.
నచ్చింది ఈ వార్త… నచ్చింది ఈ వివాహం… నిజంగా సమాజం దీన్ని ఆదర్శంగా తీసుకుంటే బాగుండు… విషయం ఏమిటంటే..?
చౌటుప్పల్ మండలం, లింగారెడ్డిగూడెం, ఈ ఊరికి చెందిన శేషాద్రిని రెడ్డి ఐపీఎస్ అధికారి… కుత్బుల్లాపూర్ డీసీపీ ప్రస్తుతం… కడప జిల్లాకు చెందిన ఐఏఎస్ అధికారి శ్రీకాంత్ రెడ్డి… ప్రస్తుతం ఐఏఎస్ ట్రెయినింగులో ఉన్నాడు…
Ads
ఇద్దరూ సింపుల్‌గా… చాలా చాలా సింపుల్‌గా రిజిష్టర్ ఆఫీసులో పెళ్లి చేసుకున్నారు… మరీ దగ్గరైన వారు హాజరయ్యారు… సంతకాల పెళ్లి, దండల పెళ్లి, రిజిష్టర్ పెళ్లి… మీరు పేరు ఏదైనా పెట్టుకొండి… చౌటుప్పల్ రిజిష్టరాఫీసులో జరిగిన ఈ పెళ్లికి పలువురు ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు…
దేశంలో అత్యున్నత కేంద్ర సర్వీసులో ఉన్నారు… ఎంతయినా ఖర్చు పెట్టగలరు… ఐనా వెరీ వెరీ సింపుల్ మ్యారేజీకే మొగ్గుచూపారు ఇద్దరూ… ఇదీ అభినందనీయం… బయట ట్రెండ్ చూస్తున్నాం కదా…
మ్యారేజీ హాళ్లు, డెకరేషన్, ఫుడ్, ఈవెంట్లకు ఎంతెంత ఖర్చు పెడుతున్నారో… అవి గాకుండా రిసెప్షన్, సంగీత్, హల్దీ, మంగళస్నానాలు, బ్యాచిలర్ పార్టీలు… ప్లస్ ప్రి-వెడింగ్ షూట్స్… అడ్డగోలు ఖర్చులు.,.. ఒకరిని చూసి మరొకరు… తగ్గేదే లేదంటూ మధ్య తరగతి… దిగువ మధ్యతరగతి వాతలు…
పరువు కోసం… లక్షల ఖర్చు పెడుతున్నారు… అప్పులు తెస్తున్నారు… వ్యయంతోపాటు ప్రయాస… ఈరోజుల్లో పనులన్నీ సంభాళించేవాళ్లు ఎవరున్నారు..? ఎవరి బతుకులు వాళ్లవే… టైమ్‌కు వచ్చి, అక్షింతలు వేసి, భోంచేసి వెళ్లేవారే… పొద్దున పెళ్లయితే సాయంత్రానికి పురుగు కూడా ఉండదు…
సంగీత్ డాన్సులు నేర్పించడానికి కూడా డబ్బు… తీరా అవేమిటి..? రికార్డింగ్ డాన్సులు… అందరూ డాన్సులు చేయాల్సిందేనట… అదొక దరిద్రపు కల్చర్… అన్నీ మనకు మనమే నెత్తికి రుద్దుకుంటున్నాం… హల్దీ వరకు వోకే… పసుపులు పట్టడం లేదా కొట్టడం…
పెళ్లిళ్లలో కూడా వోన్లీ తాళికట్టడం, భోజనాలు, ఇతరత్రా తంతు మాత్రమే కాదు… రకరకాల ఈవెంట్లు పెడుతున్నారు… పెళ్లి కొడుకును తీసుకురావడం, పెళ్లి కూతురును తీసుకురావడం, ఆర్కెస్ట్రా ఎట్సెట్రా… ‘లైఫ్ లాంగ్ మెమొరీ’ ‘వన్ టైమ్ మెమొరీ’ పేరిట ఎక్కడా తగ్గని పెళ్లికూతురు, పెళ్లికొడుకు…

అందుకే ఈ రిజిష్టర్ మ్యారేజీ నచ్చింది... గతంలో కమ్యూనిస్టులు స్టేజ్ మ్యారేజులను ప్రోత్సహించేవాళ్లు... ఇప్పుడు ఆ ప్రభావం ఉన్న కుటుంబాలు కూడా ఈ ఆడంబరపు పెళ్లిళ్ల మందలో కలిసిపోయాయి... ప్చ్..!!
Share this Article