గామి… ఈ ట్రెయిలర్ చూస్తుంటే ఆశ్చర్యం వేసింది… అయిదారేళ్ల క్రితం క్రౌడ్ ఫండింగ్‌తో మొదలైన చాలా చిన్న సినిమా… అప్పటికి హీరో విష్వక్సేన్ కూడా పాపులర్ కాదు… ఇప్పుడు యూవీ క్రియేషన్స్ సపోర్ట్ చేస్తుండవచ్చగాక… కానీ తక్కువ ఖర్చుతో భలే క్వాలిటీ గ్రాఫిక్స్ కనిపిస్తున్నాయి…
హనుమాన్ సినిమాకు సంబంధించి మొదట్లో రిలీజ్ చేసిన ట్రెయిలర్లు కూడా ఇలాగే బాగా వైరల్ అయ్యాయి… ఇక్కడ ప్రశ్న ఏమిటంటే..? మన హైదరాబాదులోనే మంచి గ్రాఫిక్స్ నిపుణులున్నారని హనుమాన్ సినిమా ప్రూవ్ చేసింది… చాలా తక్కువ ఖర్చుతోనే గ్రాఫిక్స్ క్రియేట్ చేశారు… పర్లేదు, మరీ గొప్పగా లేకపోయినా కథకు తగినట్టుగా చాలు…
కంటెంటు, బీజీఎం, సందర్భాలు బాగా ఎలివేటవుతున్నప్పుడు సహజంగానే సోసో గ్రాఫిక్స్ కూడా కనెక్టవుతాయి… ఇప్పుడు గామి ట్రెయిలర్‌లో కనిపిస్తున్న గ్రాఫిక్స్ కూడా బాగున్నయ్… ఆదిపురుష్, బ్రహ్మాస్త్ర వంటి సినిమాలకు వందల కోట్లు ఎందుకు ఖర్చవుతున్నట్టు మరి..? విదేశాల్లో గ్రాఫిక్ వర్క్, ఈ భారీ ఖర్చు పేరిట సాగుతున్న అసలు దందా ఏమిటి..? ఏమో… ఈడీ రంగప్రవేశం చేస్తే తప్ప మనీ లాండరింగ్ బాగోతాలు బయటపడవేమో…
Ads
ఇక గామి సినిమాకు వస్తే… దర్శకుడికి మంచి క్లారిటీ ఉంటే చాలా తక్కువ ఖర్చుతోనే మంచి ఔట్ పుట్ తీసుకురావచ్చునని చెబుతున్నట్టుంది… అప్పుడెప్పుడో ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో దూద్ కాశి పేరిట నాని, మాళవిక నాయర్‌తోపాటు హిమాలయాలకు ప్రేక్షకులను కూడా తీసుకెళ్లాడు దర్శకుడు నాగ్ అశ్విన్… సూపర్ లొకేషన్స్…
మళ్లీ ఇప్పుడు గామి…? ఇందులోనూ మంచి మంచి మంచు లోకేషన్స్ కనిపిస్తున్నాయి… ఏవో అరుదైన స్వయంప్రకాశిత పత్రాలు 36 ఏళ్లకోసారి కనిపిస్తాయనీ, ఆ స్పర్శతో సమస్యలు పోతాయనేది పాయింట్… ఫాంటసీ… అయితే, ఈ ప్రధాన కథకు ఓ దేవదాసీ పిల్ల కథనూ, ఆమెకు ఏదో రహస్యం తెలుసుననీ, ఆమెను ఖతం చేసే కార్యక్రమం కూడా ఉందనీ ట్రెయిలర్ చెబుతోంది… ఈ కథల లింక్ నిజంగా బాగా కుదిరితే సినిమా క్లిక్కవుతుంది… కావాలి కూడా…
భారీ భారీ తారాగణం, అట్టహాసాలు, అడ్డమైన కుర్చీ మడతపెట్టడాలు, రికార్డింగ్ డాన్సులు, స్టెప్పులు కాదు… కథాబలం ఉన్న చిత్రాలు, చౌకగా హాలీవుడ్ రేంజులో మేం ఔట్ పుట్ చూపించగలం అని సవాల్ విసిరే వర్క్ తెలుగు సినిమా రేంజ్‌ను ఖచ్చితంగా పెంచుతుంది… ఐతే ట్రెయిలర్ బాగుంటే సినిమా బాగుండాలని ఏముంది..? సూపర్ ట్రెయిలర్లు రిలీజైనా సినిమాలు డిజాస్టర్లు కాలేదా అంటారా..? పాపం శమించుగాక… ఓ నాణ్యమైన సినిమాయే రావాలని ఆశపడదాం… అలాంటివే రావల్సిన అవసరం కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఉంది… ఇంకా ఎన్నాళ్లు చూస్తాం, దిక్కుమాలిన ఇమేజీ బిల్డప్ వేషాలు..!!
ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా నాటిని నాని పెద్ద హీరో ఏమీ కాదు, విజయ్ దేవరకొండ హీరోయే కాదు, మాళవిక కొత్త నటి… ఐతేనేం, నాగ్ అశ్విన్ తన దర్శకత్వ ప్రతిభతో సినిమాను జనరంజకంగా మార్చాడు… ఆస్తులు, సంపదలు, వైభోగాలను మించి ఇంకేదో ఉంది అనే మెసేజ్ ఇచ్చాడు… ఈ గామి సినిమాలో కూడా ఎవరూ తెలిసిన నటులు, అంటే పాపులర్ నటులు లేరు… అసలు సినిమా స్టార్టయినప్పుడు విష్వక్సేనుడే హీరో కాదు..!!
Share this Article