.
అభిషేక్ శర్మ… ఇటీవల కాలంలో భారత జట్టు తరఫున విధ్వంసాన్ని సృష్టిస్తున్న బ్యాటర్… బాల్ వచ్చీరాగానే దంచుడే… పెద్ద పెద్ద తోపు బౌలర్లతోనే ఆడుకున్నాడు, పసికూన అమెరికా ఎంత…? ఇక కుమ్మేస్తాడు…
నిన్నటి టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌కు ముందు అందరూ ఇలాగే అనుకున్నారు… అమెరికా బౌలర్ బంతి విసిరాడు… అనుకున్నట్టుగానే అభిషేక్ భారీ షాట్ ఆడాడు… కానీ అక్కడ రెడిగా ఫీల్డర్… క్యాచ్… శర్మ గోల్డెన్ డక్… సాధారణంగా ఫస్ట్ ఓవర్లలో ఎక్సట్రా డీప్ కవర్‌లో ఫీల్డర్‌ను పెట్టదు ఏ జట్టూ… కానీ అమెరికా పెట్టింది… సరిగ్గా పడ్డాడు ట్రాప్‌లో…
Ads
అభిషేక్ ఎలాంటి షాట్లు ఆడతాడు, ఎక్కడ ఫీల్డర్ ఉంటే దొరికిపోతాడు, తనకు ఎలాంటి బాల్స్ వేయాలి, బ్యాటింగులో తన బలహీనతలు ఏమిటి… అసలు తనే కాదు, ఇండియన్ జట్టులో ఎవరెవరి బ్యాటింగు విధానం, ఒక్కొక్కరికి అనుసరించాల్సిన వ్యూహం ఏమిటి..? మొత్తం అమెరికాకు ముందే తెలుసు… ఎలా..?
ఓ దశలో మరీ 77 పరుగులకే 6 వికెట్లు… ఓ ఓవర్‌లోనైతే మూడు వికెట్లు… శివం దూబె డక్… రింకూ సింగ్ 6, హార్డిక్ పాండ్యా 5… అసలు 100 పరుగులైనా చేస్తారా అనిపించింది… కారణం ఎఐ…!! Player Performance Analysis… దీని గురించి స్పోర్ట్స్ సైన్స్ ఏం చెబుతుందంటే..?
-
Player Performance Analysis… AI is heavily utilized in analyzing player performance. Modern systems like Hawk-Eye and CricViz use machine learning algorithms to study vast datasets including a player’s past matches, techniques, and habits. These systems provide detailed insights into their strengths and weaknesses, helping coaches and players make data-driven decisions. Bowlers, for example, can now understand how to adjust their delivery for different types of batsmen based on historical data…
అవును, ఆటల్లో కొన్ని దేశాలు Predictive Analysis (ప్రిడిక్టివ్ అనాలిసిస్) ని విపరీతంగా వాడుతున్నాయి…. బేస్ బాల్ వంటి ఆటల్లో ఇప్పటికే ఇలాంటి AI మోడల్స్ సక్సెస్ అయ్యాయి… దాన్నే క్రికెట్‌కూ వర్తింపజేయడం ఇది..! ఈ AI టూల్ పేరు ‘క్రిక్-బాట్’ అంటారా, ‘స్ట్రాటజీ ఇంజిన్ అంటారా మీ ఇష్టం…
కోచ్ తన ఐప్యాడ్‌లో Hawk-Eye డేటాను చూపిస్తూ ఇలా అన్నాడు… ‘చూడూ, CricViz రిపోర్ట్స్ ప్రకారం ఆ బ్యాట్స్‌మన్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ కి ఇబ్బంది పడుతున్నాడు… మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ ఇచ్చే ఈ హిస్టారికల్ డేటా మనకి ఇప్పుడు పెద్ద ఆయుధం!…. ఇదుగో ఇలాంటి సీన్లు, డైలాగ్స్ మనం క్రికెట్‌లో విరివిగా చూడబోతున్నాం…
