ప్లాస్మా థెరపీ వద్దురా బాబూ అని చెబుతోంది WHO… వినేవాళ్లెవరూ లేరు… ఆ ప్రొసీజర్స్ సాగుతూనే ఉన్నయ్…. రెమ్‌డెసివర్ పనిచేయదురా బాబూ అని చెప్పడమే కాదు, చికిత్స ప్రొటోకాల్ నుంచి తీసిపారేసింది… ఐనా కోట్లకుకోట్లు తెచ్చిపెట్టే దాన్ని ఎందుకు కాదంటాయి హాస్పిటళ్లు… రోగులకు కుచ్చుతూనే ఉన్నారు… దందా సాగుతూనే ఉంది… టోస్లీజుమాబ్ లక్షల ఖరీదు చేసే స్మగుల్డ్ గూడ్లా మారిపోయింది… రోగి జేబు మరిగిన దందా ఎందుకు ఊరుకుంటుంది..? ఒకటి కాకపోతే ఇంకొకటి, లక్షల బిల్లు చేసే సూదుల్ని కుచ్చుతూనే ఉండాలి… కరోనాకు రెమ్‌డెసివర్ నిన్నటిదాకా శాస్త్రీయం..? ఏ ట్రయల్స్ చూసి అనుమతించారు ఇంతకుముందు..? ఇప్పుడు అది అశాస్త్రీయం అయిపోయింది..? వెరిఫైడా..? అప్రూవ్డా..? సైంటిఫికల్లీ ప్రూవెనా..? అని ఎవరూ అడగలేదు… అలా చాలా మందులు… చూస్తూ ఉండండి, పిల్లల్లో కరోనా తీవ్రత అనే ప్రచారం పెంచుతారు… వాళ్లకీ వేక్సిన్లు వేయించేస్తారు… అదయిపోయేలోపు బూస్టర్ డోస్ వేయిస్తారు అందరికీ… ఎడాపెడా స్టెరాయిడ్లు కుచ్చేసి, జాతి నెత్తి మీదికి బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ వంటి కొత్త కొత్త వ్యాధుల్ని తెచ్చిపెట్టారు… ఇంకెంత కుళ్లబొడవబోతున్నారో రాను రాను…
అవునూ, ఒక్క రెమ్‌డెసివర్‌ను తీసిపారేస్తేనేం..? అలాంటివి యాంటీ వైరల్ డ్రగ్స్ ఎన్ని లేవు..? కరోనాకు పనికొస్తాయా లేదా… ఎవడు చూడొచ్చాడు… ధర ఎక్కువైతే చాలు, తెప్పించు, పొడిచెయ్… ఎంతోకాలం నుంచి ఏవేవో వ్యాధులకు వాడుతున్న ఇంజక్షన్లకు కూడా తెర మీదకు తీసుకొచ్చేస్తున్నారు… కరోనా రోగుల మీద ప్రయోగాలు, ఫలితాలు, నిర్దారణ, అనుమతులు గట్రా అన్నీ ఓ ఫేక్ యవ్వారం… ఇప్పుడు రెమ్‌డెసివర్ వద్దు అంటున్నారు కదా, మరి కొత్తగా ఏమిటి..? ఇంటర్ఫెరాన్ అల్ఫా 2బీ తీసుకొచ్చేస్తారట… కొన్నిరకాల వైరసుల మీద మందుగా, కేన్సర్ మందుగా కూడా వాడబడుతున్న ఈ మందును అనుమతించాలని తాజాగా ఆలోచన… అప్పుడెప్పుడో 1980లో కనిపెట్టారుట దీన్ని… అయితేేనేం..? స్టాక్ ఉందిగా, పొడిచేస్తే పోలా… ఒక్కో ఇంజక్షన్ ఖరీదు 12 వేల దాకా ఉండొచ్చట… జస్ట్, గిరాకీ పెంచితే చాలు, దానికీ దందా షురూ… ఒక్క రిలీఫ్ ఏమిటంటే..? దీన్ని ఒకసారి పొడిస్తే చాలు… రెమ్డెసివర్లాగా రోజుకొకటి ఇవ్వాల్సిన పనిలేదట…
Ads
