.
ఏమాటకామాట… కన్నప్ప ట్రెయిలర్ రిలీజ్ అంటే ముందుగా పెద్ద ఆసక్తి ఏమీ అనిపించలేదు… ఆ సినిమా చుట్టూ ఇన్నాళ్లూ చదువుతున్న వివాదాలు, రాసిన విశ్లేషణలు… అబ్బే, ఏముంటుందిలే అనుకున్నాను… పైగా మంచువారి సినిమా అంటే ముందస్తుగా ఓ ప్రిజుడిస్ అభిప్రాయం ఉంటుంది కదా…
శివయ్యా అంటూ ఓ చిత్రమైన డిక్షన్‌తో మంచు విష్ణు పిలుపు ఎంత ట్రోలింగుకు గురైందో తెలుసు కదా… తమిళ, మలయాళ, తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమలకు చెందిన అతిరథ మహారథులు… అసలు ఇంత మందికి సరైన ప్రాధాన్య పాత్రలు ఎలా అడ్జస్ట్ చేశారనే విస్మయం కూడా ఉండనే ఉంది కదా…
Ads
అన్నింటికీ మించి అసలు భక్త కన్పప్ప కథను మించి ఎటెటో తీసుకుపోయారు కథను… వాయులింగం, దానికి తెగల నడుమ ఘర్షణ, అది ఓ మాదిరి కురుక్షేత్రం టైపులో తీసినట్టుంది… కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్, బాహుబలి, కల్కి ఎట్సెట్రా చాలా సినిమాలను చూసి, ఆ రేంజులో ఉండాలన్నట్టుగా భారీ ఖర్చు, ఎలివేషన్లకు పూనుకున్నట్టు కనిపిస్తూనే ఉంది…
పైగా అక్షయకుమార్, ప్రభాస్, మోహన్‌లాల్, మోహన్‌బాబు వంటి హీరోలు, వెటరన్ హీరోలు ఉన్నాక ఇక ఎలివేషన్లకు కొదవేముంది..? సరే, అవన్నీ పక్కన పెడితే ఆ హీరోయిన్ ఎవరో గానీ… మరీ ముప్పావు నగ్నంగా (గ్లామర్ అనాలేమో…) కనిపిస్తోంది…
పైగా మంచు విష్ణు రొమాన్స్, పాటలు సరేసరి… అదే కాస్త చిరాకుగా అనిపించింది… కాకపోతే ప్రభాస్ రుద్రుడిగా సరిగ్గా సెట్టయ్యాడు… శివుడి వీరభక్తుడిగా మోహన్‌బాబు కూడా… అక్షయకుమార్ శివుడిగా సో సో… మన తెలుగు మొహాలను చూసిన కళ్లతో తనను శివుడిగా చూడటం కష్టంగానే ఉంది, అఫ్‌కోర్స్, తన పక్కన ఉన్న పార్వతి కూడా…
కానీ లొకేషన్స్ మాత్రం సూపర్… సినిమాటోగ్రాఫర్ ఎవరో గానీ, ట్రెయిలర్లలోనే ఇంత బాగుందంటే, ఇక పెద్ద తెర మీద ఇంకెంత ప్రభావవంతంగా వచ్చాయో… ఈ విషయంలో దర్శకుడిని మెచ్చుకోవచ్చు… అసలు ఇందరు పెద్ద తారల్ని సంభాళించడమే తనకు అతి పెద్ద టాస్క్… సక్సెస్‌ఫుల్‌గా మేనేజ్ చేసినట్టు కనిపిస్తోంది, గుడ్…
ఐతే ఒక నాస్తిక పిల్లాడు… భక్తి గిట్టదు, తను పలు పరిణామాల నేపథ్యంలో ఆస్తికుడైపోయి, అనిర్వచనీయ భక్తితో ఆ శివుడినే మెప్పించడం అసలు కథ… ఇక దానికి నానా హంగామాలు క్రియేట్ చేసి, జత చేసినట్టు కనిపిస్తూనే ఉంది… సరే, అది ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి…
ఈ నాస్తికత్వం, వీర శివభక్తుడితో వైరం, తరువాత ఆస్తికత్వం అనేవి అప్పట్లో కృష్ణం రాజు నటించిన భక్త కన్నప్ప సినిమాలో కంట్రాక్టు కోసం బాపు అల్లిన ఓ కొత్త కథ… పర్లేదు, కుదిరింది… ప్రత్యేకించి పాటలు సూపర్ హిట్…
స్థూలంగా చూస్తే మంచు విష్ణు పెట్టిన ఖర్చుకు సరిపడా నిర్మాణ విలువలు, భారీతనం కనిపిస్తున్నాయి… మొత్తం తారాగణంలో తనొక్కడే ఆడ్‌గా ఉన్నాడా..? మొత్తం సినిమా రిలీజయ్యాక గానీ తెలియదు… బట్ ప్రభాస్ అభిమానులకు మాత్రం నచ్చేలాగే ఉన్నాడు ఇందులో…!!
అన్నట్టు… అవేవో సోషల్ పోస్టర్లలో కనిపించినట్టు శివుడికి నీలం రంగు పులిమినట్టుగా ఏమీ లేదు ట్రెయిలర్‌లో… థాంక్ గాడ్… థాంక్ శివా…
Share this Article