ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే రోడ్డు పక్కన ఓ ముసలామె వేసే దోసెలు తిన్నాడట… అబ్బో అంటూ వార్తలు… ఫోటోలు… ప్రచారం… సో వాట్..? ఆమె జీవితానికి వచ్చిన అదనపు ఫాయిదా ఏముంది దాంతో..?! ఓ పాపులర్ హీరోకు ఎక్కడా ఏమీ దొరక్క, రోడ్డు పక్కన చిన్న బడ్డీ హోటల్‌లో టిఫినీలు చేశాడట… మస్తు ప్రచారం, ఫోటోెలు, ఆహా, ఓహో, కీర్తనలు… సో వాట్..? ఆ హోటల్ వాడికి వచ్చిన ఫాయిదా ఏమిటట..?! రెండు ఉదాహరణల్లోనూ వీళ్లేదో పెద్ద ఔదార్యం కనబర్చినంత బిల్డప్… డిఫరెంట్ ఉదాహరణ ఒకటి చూద్దాం…
మరీ సోనూ సూద్ దాకా అక్కర్లేదు… ఆనంద్ మహేంద్ర అనే పారిశ్రామికవేత్త తెలుసు కదా… సోషల్ వార్తలకు స్పందిస్తుంటాడు… అప్పుడెప్పుడో 2019 సెప్టెంబరులో ఓ సోషల్ పోస్టు చదివాడు… వెంటనే రియాక్టయ్యాడు… ఆ పోస్టు ఏమిటీ అంటే..? ఓ పండు ముసలామె ఇడ్లీలు పోస్తూ, కట్టెల పొయ్యి మీద కష్టాలు పడి వండుతూ… రూపాయికి ఇడ్లీ చొప్పున అమ్ముతోంది… ఇదీ ఆ పోస్టు… కరోనా సంక్షోభంలో సైతం ఆమె తను వెనక్కి పోలేదు…
అసలు ఆ రేటు కాదు ఇక్కడ చెప్పుకోదగింది… 1) ఆ వయస్సులోనూ ఆమె రోజుకు వెయ్యి దాకా ఇడ్లీలు పోస్తూనే ఉంది… 2) చిన్న గుడిసెలో హోటల్… ఆమె ఒక్కతే సప్లయర్, క్లీనర్, చెఫ్, ఓనర్ ఎట్సెట్రా… 3) ఎన్నేళ్లవుతున్నా, ఇడ్లీ తయారీకి కావల్సిన సంభారాల ధరలు కూడా మండిపోతున్నా ఆమె ఆ రూపాయి మాత్రమే తీసుకుంటోంది… 4) నా దగ్గరకు వచ్చేవాళ్లంతా రోజువారీగా పొట్టపోసుకునే కార్మికులు, పోనీలే, వాళ్ల ఆకలి కడుపులు నిండితే చాలు అంటున్నదామె… 5) అసలు అయిదు రూపాయిలు తీసుకుని అయిదు ఇడ్లీలు ఇవ్వడం అనేది ఈరోజుల్లో ఓ అద్భుతమే కదా… 6) కృష్ణారామా అనుకుంటూ గడిపేయడం లేదామె… ఈ వయస్సులోనూ సొసైటీ కన్సర్న్‌గా రెక్కలు ముక్కలు చేసుకుంటోంది… ఆమె పోసే మెత్తని, తెల్లటి ఇడ్లీల్లాంటి ఆ స్పిరిట్ ప్రశంసనీయం…
Ads
ఆమెను అక్కడి వాళ్లు ఇడ్లీ అమ్మ అనే పిలుస్తారు… అసలు పేరు కమలథాల్…ఈ వీడియోను ఆనంద్ మహీంద్ర కూడా చూశాడు… బహుశా అందరిలాగే కాసేపు షాక్‌లో ఉండిపోయాడేమో… ‘‘ఆమె వ్యాపారంలో పార్టనర్ అవుతాను, ఇన్వెస్ట్ చేస్తాను’’ అని ట్వీటాడు… అంటే, ఆమెకు సాయపడి, తనూ కొంత పుణ్యం సంపాదించాలని… ఏదో ట్వీటాడు కానీ ఏం చేస్తాడులే అనుకున్నారు చాలామంది…
One of those humbling stories that make you wonder if everything you do is even a fraction as impactful as the work of people like Kamalathal. I notice she still uses a wood-burning stove.If anyone knows her I’d be happy to ‘invest’ in her business & buy her an LPG fueled stove. pic.twitter.com/Yve21nJg47
