యుద్ధం అంటే వ్యూహాలు… అపారమైన ఆయుధసంపత్తి మాత్రమే కాదు, వాటిని తెలివిగా వాడే ఎత్తుగడలు ముఖ్యం… పాలస్తీనాలో హమాస్ ఉగ్రవాదులకూ, ఇజ్రాయిలీ సైన్యానికీ నడుమ నిత్యమూ యుద్ధమే… హమాస్ ఆయుధసంపత్తిలో గానీ, తెగబడి పోరాడే సైనికుల సంఖ్యలో గానీ, ఏళ్ల తరబడీ పోరు సలపగల సామర్థ్యంలో గానీ ఇజ్రాయిల్ దళాలకు ఏమీ తీసిపోదు… 36 గంటల్లో 1500 రాకెట్లను ప్రయోగించిందీ అంటే దాని కెపాసిటీ రేంజ్ ఏమిటో అర్థం చేసుకోవాల్సిందే… రెండు వర్గాల మధ్య ఇప్పుడు భీకరమైన సమరం సాగుతోంది… ది జెరూసలెం పోస్ట్‌లో ఓ ఆసక్తికరమైన వార్త కనిపించింది… దాని సారాంశం చెప్పుకుందాం…
హమాస్ రాకెట్లను వర్షంలా కురిపిస్తోంది… ఇజ్రాయిలీ రక్షణకవచం ఐరన్ డోమ్ ఆ రాకెట్లలో దాదాపు 80, 90 శాతాన్ని మధ్యలోనే అడ్డుకుని ధ్వంసం చేస్తున్నాయి… ఈ దశలో ఇజ్రాయిలీ రక్షణ దళం (IDF… Israel defence forces) తెలివిగా ఓ పనిచేసింది… ఓ రాత్రిపూట గాజా సరిహద్దుల వద్దకు ఇజ్రాయిలీ పదాతిదళం చేరుకోసాగింది… ట్యాంకుల్ని తరలిస్తున్నారు… 160 దాకా యుద్ధవిమానాలను మొహరించారు… అంటే యుద్ధక్షేత్రాన్ని పరిశీలిస్తున్నవాళ్లకు తోచేది ఒకటే… ఇజ్రాయిల్ సైన్యం గాజాలోకి ఎంటర్ కాబోతోంది అని..! అదిక రెండు దేశాల నడుమ ప్రత్యక్ష యుద్ధమే అని..! పాలస్తీనాలోని ఇజ్రాయిల్ వైరివర్గాలు కూడా గమనిస్తున్నయ్… అర్ధరాత్రి ఐడీఎఫ్ ఓ ట్వీట్ వదిలింది… ‘‘ఐడీఎఫ్ గగన, పదాతిదళాలు గాజా మీద దాడులకు దిగాయ్’’ అనేది ఆ ట్వీట్…
Ads
IDF air and ground troops are currently attacking in the Gaza Strip.
— Israel Defense Forces (@IDF) May 13, 2021
ఇంకేముంది..? ఈ ట్వీట్ ఆధారంగా అప్పటికప్పుడు వాషింగ్టన్ పోస్ట్, ఏబీసీ తదితర ఫారిన్ మీడియా వాటికి తోచిన బాష్యాలు చెప్పుకుని చకచకా వార్తలు అల్లేశాయి… ఇజ్రాయిల్ సైన్యం గాజాలోకి ఎంటర్ అవుతోందని రాసేశాయి… ట్వీట్లు కొట్టాయ్… సైట్లలో ఫ్లాష్ ఫ్లాష్ అంటూ స్క్రోలింగులు వదిలాయ్… ఈ యుద్ధం చాలా దూరం పోతోందని టీవీల్లో వార్తలు వచ్చేశాయి… హమాస్ ఏం చేసింది..? తన మెట్రో నుంచి ప్రథమశ్రేణి ట్యాంకుల్ని, సైనికుల్ని సరిహద్దుల వైపు తరలించడానికి రెడీ అయిపోయింది… ఇక్కడ మెట్రో అంటే ఏమిటంటే..? కొన్ని కిలోమీటర్ల కొద్దీ అండర్ గ్రౌండ్ నెట్వర్క్… సొరంగమార్గాలు తవ్వి, అందులో కీలకమైన ఆయుధాల్ని, బలాల్ని మెయింటెయిన్ చేస్తుంటుంది… ఎప్పుడైతే ప్రథమశ్రేణి బయటికి వచ్చిందో… ఆయా సొరంగాల ప్రవేశ, నిష్క్రమణ ప్రదేశాలు ఎక్స్పోజ్ అయిపోయాయి… వెంటనే ఇజ్రాయిల్ ఫైటర్ విమానాలు వెళ్లి బాంబింగ్ మొదలుపెట్టాయి…
కొన్ని కిలోమీటర్ల కొద్దీ మెట్రోను ధ్వంసం చేశాయి విమానాలు… నిజానికి ఇజ్రాయిల్ వదిలిన ట్వీట్ హమాస్‌ను తప్పుదోవ పట్టించడం కోసమే… అంతే తప్ప ఇజ్రాయిల్ ట్యాంకులు, సైనికులు గాజాలోకి ఒక్క అంగుళం కూడా చొరబడలేదు… సరిహద్దులో మొహరించారు అంతే… కొన్నిచోట్ల హమాస్ మెట్రో ధ్వంసం అయిపోయింది, ఎంతమేరకు ఆయుధసంపత్తిని కోల్పోయింది, ఎందరు సైనికుల్ని కోల్పోయిందో వివరాల్లేవు… కానీ ఈ యుద్ధం ఇప్పుడప్పుడే ఆగిపోయే సూచనలు మాత్రం కనిపించడం లేదు…!
Share this Article