.
గాయత్రి భార్గవ… ఓ తెలుగు నటి… భర్త ఆర్మీ ఆఫీసర్… ఇద్దరు కొడుకులు… ఆమధ్య, అంటే కొన్ని నెలల క్రితం ఇంటర్వ్యూయర్ స్వప్నతో ఓ చిట్‌చాట్… ఐడ్రీమ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ అది… సరే, ఆమె ఏదో అడిగింది, ఈమె ఏదో చెప్పింది… అయిపోయింది…
సహజంగానే మన యూట్యూబ్ చానెళ్ల పైత్యం తెలుసు కదా… తమకు అలవాటైన రీతిలో ఏదో పిచ్చి థంబ్ నెయిల్ పెట్టాడు ఓ ఉద్యోగి… ఏమనీ..? ‘మంచులో కూరుకుపోయి మరణించాడు, బాడీని ముక్కలు చేసి బాక్సులో పంపించారు, రాత్రిళ్లు నిద్రపట్టేది కాదు’ అని..!
Ads
నిజానికి కంటెంటులో ఉన్నది తన భర్త మరెవరో ఓ సైనికుడి గురించి తనకు చెప్పిన విషయం… తీరా థంబ్ నెయిల్ చూస్తే గాయత్రికే ఆ అనుభవం అన్నట్టుగా ఉంది… ఎస్, నీచమే… దీంతో ఆమె ఓ వీడియో రిలీజ్ చేసి సదరు చానెల్‌పై మండిపడింది… తన భర్త తన పక్కనే ఉన్నాడని చూపించి, ఆర్మీకి మీరిచ్చే గౌరవం ఇదేనా..? క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేసింది,..
సరైన డిమాండ్… నిన్నామొన్న ఇతర సోషల్ మీడియా ఆమె వివరణను, బాధను హైలైట్ చేస్తూ రచ్చ చేసేశాయి… ఐడ్రీమ్ ఫుల్లు డిఫెన్సులో పడిపోయింది.., ఆమెకు, ఆమె భర్తకు ఫోన్ చేసి మీడియా బాధ్యులు క్షమాపణ చెప్పారు… అంతేకాదు, ఇలాంటి థంబ్ నెయిళ్లు మా విధానం కాదు, జరిగింది తప్పే, ఆ ఉద్యోగిని తొలగించాం, ఇకపై ఇలాంటివి పునరావృతం కానివ్వం అని పేర్కొంది ఓ బహిరంగ లేఖలో…
గ్రేట్… బాధ్యత వహించి, తప్పు అంగీకరించి, ఇలాంటి థంబ్ నెయిళ్లు మా పాలసీ కానేకాదని, మరింత జాగ్రత్తగా ఉంటామని ప్రకటించింది ఒక మీడియా సంస్థ… అభినందనీయమే… ఐతే ఈ థంబ్ నెయిల్ పైత్యం ఇప్పటిది కాదు, దరిద్రమైన థంబ్ నెయిళ్లతో యూట్యూబ్ చానెళ్లు చెత్త చెత్త చేసేశారు జర్నలిజాన్ని… (జర్నలిజం అని మనం అంగీకరిస్తే…)
కానీ ఎవరూ ఎవరికీ క్షమాపణ చెప్పరు, అసలు ఈ తరహా పోకడ తప్పు అని అంగీకరించరు… ఈమేరకు ఐడ్రీమ్‌ను అభినందిద్దాం… ఇప్పుడు చెబుతున్న పాలసీకి కట్టుబడి ఉండాలనీ కోరుకుందాం… ఎందుకంటే, వాళ్లే చెబుతున్నట్టు రోజుకు 4 వేల వీడియోలు అప్‌లోడ్ అవుతున్నాయట…
నిజానికి థంబ్ నెయిల్స్ ఎంత ప్రమాదమో… అంతకుమించి ప్రమాదం కంటెంటు… వైద్య సలహాలు, మూఢనమ్మకాలు, అతిశయోక్తులు, అబద్ధాలు, వక్రబాష్యాలు… వాట్ నాట్..? పెంట పెంట… సొసైటీకి యూట్యూబ్ కంటెంట్ ఓ పెద్ద కరోనా రోగం ఇప్పుడు… పెద్ద పెద్ద మీడియా సంస్థలు పెద్ద పెద్ద కార్లు, భారీ జీతాలు ఇస్తున్నాయీ అంటే… ఎందుకు ఇవ్వవు..?
ఇదుగో ఇలాంటి కంటెంటుతో యూట్యూబ్ నుంచి కోట్లకుకోట్లు వస్తుంటే..! సెన్సార్ లేదు, కేసుల బాధల్లేవు, ఇదేమిటని అడిగేవాడు లేడు… ఎవడు ఏది రాసినా చలామణీ… సో, ఐడ్రీమ్‌కు ఒక సూచన… మీ క్షమాపణ, మీ పాలసీ గుడ్… కంటెంటు విషయంలోనూ నైతికతను, ప్రమాణాల్ని పాటించాలి అని… మీరు మొదలుపెడితే కనీసం మిగతా వాళ్లయినా మీ బాటలో నడవాలని ఆశ… ఆకాంక్ష… సుమన్ టీవీ ఈ మొత్తం వ్యవహారాన్ని చూస్తున్నదనే మన నమ్మకం… ఎందుకంటే ఎక్కువ విమర్శలు దానిపైనే కాబట్టి..!
(ఆ సారీ లేఖలో కూడా ఓ పొరపాటు… ఆమె భర్త పేరు నాకు తెలిసి విక్రమ్, లేఖలో విజయ్ అని రాసి ఉంది…)
అవునూ… కేంద్రానికి వెబ్ కంటెంటు మీద అదుపు ధ్యాస ఎలాగూ లేదు… సోషల్ మీడియా ముసుగు ఫేక్ జర్నలిజంపై మండిపడుతున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఓ పాలసీని రూపొందించొచ్చు కదా… ఈ యూట్యూబ్ కాలుష్యం నుంచి జనాన్ని రక్షించడానికి..!!
Share this Article