Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

గిల్ సొంత హైటెక్ వాటర్ ప్యూరిఫయర్… కోహ్లీ అత్యంత ఖరీదైన వాటర్…

January 19, 2026 by M S R

.

న్యూజిలాండ్ మన గడ్డ మీద వన్‌డే సీరీస్ గెలిచింది… ఇండియా టీమ్ కూర్పు వికటించింది… రో-కో అనుకుంటే జస్ట్ కో మాత్రమే మెరిశాడు… న్యూజిలాండ్ బాగా ఆడింది, విజయాలకు అర్హులే, ప్రత్యేకించి వాళ్ల ఫీల్డింగ్ స్టాండర్డ్స్ సూపర్… ఇండియా బౌలర్లు, టాప్ ఆర్డర్ ఫెయిల్… ఇలా బోలెడు కారణాలు, విశ్లేషణల నడుమ ఓ వార్త ఇంట్రస్టింగు అనిపించింది…

అదేమిటంటే..? మూడో మ్యాచ్ జరిగింది ఇండోర్‌లో కదా… క్లీనెస్ట్ సిటీ అని మొన్నటిదాకా పేరున్న ఈ సిటీలో మంచినీరు, మురుగునీరు కలగలిసి దాదాపు 20 మందిదాకా మరణించారు, బోలెడు మంది హాస్పిటళ్ల పాలయ్యారు… దాంతో స్టార్ హోటళ్ల నీటినీ నమ్మలేక, స్టేడియంలో నీటినీ నమ్మలేక, బీసీసీఐని నమ్మలేక ఇండియన్ క్రికెటర్లు చేసుకున్న సొంత నీటి ఏర్పాట్లు ఆ వార్త సారాంశం…

Ads

లోకల్ పైపు లైన్ల సమస్య, వార్తలు విన్నారు కదా… శుభమన్ గిల్ తన కోసం ప్రత్యేకంగా 3 లక్షలతో అత్యాధునిక వాటర్ ప్యూరిఫయర్ తెచ్చుకున్నాడు… తనకు అకామిడేషన్ ఇచ్చిన హోటల్‌లో బిగించుకున్నాడు… ఆల్రెడీ ఆర్వో పద్ధతిలో ఫిల్టర్ చేసిన నీటిని కూడా ఈ ప్యూరిఫయర్ మరింత ఫిల్టర్ చేస్తుంది… అది బ్యాక్టీరియాను సమూలంగా చంపేసి, సురక్షిత నీటిని ఇస్తుంది…

gill

గతంలో డెంగీ బారిన పడి నష్టపోయాడు కదా, అందుకే ఈ అధిక జాగ్రత్తలు… హోటల్ యాజమాన్యం కూడా ఇగోకు పోకుండా గిల్ చెప్పినట్టు సహకరించింది… కోహ్లీ తన వెంట వందల నీటి బాటిళ్లు తెచ్చుకున్నాడు… బాటిల్స్ ఒక్కొక్కటి సుమారు ₹600 పైనే పలుకుతాయి… ఇది కేవలం దప్పిక తీర్చుకోవడానికి కాదు, ఆటలో అలసట రాకుండా ఉండటానికి ఒక మందులా పనిచేస్తుంది… ఇండోర్ నీటి భయమే కాదు, తను ఎక్కడికి వెళ్లినా తన వాటర్ బాటిళ్లు తనవే…

ఇవేకాదు… బీసీసీఐ మన ఆటగాళ్ల కోసం ప్రత్యేకంగా ఓ షెఫ్ టీమ్ పంపిస్తోంది… హోటళ్ల వంటకాలకన్నా మన క్రికెటర్ల వ్యక్తిగత డైట్ ప్రిఫరెన్సులను బట్టి ఫుడ్ వండుతుంది ఈ టీమ్… ఆ ఫుడ్ మాత్రమే తీసుకుంటారు క్రికెటర్లు… ఇక్కడా హోటళ్లను నమ్మరు… ఫుడ్ పడకపోతే అది ఆటతీరుపై ప్రభావం చూపిస్తుంది కాబట్టి…

విరాట్ కోహ్లీ…. గ్రిల్డ్ కూరగాయలు, సౌత్ ఇండియన్ ఫుడ్, సూప్స్ తీసుకుంటాడు… ఆయిల్, మసాలాలకు పూర్తి దూరం… ఫ్రాన్స్ నుండి ఇంపోర్ట్ చేసిన ‘Evian’ బాటిళ్లు సరేసరి… ఇవి బాడీలో pH స్థాయిని స్థిరంగా ఉంచుతాయి…

