Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నో కేసీయార్, నో బాబు, నో పవన్, నో రామోజీ… అబ్బే, ఇదేం టాప్100 జాబితా…

March 1, 2024 by M S R

ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వెలువరించిన ఇండియా టాప్ పవర్‌ఫుల్ పర్సనాలిటీల జాబితాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్థానం సంపాదించుకున్నాడు… ఊహించిందే… రీసెంటు  ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి, ఏకంగా సీఎం సీటుపై కూర్చున్న తనకు పాపులారిటీ ఇండెక్సులో ప్రముఖ స్థానం లభిస్తుందని అనుకున్నదే… తనకు 39 వ ప్లేసు లభించింది…

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కూడా ఈ లిస్టులో ఉన్నాడు… తను 56వ ప్లేసులో ఉన్నాడు… సరే, ఈ జాబితాలో దాదాపు ప్రతి ముఖ్యమంత్రీ, పాపులర్ బీజేపీ కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు, జగన్ పేరు లేకుండా ఎలా ఉంటుంది గానీ… తెలుగు రాష్ట్రాల్లో ఇంకెవరు పొలిటిషియన్స్ ఉన్నారు..?

ఒకసారి ఆసక్తి ఉన్నవాళ్లు ఈ టాప్100 జాబితా చదవొచ్చు ఇక్కడ… సహజంగానే మోడీ, అమిత్ షా మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు… దేశాన్ని శాసించే ఆదానీ 10వ ప్లేసు, తరువాత ప్లేసులో అంబానీ… 26వ ప్లేసులో నీతా అంబానీ… రాహుల్ గాంధీ 16వ ప్లేసు కాగా, సోనియా గాంధీ 29వ ప్లేసు, ప్రియాంక 62వ ప్లేసు… మమత, కేజ్రీవాల్ తదితరులు సోనియాకన్నా బెటర్ ప్లేసుల్లో ఉండటం గమనార్హం…

