయ సేకరణ చేస్తుందా? బిగ్ క్వశ్చన్.

Ads

*********
2004 లో exit పోల్స్ విషయంలో NDA గెలుస్తుంది అని, వాజపేయి గారు రెండో సారి ప్రధాని అవుతారని జోస్యం చెప్పాయి. బీజేపీ స్వంతంగా 250 సీట్లు గెలుస్తుంది అని చాలా సర్వేలు చేప్పాయి కానీ బీజేపీకి 180 సీట్లు వచ్చాయి.

********
2014 లో NDA 250 కి పైగా సీట్లు వస్తాయి అని చెప్పాయి కానీ బీజేపీ స్వంతంగా 280 సీట్లు గెలిచి ఎవరి మద్దతు లేకుండానే ప్రభుత్వము ఏర్పాటు చేసింది.

********
2919 లో Axis – My India సర్వే చేసి NDA కి 353 మరియు UPA కి 93 సీట్లు వస్తాయి అని ప్రకటించింది. కౌంటింగ్ తరువాత ఇదే నిజమని తేలింది!

**********
So! 2019 లో Axis My India ఇచ్చిన రిపోర్ట్ ఏదయితే ఉందో అది 100% వాస్తవాన్ని ప్రతిబింబించింది కాబట్టి 2024 ఎన్నికల ఫలితాన్ని యావరేజ్ గా లెక్కిస్తే కాస్త అటూ ఇటుగా రేపటి ఫలితాలు ఏమిటో తెలుసుకోవచ్చు.

2024 exit పోల్స్ వివరాలు :
India Today,Axis My India – NDA 381 INDI 149 others 14.

News 24 ,Today’s Chanakya -NDA 400 INDI 107 others 36

ABP, C VOTER – NDA 368 INDI 167 others 8

TV 9. – NDA 342 INDI 166 others 35

Times now,ETG – NDA 358 INDI 132 others 53

News18 – NDA 363. INDI 133 others 47

NDTV INDIA,Jan ki baat NDA 375 INDI 153 oth 15

News Nation – NDA 360 INDI 161 others 22

RepublicTV,P MARQ- NDA 359 INDI 154 others 30

^^^^^^^^^^^^^
యావరేజ్ గా లెక్కిస్తే – NDA 367 INDI 147 others 29

******
పైన పేర్కొన్న గణాంకాలను బట్టి TV 9 లెక్క ప్రకారం NDA 342, INDI 166. ఇప్పుడు యావరేజ్ గా వచ్చిన సీట్ల సంఖ్య NDA 367, INDI 147 . కంక్లూజన్: తక్కువలో తక్కువ TV 9 ప్రొజెక్షన్ ను తీసుకోవచ్చు అలాగే ఎక్కువలో ఎక్కువ యావరేజ్ గా లెక్కిస్తే వచ్చిన సంఖ్యను తీసుకోవచ్చు.

*********
News 24, Today’s Chanakya సర్వే AXIS MY INDIA సర్వేకు దగ్గరగా ఉన్నాయి కదా! మరో ఉదాహరణ ఏమిటంటే………
2017 లో ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అన్ని exit పోల్స్ కూడా ఎవరికీ మెజారిటీ రాదు హంగ్ అసెంబ్లీ అని చెప్పాయి. కానీ కౌంటింగ్ తరువాత బీజేపీ 312 సీట్లు క్రాస్ చేసింది!

********
మరి ఆంధ్ర ప్రదేశ్ సంగతి ఏమిటో?
1. పెళ్ళికొడుకు వీడే కానీ వాడు వేసుకున్న డ్రస్ వాడిది కాదు!

2. పెళ్ళికొడుకు వీడే కానీ వాడు వేసుకున్న డ్రస్ గురుంచి నాకు తెలియదు.

3. పెళ్ళికొడుకు వీడే కానీ వాడు వేసుకున్న డ్రస్ గురుంచి నన్ను అడగవద్దు……… (విశ్లేషణ :: పోట్లూరి పార్థసారథి)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాకిస్థాన్ భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోయింది..!!
  • భారీగా బోరాన్ తరలింపు దేనికి..? ఆ అమెరికా విమానం ఏమిటి..?
  • ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!
  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…
  • అంతటి ప్రమాదకరమైన ఫ్యాక్టరీపై ఏమిటింత నిశ్చేష్టత..!?
  • ఆ సైంటిస్టులందరూ ఎక్కడెక్కడ ఉన్నారో గానీ ఆనందిస్తూనే ఉంటారు…
  • నిజమే… ఆడ వారసులు ఐతేనేం… కేసీయార్‌కు అస్సలు నచ్చదా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions