.
R Samala …….. In Search of Love … ఇదొక జర్నీ. హృదయాల మధ్య ప్రయాణం. మనసుని వెతుక్కుంటూ మనిషి చేసే ప్రయాణం. సరదాగా మొదలై సున్నితంగా మన హృదయంతరాల్లోకి ప్రయాణించే సినిమా. జర్నీ ఆఫ్ ఫకీర్…
ముంబై ‘వర్లి’ రోడ్ల మీద మాజిక్ ట్రిక్స్ చేస్తూ, పర్సులు కొట్టేసే ఫకీర్, తల్లి మరణానంతరం తనకు తెలియని తండ్రిని వెతుక్కుంటూ ఇండియా నుండి పారిస్ కు, పారిస్ నుండి లిబియాకు చేసే ప్రయాణంలో ప్రతిక్షణాన్ని ఎలా ఆస్వాదించాలో మనకు నేర్పిస్తాడు.
Ads
తనకు పరిచయం అయిన ‘మారీ’ అనే ఫ్రెంచ్ అమ్మాయి కోసం ప్రపంచాన్ని తలకిందులు చేస్తాడు. బాహుబలి దెబ్బకు రీజనల్ హీరోలందరికీ అప్పుడప్పుడే ‘పాన్ ఇండియా’ సిండ్రోమ్ పట్టుకుంటున్న ఆ రోజుల్లో, ‘అజాతశత్రు లవశ్ పటేల్’ గా ధనుష్ నటించిన నిజమైన ‘పాన్ వరల్డ్’ సినిమా ఇది.
ధనుష్ హాలీవుడ్ అరంగేట్రం, ఫ్రెంచ్, ఇంగ్లీష్, స్పానిష్, ఇటాలియన్ భాషల్లో India, France, Italy, Spain, Libya, UK దేశాల్లో షూటింగ్ జరుపుకున్న Multi-Lingual ఇంటర్నేషనల్ ఫిల్మ్. పాటలు కూడా ప్రపంచ సంగీత శైలిలో, ఇంగ్షీషు, స్పానిష్, ఇటాలియన్ భాషల్లో తీసారు.
Romain Puertolas రాసిన ‘The Extraordinary Journey of the Fakir Who Got Trapped in an Ikea Wardrobe’ అనే ఫ్రెంచ్ కామెడీ నవల ఆధారంగా, Ken Scott దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2018 లో థియేటర్లో చూసినపుడు ‘ఇకియా’ స్టోర్ లో అల్మారా సీన్ ఒక కల్ట్ హిట్టు. సిగ్నేచర్ మోమెంట్.
OTT ట్రెండ్ లో భాగంగా తెలుగు డబ్డ్ వెర్షన్ AHA ఓటీటీలో ఈ నెల రిలీజ్ చేశారు. ఒరిజినల్ వర్షన్ Prime లో ఉండేది. ఇప్పుడు లేదనుకుంటా. మాటలు, పాటలు అన్నిటినీ గంపగుత్తాగా తెలుగు చేయడం వల్ల ‘ఒరిజినల్ వెర్షన్’ లోని ‘భాషా వైవిధ్యం’ సొగసులు పోయాయి.
కొన్ని సినిమాలు అసలు డబ్బింగ్ చేయకూడదనిపిస్తుంది నాకు. కానీ ఇంతకుముందు అస్సలు చూడనివాళ్ళు, English ఎంజాయ్ చేయలేని ప్రేక్షకులు కోసం ఇలాంటివి అవసరమే కదా. చూడండి. ఎంజాయ్ చేస్తారు…
Share this Article