Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఓహో… ఈ ‘ఇడుపు కాయితం’ రచ్చకు అక్కడ బీజం పడిందా..?!

June 27, 2026 by M S R

.

ముందుగా మిత్రుడు Karan Reddy వాల్ మీద కనిపించిన ఓ పోస్టు చదవండి, ( Vinod Krishna original post) నిన్నాఇవ్వాళ రచ్చ జరుగుతున్న ఇడుపు కాయితంపైనే ఇది కూడా…



“ఇడుపు కాయితం” మీద ఒకతను వేసిన పోస్ట్ వైరల్ అయ్యి, ఇపుడు ఏకంగా ఆంధ్ర – తెలంగాణ వాళ్ళు తిట్టుకునే వరకూ వెళ్ళింది.
నిజానికి ఈ వివాదానికి కేంద్రబిందువు ఇడుపు కాయితం అనే టైటిల్ కాదు. అందులో హీరోయిన్ గా చేస్తున్న నాగదుర్గ. ఆమె నర్తించగా, యూట్యూబ్లో హిట్టయిన ఒకానొక డాన్స్ వీడియో. “దారి పొంటొత్తుండు” లిరిక్స్‌తో సాగే ఒక పాట.

Ads

ఆ పాట ముందుగా తెలంగాణ ఫోక్ విధానంలో రాసి ఒక వీడియో తీసారు. అన్ని తెలంగాణ బేస్డ్ సాంగ్స్‌లానే అది కూడా హిట్టయ్యింది. అక్కడి వరకూ బాగానే ఉంది. ఆ తర్వాత ఆ పాటకి డీజె వెర్షన్ రిలీజ్ చేసారు. అలా చేసిన డీజె వెర్షన్ కి రెట్రో స్టైల్లో నాగ దుర్గని మెయిన్ లీడ్ గా పెట్టి అదిరిపోయే స్టెప్పులతో ఒక పాట రిలీజు చేసారు.

nagadurga

మరీ ముఖ్యంగా పాట మధ్యలో… “గాలిగలిగిత్తుండు, గండమై కూసుండు గాలిద్దునా, గోలిద్దునా… ” అనే లిరిక్ దగ్గర వచ్చిన బ్రేక్, దానికి వచ్చిన క్రేజ్, ఇన్స్టాలో బోలెడు రీల్స్ కలిసి ఆ పాటని ఫేమస్ చేసేసాయి.

మూలుగానే… ఒక్కడు సినిమా పాటలని కూడా “ఓల్డ్ టైమ్ క్లాసిక్స్” గా పరిగణించే జెన్ జీ ఇన్ఫ్లుయెన్సర్ బ్యాచులు ఈ టంగ్ ట్విస్టర్ లిరిక్స్ ని అర్ధం చేసుకోలేక కామెంట్ చేయడం మొదలుపెట్టాయి. తెలంగాణ వాళ్ళకు బాగానే అర్థం అయింది. అంతో ఇంతో అర్ధం తెలుసుకోవాలి అనుకునే నాలాంటి బ్యాచికి కొంచెం పని చెప్పాయి.

nagadurga

అప్పటి నుండి ఈ పాటకి, దాని వీడియోలకి ఒకే టైపు కామెంట్లు, “అండర్ స్టాండింగ్ జీరో పర్సెంట్, వైబ్ హండ్రెండ్ పర్సంట్”, “ఇది తెలుగేనా… అసలు”, “తెలుగు డబ్బింగ్ ఉందా ” అంటూ. అక్కడ యూట్యుబులో కామెంటుని పట్టుకుని ఒకరు ట్విటర్లో జోక్ చేద్దామనుకుని, వైరల్ అయిపోయిన ఆ సదరు కుర్రాడు కూడా ఆ టైపు ఆత్రం బ్యాచే. కానీ ఆ తర్వాత వస్తున్న పోస్టులని మాత్రం ఆత్రం కేటగిరిలో వేయలేం.

ఇడుపు కాయితం

అయితే ఏ యాస సొగసులు ఆ యాసకి ఉంటాయనేది గమనించుకుని ఉండాల్సిన సమయం. పుష్పాకి చిత్తూరు యాస కాకుండా తెలంగాణ పెడితే కిక్కివ్వదు, బలగంకి తెలంగాణ కాకుండా గోదారి యాస పెడితే నల్లి బొక్క సెంటిమెంటు పండదు.
వొకేనాగ మాటాడీనాకీ, వొకేనాగ రాసీనాకి..
యిన్ని యాసలెందుకు.
మల్లీ పుడతామా యేటి, తెలుగోళ్ళుగా, సెప్మీ!!!

nagadurga



ఓహ్, అసలు ఈ రచ్చ ఆ ‘దారిపంటొత్తుండు’ పాట కామెంట్ల దగ్గర మొదలైందా..? నిజానికి ఆ పాటలో పదాలన్నీ అచ్చం నికాసలు తెలంగాణ (మరీ ప్రత్యేకించి నార్త్ తెలంగాణ) పల్లె భాష… అంతెందుకు, చాన్నాళ్లుగా హైదరాబాద్ వంటి నగరాల్లో స్థిరపడిన తెలంగాణ వాళ్లకే అంత త్వరగా జీర్ణం కాదు ఆ భాష… కానీ ఆ పాట క్రియేట్ చేసిన వైబ్స్ అంతా ఇంతా కాదు…

ఆ పాట అర్థమేమిటో… ‘ముచ్చట’ గతంలో ఓ కథనం రాసింది… ఇదిగో లింకు…


వైరల్ సాంగ్ దారిపొంటత్తుండు… ఆ పాట సాహిత్యం ఇదుగో ఇలా…



విచిత్రం ఏమంటే ఈ సినిమా నిర్మాత, సమర్పకులు ఆంధ్రులు!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘లయ’ తప్పింది ! ‘వదలా’ అంటూ బోరించే కథాకథనాలు !!
  • అబ్సర్డ్ ! ఓ కరెంటు పోరితో యాదిగాడి సంసారం – రక్తికట్టలేదు బాసూ !!
  • ‘‘రాసి పెట్టుకొండి- రావడం మాత్రం పక్కా… అవసరమూ ఉంది’’
  • ది ఒడిస్సీ ! వెండి తెరపై ఓ దృశ్య కావ్యాన్ని చెక్కిన నోలన్ !!
  • చంపేస్తారా? సోనమ్ వాంగ్‌చుక్‌ను చంపేస్తారా?
  • నో, నో – త్రీ ఇడియట్స్ హీరో పాత్రకూ ఈ సోనమ్ వాంగ్‌చుక్‌కూ లింకే లేదు !!
  • ఔను, నిజమే… ఆమె జీవితం ఓ పాఠ్యాంశం ఎందుకు కాకూడదు !!
  • లార్డ్స్‌లో రోహిత్ శర్మ చివరి మ్యాచ్? వీడ్కోలు అనివార్యమేనా?
  • ప్రైవేటు కంపెనీల ‘స్పేస్’లోకి ఇస్రో మేధోవలస ! ఓ నిశిత పరిశీలన !!
  • BRS – a political paradox ! బీఆర్ఎస్ అంటేనే ఓ పేద్ద విరోధాభాసం !

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions