పెద్ద తోపు పత్రికను అని చెప్పుకునే ఈనాడుకు గానీ… దానికి తాతను నేను అని జబ్బలు చరుచుకునే సాక్షికి గానీ ఇలాంటి వార్తలు చేతనయ్యాయా ఒక్కటైనా..? అబ్బే, దమ్మున్న పత్రిక, దుమ్మురేపే పత్రిక ఆంధ్రజ్యోతికి మాత్రమే ఇలాంటి కొన్ని గట్స్ ఉన్నాయి… రాష్ట్ర గవర్నర్ల ఇళ్లల్లో, ప్రధాని కుర్చీ కింద, ముఖ్యమంత్రుల యాంటీ-రూమ్స్‌లో సైతం స్పయింగ్ నానో మైక్స్ పెట్టి, ట్రాక్ చేయగలిగిన ఆంధ్రజ్యోతి ఇప్పుడు అంతర్జాతీయంగా విస్తరిస్తోంది… దావోస్‌లో సైతం తన నెట్‌వర్క్ విస్తరించి, అక్కడికి వచ్చిన తెలంగాణ యాక్టింగ్ సీఎం కేటీయార్, ఏపీ అసలు సీఎం జగన్ జేబుల్లో కూడా సీక్రెట్ మైక్స్ పెట్టేసింది…
ఈ వార్త చూడండి…. మొన్న దావోస్ వెళ్లారు కదా జగన్, కేటీయార్… అక్కడ ఒకరినొకరు కలుసుకున్నారు… అలుముకున్నారు… ఇద్దరే ఓచోట కూర్చుని సేదతీరుతూ కష్టసుఖాలు వెళ్లబోసుకున్నారు… అక్కడ జరిగిన సంభాషణ ఏమిటో తెలుసా..? (ఆంధ్రజ్యోతి వార్తను బట్టి ఇది ఒక ఊహ… అసలు వార్తే ఒక ఊహ అయినప్పుడు, ఆ ఊహకు మరిన్ని ఊహల తోకలు తగిలిస్తే ఎలా ఉంటుందని…)
హేయ్ జగనన్నా, వాట్సప్… డల్‌గా ఉన్నవ్… ఎనీ ప్రాబ్లం…
Ads
బాగానే ఉన్నాను రామన్నా… ఫైన్, ఎవరీ థింగ్ ఈజ్ ఫైన్…
మీ సిస్టర్ పాదయాత్ర చేస్తుంది, మా ప్రభుత్వాన్ని రోజూ ఏదో విమర్శిస్తుంది, అసలు ఆమెకు దేనికి పాలిటిక్స్… నువ్వేమీ చెప్పలేదా..?
నేనూ అదే చెప్పాను బ్రదర్, వినడం లేదు… ఏదో సాధించేస్తా అంటుంది… అదేమంటే ముందుగా నా ఆస్తి నాకు పంచివ్వు అంటుంది…
అవునా… అయితే రాధాకృష్ణ అంకుల్ రాసేదంతా నిజమే అన్నమాట… అమ్మతో, చెల్లెతో గొడవలు ఉన్నాయా..? ఇవన్నీ డిస్టర్బ్ చేస్తుంటయ్… ఐనా మీ కుటుంబ సమస్య మా తెలంగాణకు సమస్య కావడం ఏమిటి..?
అది కాదు బ్రో… ఆమె పెళ్లయిపోయింది… వేరే ఇంటికి వెళ్లింది… ఆ తరువాత సంపాదించే ఆస్తిలో వాటా ఇచ్చేది ఏముంటుంది..? ఇప్పుడు మీ సిస్టర్ అడిగితే ఇస్తారా..? ఇవ్వరు కదా… ఇదీ అంతే…
మరి మీ అమ్మ కూడా ఆమెకే సపోర్టా..? కొడుకుతో ఉంటూ బిడ్డ పాట పాడితే ఎలా..?
చెప్పినా వినడం లేదు బ్రో… అమ్మలకు బిడ్డలంటేనే ఎక్కువ ప్రేమ కదా… ఇదీ అంతే…
సరే, ఏమైనా ఇష్యూస్ నేను సాల్వ్ చేయగలిగేవి ఉంటే చెప్పు బ్రో… నేను విన్నాను, నేను ఉన్నాను…
హేయ్, అది నా డైలాగు… (నవ్వులు…)
ఎహె, అంతా దగ్గరుండి విన్నట్టే రాశావేమిటి అంటారా..? అవును మరి, ఆంధ్రజ్యోతి వార్త కూడా అలాగే ఉందిగా… మరి ఇంత క్లియర్‌గా వాళ్ల నడుమ జరిగిన సంభాషణ ఎవరు చెప్పి ఉంటారు..? మాలో గొడవలున్నాయని కేటీయార్‌కు చెప్పాను అని జగన్ రాధాకృష్ణకు ఫోన్ చేసి చెప్పి ఉండడు… జగన్‌కు అసలే ఆంధ్రజ్యోతి అంటే మహా గొప్ప ప్రేమ… మారీచ ప్రేమ… సో, అది జరిగి ఉండదు…
ఇక మిగిలింది ఎవరు..? కేటీయార్..! అంటే… మొన్న దావోస్‌లో జగన్ ఇలా చెప్పాడు అంకుల్ అని కేటీయారే రాధాకృష్ణకు కాజువల్‌గా చెప్పి ఉంటాడా..? మంచి న్యూస్ స్టోరీ అవుతుంది, రాసుకో అంకుల్ అని ఎగదోసి ఉంటాడా..? నో, నో, చాన్సే లేదు… తనకే లక్ష పనులు… సీఎంగా వర్క్ ఈజీ… యాక్టింగ్ సీఎంగా పని కష్టం కదా… సో, ఆ ఇద్దరిలో ఎవరో ఒకరి జేబులో ఆర్కే బ్రాండ్ స్పయింగ్ నానో మైక్ పెట్టబడిందని లెక్క… వామ్మో, నువ్వు అసాధ్యుడివి ఆర్కే సార్…!!
Share this Article