మరీ ఆ పేర్లు రాయడం, చదవడం, ఉచ్చరణ కష్టం గానీ షార్ట్ ఫామ్స్‌లో… డీఎంకే ఆధ్వర్యంలోని అధికార కూటమి పేరు సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయెన్స్… ఎస్పీఏ… ఇది యూపీఏ జాతీయ కూటమికి ప్రాంతీయ సర్దుబాటు కూటమి… ఇందులో డీఎంకేతోపాటు సీపీఎం, కాంగ్రెస్, సీపీఐ, వీసీకే, ఎండీఎంకే, ఐయూఎంఎల్, కేఎండీకే, ఎంఎంకే, టీవీకే, ఎఐఎఫ్‌బీ, ఎంవీకే, ఏటీపీ… గత ఎన్నికల్లో డీఎంకే 234 సీట్లకు గాను 173 సీట్లలో మాత్రమే పోటీచేసి, మిగతావన్నీ మిత్రపక్షాలకు కేటాయించింది… నాలుగు పార్టీలకు ఒక్కటి చొప్పున సీటు ఇచ్చి, మర్యాద కనబరిచింది…
అన్నాడీఎంకే, బీజేపీ, పీఎంకే కూడా ఉన్న ఎన్‌డీఏ కూటమిలో మొత్తం పార్టీలు సీట్లు పంచుకున్నాయి… వీటిలో ఏడు పార్టీలు అన్నాడీఎంకే గుర్తుపైనే పోటీచేశాయి… ఆరు పార్టీలకు ఒకటి చొప్పున సీట్లు ఇచ్చారు… ఇవి గాకుండా పీపుల్స్ ఫ్రంట్ పేరిట మరో నాలుగు పార్టీల కూటమి… దినకరన్, విజయకాంత్ పార్టీలున్నయ్ ఇందులో… కమల్‌హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యం, దేవెగౌడ పార్టీ జేడీఎస్ కూడా ఉన్న మరో ఏడు పార్టీల పీపుల్స్ ఫస్ట్ అలయెన్స్ కూడా పోటీచేసింది… ఈ కూటములు గాకుండా చిన్నాచితకా పార్టీలు బోలెడు…
కమల్‌హాసన్ పార్టీ 140 సీట్లకు పోటీచేయడమే గాకుండా, మిగతా సీట్లను తన మిత్రులకు ఉదారంగా పంచిపెట్టింది… ఎవడిది ఏ పార్టీయో, ఏ పార్టీ ఏ కూటమిలో ఉందో చెప్పుకోవడం ఓ పెద్ద పరీక్ష తమిళనాడులో… పైన రెండు పేరాలు కష్టంగా చదివితే అర్థమయ్యేది అదే… తీరా స్టాలిన్ నేతృత్వంలోని కూటమి 159 సీట్లు గెలుచుకుంది… అందులో డీఎంకే వోట్ల పుణ్యమాని కాంగ్రెస్ 18 సీట్లు గెలిచింది… లెఫ్ట్ కూడా రెండేసి సీట్లు… అన్నాడీఎంకే వోట్లతో బీజేపీ 4 సీట్లు గెలిచింది… అన్నాడీఎంకే 66, పీఎంకే 5 సీట్లు… అంతే ఇక… మిగతా పార్టీలు, కూటములన్నీ మటాష్…
Ads
ఇక్కడ చెప్పాల్సింది కమల్‌హాసన్ పార్టీ ఘోరంగా ఫెయిల్ కావడం… సినిమా నటుడు అనగానే పిచ్చి పిచ్చిగా వోట్లు గుద్దే రోజులు పోయాయి… తమిళనాడులోనే కాదు, ఏపీలో వోటర్లు కూడా అదే చెప్పారు… ఇప్పుడు ఆ కమల్‌హాసన్ వెళ్లి రాహుల్ గాంధీని జోడో యాత్రలో కలిశాడు… రాబోయే రోజుల్లో కలిసి పనిచేద్దామనే సంకేతం ఇచ్చాడు… ఇదీ నవ్వొచ్చే విషయం… అసలు తమిళనాడులో కాంగ్రెస్ పార్టీయే ఓ బిచ్చపు పార్టీ… చదివేందుకు హార్ష్‌గా ఉన్నా సరే, స్టాలిన్ దయ, కాంగ్రెస్ ప్రాప్తం అన్నట్టుగానే ఉంది పరిస్థితి…
ఇప్పుడు ఆ పెద్దతోక కాంగ్రెస్ పార్టీకి కమల్ హాసన్ పార్టీ చిన్నతోకగా మారాలా..? తన కూటమిలో ఎడాపెడా ఉదారంగా సీట్లు పంచిన కమల్‌కు మహాఅయితే రెండుమూడు సీట్లు ఇస్తాడేమో స్టాలిన్… పెద్ద బిచ్చగాడి వెంట వచ్చే చిన్న బిచ్చగాడికి కూడా ఎంతోకొంత మర్యాదకు ముష్టి వేసినట్టు…!! చెప్పడం మరిచిపోయా… కేసీయార్ జాన్‌జిగ్రీ మిత్రపక్షం దేవెగౌడ జేడీఎస్‌కు తమిళనాట వచ్చిన వోట్లెన్ని తెలుసా..? 1189 వోట్లు… రేప్పొద్దున కేసీయార్ పార్టీ ఈ తోకను పట్టుకుని తమిళ కావేరిని ఈదాల్సి ఉంటుంది…!!
Share this Article