— anand mahindra (@anandmahindra) September 10, 2019
ఆమెకు ఏం కావాలో ప్లాన్ చేయండి అని తన టీంకు చెప్పాడు… ఈలోపు అక్కడి స్థానిక గ్యాస్ డీలర్ ఎవరో ఆమెకు ఒక గ్యాస్ స్టవ్వు, సిలిండర్ ఇచ్చాడు… ఈ వయస్సులో పొగ నడుమ ఆమె కట్టెల పొయ్యి మీద ఇడ్లీలు పోయడం తప్పించడానికి, ఆమె స్పిరిట్‌కు జేజేలు పలకడానికి..! ఆనంద మహేంద్రుడు ఏం చేశాడు..? ఆమెను మరిచిపోలేదు… ఇన్‌ఫ్రా వ్యవహారాలు చూసే ఒక విభాగం ఉంది తన కంపెనీకి… వెళ్లారు, కొన్ని స్థలాలు వెతికారు, అక్కడే ఉన్న ఆ స్థలాన్నే కొన్నారు… ఆమె పేరిట రిజిస్ట్రేషన్ కూడా పూర్తయింది కొన్నాళ్ల క్రితం… అక్కడ ఆమె అవసరాల మేరకు హోటల్ కమ్ రెసిడెన్స్ కట్టేయడానికి రెడీ అయిపోయారు… దాన్నే మళ్లీ ట్వీట్ చేసి, నేను మరిచిపోలేదండోయ్ అని నెటిజన్లకు గుర్తుచేశాడు @anandmahindra
எல்லோருக்கும் சந்தோஷம் கொடுக்க தன் வாழ்க்கையை அர்ப்பணம் செய்தவர்க்கு, சிறிது சந்தோஷம் கொடுக்கும் முயற்சியை விட வேறு ஒரு பெரிய சந்தோஷம் இல்லை. pic.twitter.com/KCN7urkSTG
— anand mahindra (@anandmahindra) May 8, 2022
ఓ ఇల్లు కట్టేశారు… అమ్మల దినోత్సవం సందర్భంగా ఆమెకు అప్పగించారు… ఆమె ఇడ్లీ అమ్మకాలకు ఉపయోగపడేలా మంచి కిచెన్ కూడా కట్టారు… సో, ఇదీ నిర్మాణాత్మక సాయం… అఫ్‌కోర్స్, ఒక్క ఆనంద్ మహేంద్ర అందరినీ ఇలాగే, అవసరాలున్న కోట్ల మందిని ఉద్దరించకపోవచ్చు కానీ తను స్పందించిన తీరు అభినందనీయం… ఓ మాట చెప్పుకోవాలి… తమిళనాడులో ఎన్నికలొస్తే ప్రతి పార్టీ అది ఫ్రీ, ఇది ఫ్రీ, ఇదుగో ఇలా ఉద్దరిస్తాం, మేమే వండి నోట్లో పెడతాం, జస్ట్, తిని పెట్టండి చాలు అన్నట్టుగా హామీలు ఇస్తుంటయ్… ఏటా వేలకువేల కోట్లు ఫ్రీ పథకాలకే ఖర్చు చూపిస్తున్నయ్… దిక్కుమాలిన బోలెడు ఖర్చు… ప్రతి పార్టీకి కార్యకర్తలు, నాయకులు, వాళ్ల సంపాదనలు… ఉన్నతాధికారులు, పాలన బాధ్యులు, వాళ్ల ఖర్చులు, వాళ్ల అవినీతి….
ఆమె చుట్టూ అంత కాలుష్యం… ఆ గ్యాస్ సిలిండర్ ఇచ్చిన ఆ ఒక్కడు తప్ప… ఆ సోషల్ పోస్టు చూసి ఇల్లు కట్టించిన ఈ ఆనంద మహేంద్రుడు తప్ప… ఆమె కథ విని సాయం చేసిన ఒక్క చేయి లేదు ఆమె చుట్టూ ఉన్న సమాజంలోె… సపోర్టుగా నిలబడిన ఒక మనిషి లేడు… ఎవరూ తోడు లేకపోయినా సరే, ఈ వయస్సులోనూ తనకంటూ ఓ స్పూర్తితో బతుకుతున్న ఆ అవ్వకు స్థానిక సమాజం కూడా ఏమివ్వగలిగింది..? మన రాజకీయ, పాలన వ్యవస్థల్లోని అసలైన డొల్లతనానికి కూడా ఈ అమ్మ కథ గొప్ప ఉదాహరణ…!!!
Share this Article