వ్యభిచార వృత్తి నేరం కాదు… కానీ వ్యభిచార వ్యాపారం నేరం… ఆడవాళ్లను ఆ ఊబిలోకి దింపడం నేరం… కానీ ఒక మహిళ తన కడుపు కోసం ఒళ్లప్పగిస్తే నేరం కాదు… వ్యభిచారిణులు కూడా మనుషులే… అందరిలాగే వాళ్లకూ హక్కులున్నాయి……. సుప్రీంకోర్టు మరోసారి కుండబద్ధలు కొట్టినట్టు చెప్పింది… చెప్పడానికి కోర్టు అత్యంత అరుదుగా వాడే ఆర్టికల్ 142 ప్రయోగించింది… (మొన్న రాజీవ్ హంతకుడు పెరారివలన్‌ను విడుదల చేయడానికి ఈ ఆర్టికల్ ఉపయోగించింది కోర్టు… సేమ్ బెంచ్…)
అసలు ఏమిటి తేడా..? వ్యభిచార వృత్తి నేరం కానప్పుడు, ఇక ఆ దందా నేరం ఎలా అవుతుంది అనేది చాలామందిలో ప్రశ్న… కానీ తను స్వచ్ఛందంగా ఆ వృత్తిలో ఉంటే అది నేరం కాదు, ఆర్గనైజ్డుగా దందా నడిపిస్తే అది నేరం… ఈ క్లారిటీ ఇచ్చిన సుప్రీంకోర్టు పోలీసులు వాళ్ల పట్ల క్రూరంగా వ్యవహరించడాన్ని ఆక్షేపించింది… అంతేకాదు, మీడియా కూడా వాళ్ల ఫోటోల్ని పబ్లిష్ చేయరాదని ఆదేశించింది…
వ్యభిచారం అంటేనే డబ్బుకు ఒళ్లు అమ్ముకోవడం… అయితే స్వచ్చంద వ్యభిచారాన్ని ఓ వృత్తిగా పరిగణించినప్పుడు, అలాంటి కేసుల్ని ఏ కోర్టు కూడా విచారణకు స్వీకరించకుండా… ఈ కేసులు నమోదు చేసే పోలీసులపైనా చర్యలు తీసుకునేలా ‘పరిమితులు’ విధిస్తే బాగుండేదేమో అనిపించింది సుప్రీం ఆదేశాలు చదివిన తర్వాతు…! ఎలాగూ ఆర్టికల్ 142 ఉపయోగించింది కదా కోర్టు, అంటే ‘‘సంపూర్ణ న్యాయం’’ కోసం కోర్టు అసాధారణ అధికార వినియోగం… మంచిదే… అత్యంత పురాతనమైన ఈ వృత్తి ఇది… దీన్ని ‘జీరో’కు తీసుకువెళ్లడం అసాధ్యం… కాకపోతే పిల్లల్ని, మహిళల్ని ఎత్తుకుపోయి, వ్యభిచార కంపెనీల్ని నడిపే మాఫియాల వెన్నువిరగాలి…
Ads
మొన్న ఏదో ఓ కేసులో విటుడిపై కేసు పెట్టడాన్ని కూడా ఓ కోర్టు కొట్టిపారేసింది… తను కస్టమర్ మాత్రమే, నేరస్థుడు కాదు అని వ్యాఖ్యానించింది… సో, రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టు స్పూర్తితో ఇంకాస్త మానవీయ దృక్పథాన్ని ప్రదర్శించవచ్చు… ఆ వృత్తిని చట్టబద్ధం చేయడం, లైసెన్సులు ఇవ్వడం వంటి విప్లవాత్మక నిర్ణయాలు కాదు గానీ… వ్యభిచారిణులకు వేధింపులు, వాళ్లను కూడా దోపిడీ చేసే అధికార దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయవచ్చు… ఆ దిశలో స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేయవచ్చు… వాళ్ల ఆరోగ్యం, సంక్షేమాన్ని తన బాధ్యతగా గుర్తించవచ్చు… వాళ్ల మైనర్ పిల్లల చదువూసంధ్య గురించి ఆలోచించవచ్చు…
ఐపీసీ 354సీ ప్రకారం చర్యలు గనుక తీసుకుంటే… ఇకపై హైటెక్ వ్యభిచారం గుట్టురట్టు… ఇద్దరు విటుల పట్టివేత… నలుగురు వ్యభిచారిణుల అరెస్టు అంటూ ఘనంగా రాయించుకునే వార్తలకు ఇక ఫుల్‌స్టాప్ పడితే బెటరే… పెద్ద కుట్రలేవో చేధించినట్టుగా… కుంభకోణాల్ని బయటపెట్టినట్టుగా వార్తల్లో కనిపించే ఫోజులు చూసే బాధ కూడా తప్పుతుంది…
Share this Article