.
ఎన్నేళ్ల గరువాత గెలిచారు అనేది కాదు ముఖ్యం.,. ఇప్పుడు ఎలా గెలిచాం అనేదే ముఖ్యం… ఇండియాకు చాంపియన్స్ ట్రోఫీలు, వరల్డ్ కప్పులు, కీలకమైన సీరీస్‌లు గట్రా గెలవడం కొత్తేమీ కాదు, బోలెడు ఎన్నదగిన విజయాలు సాధించిందే…
కానీ ఈసారి గెలుపు కాస్త రుచిగా ఉంది… అల్లాటప్పాగా వచ్చిన గెలుపేమీ కాదు… ఛాంపియన్స్ కాగలిగిన సత్తా ఉన్న న్యూజీలాండ్ మీద గెలిచామని కాదు… హోస్ట్ చేసిన పాకిస్థాన్‌ను లీగ్ దశలోనే సోదిలో లేకుండా తరిమేశాం… పాకిస్థాన్‌లో ఆడేదే లేదన్నాం, తటస్థ వేదిక మీద కప్పు కొట్టాం… అందుకే ఇది రుచికరం…
Ads
ఆటను ఆటలాగా చూడాలి… సినిమాను సినిమాగా చూడాలి వంటివి పాకిస్థాన్‌తో ఆట విషయంలో కుదరదు… పాకిస్థాన్‌తో ఆట ఓ ఎమోషన్… చాంపియన్స్ ట్రోఫీ రాకపోయినా సరే, పాకిస్థాన్ మీద గెలుపు సగటు ఇండియన్ అహాన్ని సంతృప్తిపరిచింది… అది లీగ్ దశలోనే వెళ్లిపోవడంతో ఆ సంతృప్తి రెట్టింపైంది… చివరకు ట్రోఫీ చేతుల్లో పడి ఆ సంతృప్తి మరో మూడు రెట్లు పెరిగింది… అందుకే చెప్పింది, ఈ గెలుపు రుచికరం అని…
నిజానికి స్లో పిచ్… మొదట బ్యాటింగ్ చేసిన న్యూజీలాండ్‌కే అడ్వాంటేజ్… కానీ ఒకరిద్దరు ప్లేయర్లు క్లిక్కయినా సరే ఫైనల్స్‌లో గెలుపు మనదే అనే ధీమా, ఆశ ఇండియన్లలో మొదటి నుంచీ ఉంది… ఎందుకంటే, ఈ పిచ్ మీద ఫస్ట్ నుంచీ గెలుస్తూ వస్తున్నాం కదా…
విరాట్ కోహ్లీ డక్ అయినా సరే… మంచి ఇన్నింగ్స్ ఆడుతున్న రోహిత్ శర్మ ఔటయినా సరే… మిగతా ప్లేయర్ల మీద ఇండియన్స్ ఆశలు… నిజానికి వాళ్లే గెలిపించారు… శ్రేయాస్, శుభమన్, రాహుల్, అక్సర్, రవీంద్ర జడేజా… ఎవరు తక్కువ..?
అసలు షమీ, హార్దిక్ కలిసి 20, 30 రన్స్ ఎక్కువ ఇచ్చారు… చివరకు అవే కొంపముంచుతాయి అనుకున్నారు… కానీ ఎట్‌లాస్ట్… ఒక్కో వికెట్ పడిపోతున్నా సరే, వీలు దొరికినప్పుడల్లా సింగిల్స్ తీస్తూ, జాగ్రత్తగా ఒకటీరెండు షాట్స్ కొడుతూ కుర్రాళ్లు ఎట్టకేలకు ట్రోఫీని కొట్టారు…
ఈ చాంపియన్స్ ట్రోఫికి సంబంధించి మెచ్చుకోవాల్సింది మన బౌలర్లను కూడా… ప్రత్యేకించి వరుణ్ చక్రవర్తి, అక్సర్, కులదీప్ ఎట్సెట్రా… అఫ్‌కోర్స్ రవీంద్ర జడేజా, షమి కూడా… ఇలాంటి పిచ్‌ల మీద ఫీల్డింగ్ నైపుణ్యం కూడా గెలుపోటములను శాసిస్తుంది… ఇండియన్ ప్లేయర్లలో ఫీల్డింగ్ మీద శ్రద్ధ బాగా కనిపించింది… ఎస్పెషల్లీ కోహ్లీ…
న్యూజీలాండ్ జట్టుకు సంబంధించి మొదట్లోనే మూణ్నాలుగు వికెట్లు పడటంతో వాళ్ల ఆట నెమ్మదించింది… చివరలో బ్రేస్‌వెల్ మంచి ఇన్నింగ్స్ ఆడి 250 స్కోర్ దాటించాడు… ఈ పిచ్ మీద ఇది ఫైటింగ్ స్కోరే… అందుకే చివరి ఓవర్ దాకా ఇండియన్లలో గెలుపు టెన్షన్ పెట్టింది…
Share this Article