మిత్రుడు సూర్యప్రకాష్ జోశ్యుల వాల్ మీద కనిపించింది ఈ పాత వార్త… రూపవాణి పత్రికలో అనుకుంటా, పబ్లిషైంది… 1960 బాపతు సంచిక అయి ఉంటుంది… ఈమధ్య నటి జయలలిత అనుభవాలు, సినిమా నటి లక్ష్మి మీద ఆమె మాజీ భర్త చేసిన వ్యాఖ్యలు గట్రా చర్చనీయాంశమయ్యాయి…
నాటి పాత ముచ్చట్లన్నీ వార్తల్లోకి వస్తున్నాయి… అఫ్‌కోర్స్, ఇప్పుడైతే మరీ సినిమా సెలబ్రిటీల ప్రేమలు, సహజీవనాలు, పెళ్లిళ్లు, బ్రేకప్పులు, విడాకులు, గృహహింస, కేసులు గట్రా కామన్ అయిపోయాయి… కానీ అప్పుడెప్పుడో దశాబ్దాల క్రితం కూడా ఇవే కథలు అని చెప్పుకునేందుకు ఓ వార్త ఓ ఉదాహరణ అన్నమాట.,.
ఈ క్లిప్పింగ్ సారాంశం కాస్త కొత్తగా అనిపించింది… అంటే భార్యాభర్తలు కోర్టుకెక్కిన తీరు, న్యాయం కోరిన అంశాలు ఇంట్రస్టింగ్… ఈ నటి పేరు రాజసులోచన… పాతతరం వాళ్లకు తెలిసిన పేరే… తమిళం, మలయాళం, కన్నడం, తెలుగు, హిందీ భాషల్లో 275 సినిమాల దాకా చేసింది, శాస్త్రీయ నృత్యకారిణి కాబట్టి పలు దేశాల్లో ప్రదర్శనలూ ఇచ్చింది… దాదాపు టాప్ స్టార్లందరితోనూ నటించింది…
Ads
నిన్నటి తరం వాళ్లు గుర్తుపట్టడానికి హింట్ ఏమిటంటే… చిరంజీవి నటించిన హిట్ సినిమా దొంగ మొగుడు గుర్తుంది కదా… అందులో మాధవి తల్లి, అంటే చిరంజీవి అత్త పాత్ర చేసింది… తెలుగు పుట్టుకే, జన్మతో వచ్చిన పేరు రాజీవలోచన… బెజవాడ… కానీ తండ్రి ఉద్యోగ బదిలీ కారణంగా చెన్నైకి వెళ్లింది ఆమె కుటుంబం, ఆమె మొదట కన్నడం, తమిళం చిత్రాల్లో సినిమాలు చేసి, తరువాత తెలుగులోకి వచ్చింది… సరే, ఈ వార్త ఏమిటంటే..?
‘‘నా భర్త నా ఇంటిలోకి ప్రవేశించకుండా నిషేధాజ్ఙలు ఇవ్వండి’’ అని ఆమె కోర్టుకు మొరపెట్టుకుంది… కోర్టు ఇచ్చింది… మా పెళ్లి కూడా రద్దు చేయండి అని కోరింది… వాటికి ప్రతిగా భర్త కోర్టులో మరో పిటిషన్ వేశాడు… ‘‘ఆ ఇంటిలోకి ప్రవేశించడానికి నాకు అనుమతి ఇవ్వండి… అందులో నా కొడుకు ఉంటాడు, నేను తన గార్డియన్… అసలే ఆమె ప్రవర్తన మంచిది లేదు’’ అని కోరాడు… దానికి కోర్టు నో అనేసింది… నువ్వు ఆ ఇంట్లోకి వెళ్తే పరిస్థితి ఇంకా విషమించే ప్రమాదం ఉందని ఆ కౌంటర్ పిటీషన్ కొట్టేసింది… ఆ భర్త పేరు పరమశివం… వాళ్లది ప్రేమ వివాహమే… అప్పుడెప్పుడో 1951 నాటి పెళ్లి… సో, అప్పటి నుంచీ ఇలాంటి కథలు, రచ్చలు ఉన్నాయన్నమాట…
మీరు వికీ సమాచారం చూస్తే ఆమె భర్త పేరు చిత్తజల్లు శ్రీనివాసరావు అని ఉంటుంది… అనగా సీఎస్‌రావు… బహుశా ఈ పరమశివం తొలి భర్త అయి ఉంటాడు… అయ్యవారు ఈమె మీద తరచూ చేయిచేసుకునేవాడేమో, కలతలు పెరిగాయి, దూరం పెరిగింది, అందుకే తను అసలు నా ఇంట్లోకి రావద్దని కోర్టుకెక్కింది ఆమె… అంటే రక్షణ కోరుకుంది… దానికి ప్రతిగా నా ఇంట్లోకి నన్ను రానివ్వండి అనే ఆయన కౌంటర్ పిటిషన్ కాస్త నవ్వు పుట్టించేదే…! రకరకాల కుటుంబకథలు… రకరకాల కేసులు..!!
Share this Article