ఇదేకాదు, మోల్నుపిరవిర్ (ఆమధ్య ఫావిపిరవిర్ వాడారు,.. ఇప్పుడది కరోనాకు వాడటం అశాస్త్రీయం అయిపోయింది…) మాత్రలు త్వరలో రానున్నాయి… మూడో దశ ట్రయల్స్‌కు డీజీసీఐ పర్మిషన్ ఇచ్చేసింది… హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రల దగ్గర్నుంచి ఇప్పటిదాకా బోలెడు యాంటీ వైరల్ డ్రగ్స్ ప్రయోగిస్తూనే ఉన్నారు… ఇప్పుడు ఖచ్చితంగా ఫలానా యాంటీ వైరల్ డ్రగ్ పనిచేస్తుందని చెప్పడానికి ఏమీ లేదు… ఇప్పుడు ముంచుకొస్తున్న బ్లాక్ ఫంగస్ చికిత్సకు లిప్సోమాల్ ఇంజక్షన్లను కనీసం 40, 50 ఇవ్వాలట… ఎన్ని లక్షల ఖరీదైన చికిత్సో అర్థమైంది కదా… ఎర్లీగా రోగనిర్ధారణ జరిగితే మేం ఉచితంగా యునాని చికిత్సతో తగ్గిస్తాం అని ముందుకొచ్చింది తెలంగాణ ఆయుష్ విభాగం… గుడ్… ఆయుర్వేదం మందు ఎలా వాడతారు..? శాస్త్రీయమేనా..? బ్లాక్ ఫంగస్ మీద పనిచేస్తుందా..? ప్రయోగాలు చేశారా..? అని ఇంకెవరూ మొదలుపెట్టలేదు, సంతోషం… ఈమధ్యలో అందరి ఆసక్తీ మన డీఆర్డీవో డెవలప్ చేసిన టూడీజీ మందు మీద నెలకొంది… ప్రయోగాల్లో ఫలితాలను బట్టి రోగికి ఆక్సిజన్ అవసరాన్ని తగ్గిస్తుందనే పాయింట్ ఇంట్రస్టింగు… అది గనుక సక్సెస్‌ఫుల్‌గా పనిచేస్తే, ఈ ఆక్సిజన్ మరణాలు తగ్గుతాయనేది ఆశ…! కనీసం ఈ మందు ఉత్పత్తి, పంపిణీ మీదనైనా మోడీ సర్కారుకు ఓ ప్లానింగు ఉందా..? డౌటే…! ఉండదు… కనిపించడం లేదు కూడా…!!
రెమ్‌డెసివర్ పనిచేయదు, పొడవకండిరా బాబూ అని ప్రపంచ ఆరోగ్యసంస్థ దగ్గర్నుంచి, మన పెద్ద పెద్ద హాస్పిటళ్ల పెద్దలు కూడా చెబుతున్నారు కదా… ఐనా ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటళ్లు ఆపవు… దాని ధర, దాని దందా అలాంటిది… పైన వార్త చూశారు కదా… సత్తెనపల్లిలోని ఓ సంస్థకు తాజాగా కేంద్రం ఈ ఇంజక్షన్ల తయారీకి అనుమతులు ఇచ్చేసింది… ఆ ఉత్పత్తి అంతా దేనికి వినియోగిస్తారు..? కరోనా రోగుల కోసమే కదా… మరి పనిచేయడం లేదు అంటూనే కొత్తగా ఈ అనుమతులు దేనికి..? అబ్బే, ఇది రకరకాల చికిత్సలకు ఉపయోగపడుతుంది అని చెబుతారు బయటికి… అంతేకదా… అంతే… కేంద్రంలోని ప్రభుత్వానికి దశ, దిశ మాత్రమే కాదు, బుర్ర కూడా లేదు..! జనాన్ని పిచ్చోళ్లను చేసి, రోగిష్టులను చేసి, దివాలా తీయిస్తున్న ‘‘కరోనా మాఫియా’’లో ప్రథమ ముద్దాయి కేంద్ర ప్రభుత్వమే…!!
Share this Article