రోహిత్ శర్మ… పప్పు, అన్నం, సలాడ్, పెరుగు, పండ్లు… బరువు తగ్గే క్రమంలో చికెన్, ఫిష్ వంటి హై-ప్రోటీన్ ఫుడ్… పక్కాగా ప్యూరిఫైడ్ వాటర్, ఎలక్ట్రోలైట్ డ్రింక్స్…

శుభ్‌మన్ గిల్… ఉడికించిన గుడ్లు, పప్పు, రయితా, ఆకుకూరలు… డెంగ్యూ నుండి కోలుకున్నాక గిల్ డైట్ విషయంలో చాలా స్ట్రిక్ట్… ఇదీ కొందరు క్రికెటర్ల డైట్…

అవునూ, కోహ్లి తాగే వాటర్ వివరాలు కావాలా..?

kohli

1. బ్లాక్ ఆల్కలైన్ వాటర్ (Black Alkaline Water)

కోహ్లీ ఎక్కువగా తాగే ఈ “నల్ల నీరు” గురించి సోషల్ మీడియాలో ఎప్పుడూ చర్చ జరుగుతుంటుంది… దీని ప్రత్యేకతలు ఇవే…

  • రంగు…: ఇందులో ఉండే 70కి పైగా సహజ సిద్ధమైన ఖనిజాల (Minerals) వల్ల ఇది నలుపు రంగులో ఉంటుంది…

  • ధర…: దీని ధర లీటరుకు సుమారు ₹3,000 నుండి ₹4,000 వరకు ఉంటుంది (బ్రాండ్‌ను బట్టి మారుతుంటుంది)…

  • ప్రయోజనాలు…:

    • హైడ్రేషన్…: సాధారణ నీటి కంటే ఇది శరీరానికి వేగంగా అందుతుంది….

    • pH స్థాయి…: దీని pH లెవల్ 8.5 కంటే ఎక్కువగా ఉంటుంది, ఇది శరీరంలోని ఎసిడిటీని తగ్గిస్తుంది….

    • ఇమ్యూనిటీ…: ఇందులో ఉండే ‘ఫుల్విక్ యాసిడ్’ రోగనిరోధక శక్తిని పెంచడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది…

evian

2. ఎవియన్ (Evian) – నేచురల్ స్ప్రింగ్ వాటర్

కోహ్లీ చాలా కాలంగా వాడుతున్న మరొక బ్రాండ్ ‘ఎవియన్’…

  • మూలం..: ఈ నీటిని ఫ్రాన్స్‌లోని ఫ్రెంచ్ ఆల్ప్స్ పర్వతాల నుండి సేకరిస్తారు… పర్వతాల గుండా సహజంగా ఫిల్టర్ అయ్యి వచ్చే నీరు ఇది…

  • స్వచ్ఛత..: ఎటువంటి రసాయన ప్రక్రియలు లేకుండా నేరుగా ప్యాక్ చేస్తారు… 15 ఏళ్ల పాటు గ్లేసియర్ ఇసుక ద్వారా ఫిల్టర్ అయి రావడం దీని ప్రత్యేకత…

  • ధర…: దీని ధర లీటరుకు సుమారు ₹600 నుండి ₹800 ఉంటుంది (భారతదేశంలో దిగుమతి సుంకాల వల్ల ధర ఎక్కువగా ఉంటుంది)….

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • గిల్ సొంత హైటెక్ వాటర్ ప్యూరిఫయర్… కోహ్లీ అత్యంత ఖరీదైన వాటర్…
  • నాటో కూటమి అటో ఇటో… జియోపాలిటిక్స్‌లో అమెరికా కొత్త ఆట….
  • సాహసమే కృష్ణ ఊపిరి..! తెలుగు రాజకీయాల్లో పెద్ద రచ్చ ఆనాడు..!!
  • చమురుపై అమెరికా గ్రిప్… తద్వారా ప్రపంచంపై గ్రిప్… పార్ట్ 5
  • మదురో భవనం సెట్ వేసి… అమెరికా ఎడారిలో నెల రిహార్సల్… పార్ట్-4 …
  • వెనెజులా కొంప ముంచిన చైనా… చేతులెత్తేసిన నాసి రాడార్లు… పార్ట్-3
  • S E A D …. వెనెజులాపై దాడికి ప్రయోగించిన వార్ టెక్నిక్… (పార్ట్-2)
  • 2026 జియోపాలిటిక్స్… కాలజ్ఞాని బాబ వంగ ముందే చెప్పింది… (పార్ట్-1)
  • నేలకొరిగిన తెలుగు సింహం… ఒకేరోజు మూడు సప్లిమెంట్లు ఇచ్చాం….
  • అత్యంత అభ్యంతరకర వ్యాఖ్యలు… కాంగ్రెస్ పార్టీ సిగ్గుపడాలి…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions