.
Pardha Saradhi Potluri …… ప్రపంచ బాంక్ పాకిస్థాన్ కి 108 మిలియన్ల డాలర్లు అప్పు ఇవ్వడానికి అంగీకరించించింది! మోడీ ఆపలేకపోయారు! ప్రతీ విషయాన్ని మోడీకి అంటగట్టడం అలవాటు చేసుకున్నారు!
నిజం ఏమిటీ? ఎప్పటి నుండో వరల్డ్ బాంక్ వద్ద పెండింగ్ లో ఉన్న విషయం ఇది! అప్పు పాకిస్థాన్ కా? వరల్డ్ బాంక్ అప్పు మంజూరు చేసింది కానీ నిధులు విడుదల చేయలేదు అంటే లోన్ అప్రూవ్ అయ్యింది అంతే!
Ads
Well..! వరల్డ్ బాంక్ అప్పుగా ఇచ్చే 108 మిలియన్ డాలర్లు పాకిస్థాన్ లోని ఖైబర్ పాఖ్ఖున్‌థక్వా ప్రావిన్స్ లోని మహిళలు, బాలికల విద్య, వైద్యం కోసం ఖర్చు పెట్టడానికి ఈ లోన్ అప్రూవ్ అయింది.
వరల్డ్ బ్యాంక్ ఇచ్చే అప్పు కేవలం KPK ప్రావిన్స్ లో మహిళలు, బాలికల కోసం మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది కానీ ఇతర అవసరాల కోసం నిధులు దారి మళ్ళించే వీలు లేకుండా SPV ( Special Purpose Vehicle ) ని ఏర్పాటు చేస్తారు…
వాటిని యుద్ధ అవసరాల కోసం మిలిటరీకి మళ్లించే చాన్స్ ఏమీ ఉండదు… ఒకవేళ పైసా తప్పుదారి పట్టినా పాకిస్థాన్‌ను FATF పూర్తిగా బ్లాక్ లిస్టులో పెడుతుంది… అంటే భవిష్యత్తులో రూపాయి లోన్ పుట్టదు ఎక్కడా…
ఆల్రెడీ FATF (Financial Action Task Force) 2018 నుంచి గ్రే లిస్టులో ఉంచింది పాకిస్థాన్… 2022 అక్టోబరు వరకు… ఆ రుణాలుగా తెచ్చిన నిధులు కశ్మీర్‌లో టెర్రరిస్టు కార్యకలాపాలకు ఖర్చు పెట్టారని ఇండియా ఆరోపిస్తూ పాకిస్థాన్‌ను వెంటనే గ్రే లిస్టులో చేర్చాలని ఇండియా కోరబోతోంది…
వచ్చే జూన్‌లో FATF సమావేశం జరగనుంది… ఈ 108 మిలియన్లు యుద్ధావసరాల్లో పల్లీబఠానీలకు కూడా సరిపోవు… కానీ IMF జూలై 2024 నుంచి 7 బిలియన్ డాలర్ల ప్యాకేజీని ప్రారంభించింది… దాన్ని అడ్డుకునే ప్రయత్నాల్లో పడింది ఇండియా ఇప్పుడు… (ఆ నిధులు లేకపోతే పాకిస్థాన్ దివాలాయే)…
మే నెలలోనే ఐఎంఎఫ్ బోర్డు సమావేశం జరగనుంది… అక్కడా ఇండియా ఈ అంశాల్ని లేవనెత్తనుంది… ఎఫ్ఏటీఎఫ్ సభ్యదేశాల్లో మెజారిటీ దేశాలు ఇండియా వ్యక్తపరుస్తున్న ఉగ్రవాద ఆందోళనకు మద్దతు పలుకుతున్నాయి..
ఇప్పుడు ఇచ్చిన 108 మిలియన్ డాలర్ల రిలీజ్ విషయంలో… వరల్డ్ బ్యాంక్ తరుపున సిబ్బంది, KPK లోని అధికారులు కలిసి నిధులు సక్రమంగా ఖర్చు అవుతున్నాయా లేదా అని పరిశీలించి, సక్రమంగా ఉంటేనే తరువాతి వాయిదా చెల్లిస్తుంది బాంక్!
అంతేగానీ ఒకే సారి 108 మిలియన్ డాలర్లు ఇవ్వదు విడతల వారీగా ఇస్తుంది! (7 బిలియన్ డాలర్ల ఐఎంఎఫ్ ప్యాకేజీ కూడా అంతే… ఈ బెయిలవుట్ ప్యాకేజీని 37 నెలల సుదీర్ఘ కాలంలో, పలు సమీక్షల అనంతరం రిలీజ్ చేస్తూ ఉంటుంది…)
సో, ఇక్కడ మోడీ ఫెయిల్యూర్ అనేది పెద్దగా లెక్కించదగిన విమర్శ కాదు, దానికి బేస్ కూడా లేదు… మోడీ చెప్పగానే ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంకు చకచకా చేసేయవు… ఎవరి లెక్కలు వాళ్లవి… KPK ప్రావిన్స్ పాకిస్తాన్ లో ఎప్పటికీ ఉండేది కాదు! ఎప్పటికైనా ఆఫ్ఘనిస్తాన్ లో కలిసిపోయేదే! అప్పు తిరిగి చెల్లించాల్సింది మాత్రం పాకిస్థాన్ ప్రభుత్వమే! అదీ ట్విస్టు..!!
ఈ రోజుల్లో యుద్ధం అంటే పరస్పరం ముఖాముఖి తలబడి కాల్చుకోవడం, బాంబింగ్ మాత్రమే కాదు… కీళ్లెరిగి వాతలు పెట్టడం, పలు రకాలుగా, పలు రంగాల్లో..!!
Share this Article