ఆశ్చర్యంగా ఉందా..? కానీ నిజమే… మన ఆటగాళ్ల వీడియోల్ని అనేకం ఎఐకి ఇచ్చి, ఒక్కొక్కరి ఆటతీరును మథించారు… పర్‌ఫెక్ట్‌గా దొరికిపోయారు మనోళ్లు… ఒక్క కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తప్ప..! మరి తనెలా తప్పించుకున్నాడు..? చాన్నాళ్లుగా అసలు ఫామ్‌లోనే లేడు… మొన్నటి న్యూజిలాండ్ టీ20 సీరీస్‌తో ఫామ్‌లోకి వచ్చాడు…
తను 360 డిగ్రీస్ బ్యాటర్… ఏ బాల్ ఎటు కొడతాడో చివరి క్షణం వరకు తనకే తెలియదు… అనూహ్యంగా ఉంటుంది తన బ్యాటింగ్ శైలి… నిన్నటి మ్యాచ్‌లో చూడండి కొన్ని షాట్లు… సంప్రదాయ విరుద్ధంగా… ఆఫ్ స్టంప్‌కు వైడ్‌గా వెళ్తున్న బంతిని ఆన్‌సైడ్ సిక్సర్‌గా బాదాడు ఓ షాట్… షాట్ కొట్టి, బ్యాలెన్స్ తప్పి పిచ్‌పై పడిపోయాడు… ఇది ఒక షాట్ గురించి… ఇలాంటివి ఎన్నో…
ఏబీ డివిలియర్స్ గుర్తుకు వచ్చాడా..? ఎందుకంటే ఇలాంటి ‘అన్- ఆర్థడాక్స్’ షాట్లు ఆడటంలో ఇద్దరూ ఇద్దరే… సో, అమెరికన్ టెక్నాలజీ మథనంలో దొరికిపోలేదు సూర్యకుమార్ యాదవ్… అందుకే 85 పరుగులు చేసి, ఇండియాను ఓ మాదిరి స్కోర్ వరకూ చేర్చాడు… ‘‘డేటా ఎప్పుడూ పాటర్న్స్‌ను వెతుకుతుంది, కానీ సూర్య ఆటలో పాటర్న్ ఉండదు’’… అందుకే అమెరికా జట్టును, వ్యూహాలకు మింగుడుపడలేదు…
వాన్ షాక్‌విల్క్ అనే బౌలర్‌కు 4 ఓవర్లలో 4 వికెట్లు… 12 డాట్ బాల్స్… మొహ్‌సిన్ 4 ఓవర్లు వేస్తే కేవలం 16 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు… నిజానికి మనోళ్లు అమెరికన్ జట్టును తేలికగా తీసుకోవడం వల్ల వచ్చిన తిప్పలు ఇవన్నీ… దానికి తోడు టెక్ సపోర్టుతో అమెరికన్ జట్టు రూపొందించుకున్న పర్‌ఫెక్ట్ గేమ్ స్ట్రాటజీ…
అఫ్‌కోర్స్, ఆ అమెరికా జట్టులో కూడా ఉన్నది మెజారిటీ మనోళ్లే… సాయితేజ ముక్కామల, సంజయ్ కృష్ణమూర్తి, మిలింద్ కుమార్, నితీష్ కుమార్, సౌరబ్, శుభం, హర్మీత్ సింగ్… అందరూ ఇండియన్ రూట్సే… మరి ఎఐ మనోళ్ల బ్యాటర్ల ఆటతీరు స్కాన్ చేసి, ప్లేయర్ వైజ్ స్ట్రాటజీ ఇచ్చింది కదా, మర మన బౌలర్లనూ వడబోసి ఉండాలి కదా అంటారా..?
నిజమే… అదీ జరిగింది… కాకపోతే ఏ బౌలర్ ఏ బాల్‌ను ఏ బ్యాటర్‌కు ఏ వేరియేషన్‌తో విసురుతాడో ముందుగానే పర్‌ఫెక్ట్‌గా అంచనా వేయడం కష్టం… ఎప్పటికప్పుడు ఎదుటి జట్టు కెప్టెన్ ఫీల్డింగ్ ప్లేస్‌మెంట్స్ ఎలా మారుస్తాడో కూడా ప్రిడక్ట్ చేయడం కూడా..! ఇది హ్యూమన్ ఇంటలిజెన్స్…!
ఐనా పర్లేదు… సూర్యకుమార్ యాదవ్‌ను సరైన టైమ్‌లో గనుక ఔట్ చేసి ఉంటే, అమెరికా జట్టు గెలిచేదేమో… అంత బాగా ఆడారు… ఇండియాతో సరే, మిగతా జట్లతో కూడా అమెరికా ఇలాగే ఆడగలదా..? డౌట్ అక్కర్లేదనేదే సమాధానం..!!
సో... గ్రౌండ్‌లో బ్యాట్‌తో పాటు, ఇకపై బ్యాక్‌గ్రౌండ్‌లో సూపర్ కంప్యూటర్లు కూడా పరుగుల వేటను శాసించబోతున్నాయన్నమాట..! టీమిండియా ఇకనైనా ఈ 'డిజిటల్ ట్రాప్'ను గుర్తించి అప్రమత్తమవ్వాలి... కంప్యూటర్ కోచ్‌లు..!!
Share this Article