2002 నుంచీ సినిమాలు చేస్తోంది త్రిష… అంటే 21 ఏళ్లు… ఇండియన్ సినిమాలో సగటు హీరోయిన్ ఆయుష్షుతో పోలిస్తే చాలా ఎక్కువ… ఆమధ్య ఇక త్రిష పనైపోయిందన్నారు అందరూ… ముసలిదైపోయింది, వట్టిపోయిందని తిట్టిపోశారు… 96తో మళ్లీ పట్టాలెక్కిన ఆమె పొన్నియిన్ సెల్వన్‌లో పాత త్రిషను గుర్తుచేసింది… అయిపోయిందని కూసిన నోళ్లు మూతపడ్డాయి… ఇప్పుడు ఆమె చేతిలో ఉన్నవి పొన్నియిన్ సెల్వన్ సీక్వెల్ గాకుండా నాలుగు సినిమాలు…
నలభయ్యేళ్ల వయస్సొచ్చినా సరే, పాతకలోపే అన్నట్టు కనిపిస్తున్న త్రిష చేతిలో ఉన్న లియో సినిమా తాజా సంచలనం… అంత వయస్సొచ్చింది కదాని వెటరన్ హీరోయిన్ల పక్కన కనిపించడం లేదు… లియో సినిమా హీరో విజయ్… ఆ సినిమా రికార్డు ఏమిటంటే ఇప్పుడు అప్పుడే అది 400 కోట్ల బిజినెస్ చేసేసింది… సౌత్‌లో ఏ సినిమాకూ బహుశా ఈ రేంజ్ రికార్డు లేదు కావచ్చు…
Ads
లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో చేసే ఈ సినిమాలో సంజయ్ దత్, అర్జున్ కూడా నటిస్తున్నారు… విక్రమ్ సినిమాతోనే బోలెడు రికార్డులు కొల్లగొట్టాడు లోకేశ్ కనగరాజ్… ఇక ఇప్పుడు విజయ్ సినిమాను ప్రకటించగానే ఎక్కడా, ఎప్పుడూ లేనంత హైప్ క్రియేటైంది… బ్లడీ స్వీట్ అనే ట్యాగ్ లైన్‌తో వస్తున్న లియో సినిమా ఓ గ్యాంగ్‌స్టర్ సినిమా… ఇప్పుడు ట్రెండ్ అదే కదా మరి…
వస్తున్న వార్తల ప్రకారం… శాటిలైట్, డిజిటల్, మ్యూజిక్, థియేటరికల్ రైట్స్ అన్నీ కలిపి 400 కోట్ల ప్రిరిలీజ్ రికవరీ… అంటే రిలీజుకు ముందే 400 కోట్లు చేతుల్లో పడ్డట్టు లెక్క… తమిళ్, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో ప్రసారానికి నెట్‌ఫ్లిక్స్ వాడు ఏకంగా 120 కోట్లు ఇస్తున్నాడు… సెన్సేషనల్ రేట్ ఇది… శాటిలైట్ రైట్స్‌కు కూడా రికార్డు స్థాయి రేట్ పలికింది, హిందీ గాకుండానే సన్ టీవీ వాళ్లు 70 కోట్లు ఇస్తున్నారు… సోనీ మ్యూజిక్ వాళ్లు 18 కోట్లు ఇస్తున్నారు, కాగా హిందీ డబ్ శాటిలైట్ రైట్స్ కోసం సెట్ మ్యాక్స్, గోల్డ్ మైన్స్ పోటీపడుతున్నయ్… అది కనీసం 30 కోట్లు తీసుకొస్తుంది…
ఇవే 240 కోట్లు కాగా… 175 కోట్ల మేరకు థియేటరికల్ డీల్స్ క్లోజయ్యాయి… ఇందులో 50 కోట్లు ఓవర్సీస్, తమిళనాడులో 75 కోట్లు… కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిపి 35 కోట్లు, మిగతా రాష్ట్రాల్లో 15 కోట్లు… విషయంలోకి వద్దాం… ఇంతటి ప్రిస్టేజియస్ ప్రాజెక్టుకు కూడా త్రిషను తీసుకున్నారు నిర్మాతలు, దర్శకుడు… హీరో కూడా వోకే అన్నాడు… అదీ త్రిష తాజా డిమాండ్…
ప్రిరిలీజ్ దశలోనే ఈ రేంజ్ బిజినెస్ జరగడం తమిళ సినిమాకు సంబంధించి ఇదే రికార్డు కాగా… సినిమా ఓ మోస్తరుగా ఉన్నా సరే, మొత్తం వసూళ్లు దుమ్మురేపడం ఖాయం… హిందీ సినిమా ఇంకా గాడినపడటం లేదు గానీ సౌత్ సినిమా కరోనా సంక్షోభం నుంచి వేగంగా బయటపడి, పూర్వ వైభవం… కాదు, దాన్ని మించి దూసుకుపోతోంది…!!
Share this Article