Ads

  1. Narendra Modi, Prime Minister of India
  2. Amit Shah, Union Home Minister
  3. Mohan Bhagwat, RSS chief
  4. DY Chandrachud, Chief Justice of India
  5. S Jaishankar, External Affairs Minister
  6. Yogi Adityanath, Uttar Pradesh CM
  7. Rajnath Singh, Defence Minister
  8. Nirmala Sitharaman, Finance Minister
  9. JP Nadda, BJP national president
  10. Gautam Adani, Chairman, Adani Group
  11. Mukesh Ambani, Chairman and Managing Director, RIL
  12. Piyush Goyal, Commerce Minister and Leader of the House, Rajya Sabha
  13. Ashwini Vaishnaw, Minister of Railways, Telecom and IT
  14. Himanta Biswa Sarma, Assam CM
  15. Mamata Banerjee, West Bengal CM and TMC chief
  16. Rahul Gandhi, Congress MP
  17. Ajit Doval, National Security Advisor
  18. Arvind Kejriwal, Delhi CM and AAP supremo
  19. Shaktikanta Das, RBI governor
  20. Hardeep Singh Puri, Union Minister of Housing & Urban Affairs and Petroleum & Natural Gas
  21. Sanjiv Khanna, Supreme Court Judge
  22. Siddaramaiah, Karnataka CM
  23. Mansukh Mandaviya, Minister of Health and Family Welfare; Chemicals and Fertilisers
  24. Nitish Kumar, Bihar CM and JDU chief
  25. MK Stalin, Tamil Nadu CM
  26. Nita Ambani, Chairperson and founder, Reliance Foundation
  27. Shah Rukh Khan, Actor
  28. Natarajan Chandrasekaran, Chairperson, Tata Group
  29. Sonia Gandhi, Former Congress president
  30. Rahul Navin, Acting Director, Enforcement Directorate
  31. Bhupender Yadav, Minister of Environment, Forest and Climate Change
  32. Anurag Thakur, Minister of Information and Broadcasting, Sports and Youth Affairs
  33. Dharmendra Pradhan, Minister of Education
  34. Dattatreya Hosabale, General Secretary, RSS
  35. Jay Shah, BCCI secretary
  36. Mallikarjun Kharge, President, Indian National Congress
  37. Azim Premji, Founder, Wipro
  38. Virat Kohli, India batsman
  39. Anumula Revanth Reddy, Telangana CM
  40. Vinai Kumar Saxena, Delhi L-G
  41. Uday Kotak, Non-Executive Director
  42. Nandan Nilekani, Co-founder and Chairman of the Board, Infosys
  43. Anand Mahindra, Chairman, of the Mahindra Group
  44. Rajiv Bajaj, Managing Director, Bajaj Auto
  45. Neelkanth Mishra, Chief Economist, Axis Bank
  46. Neeraj Chopra, Olympic champion
  47. Naveen Patnaik, Chief Minister of Odisha
  48. Eknath Shinde, Chief Minister of Maharashtra
  49. Pinarayi Vijayan, Chief Minister of Kerala
  50. Devendra Fadnavis, Deputy Chief Minister of Maharashtra
  51. Tushar Mehta, Solicitor General of India
  52. PK Mishra, Principal Secretary to the Prime Minister
  53. Manoj Sinha, Lieutenant Governor of Jammu and Kashmir
  54. Sameer Nigam, Founder and CEO, PhonePe
  55. Mohan Yadav, Chief Minister of Madhya Pradesh
  56. YS Jagan Mohan Reddy, Chief Minister of Andhra Pradesh
  57. Kiran Nadar, Chairperson, Kiran Nadar Museum of Art
  58. MS Dhoni, Chennai Super Kings captain
  59. Rajeev Chandrasekhar, Minister of State of Electronics and IT, Skill Development and Entrepreneurship, and Jal Shakti
  60. Sunil Bansal, National General Secretary, BJP
  61. Pushkar Singh Dhami, Chief Minister of Uttarakhand
  62. Priyanka Gandhi Vadra, Congress general secretary
  63. Rajiv Kumar, Chief Election Commissioner
  64. Bhagwant Mann, Chief Minister of Punjab
  65. General Anil Chauhan, Chief of Defence Staff (CDS)
  66. TV Somanathan, Finance and Expenditure Secretary
  67. CR Paatil, Gujarat BJP President and Lok Sabha MP
  68. Rohit Sharma, India cricket captain
  69. Madhabi Puri Buch, Chairperson, Securities and Exchange Board of India (SEBI)
  70. Gajendra Singh Shekhawat, Minister of Jal Shakti
  71. Bhupendra Patel, Chief Minister of Gujarat
  72. DK Shivakumar, Deputy Chief Minister, Karnataka; state Congress chief
  73. Tejashwi Prasad Yadav, Leader of Opposition in Bihar; RJD leader
  74. Bhajan Lal Sharma, Chief Minister of Rajasthan
  75. Akhilesh Yadav, President of Samajwadi Party
  76. Ajit Pawar, Deputy chief minister of Maharashtra, and President, the Nationalist Congress Party
  77. Vishnu Deo Sai, Chief Minister of Chhattisgarh
  78. Asaduddin Owaisi, AIMIM President and Hyderabad MP
  79. Alia Bhatt, Actor, producer, entrepreneur
  80. Harish Salve, Former Solicitor General of India
  81. General Manoj Pande, Chief of Army Staff
  82. Manohar Lal Khattar, Chief Minister of Haryana
  83. S Somanath, Chairman, ISRO
  84. Shashi Tharoor, Congress MP and author
  85. Kumar Mangalam Birla, Chairman, Aditya Birla Group
  86. Ramdev, Yoga guru, businessman
  87. Deepika Padukone, Actor
  88. Sunil Bharti Mittal, Chairperson, Bharati Enterprises
  89. Praful Khoda Patel, Administrator of Dadra and Nagar Haveli and Daman and Diu, and Lakshadweep
  90. Sukhvinder Singh Sukhu, Chief Minister, Himachal Pradesh
  91. Adhir Ranjan Chowdhury, Leader of the Indian National Congress in Lok Sabha
  92. Prashant Bhushan, Public interest lawyer
  93. Hemant Soren, Former Chief Minister, Jharkhand
  94. Sharad Pawar, President, Nationalist Congress Party (Sharadchandra Pawar)
  95. Uddhav Thackeray, President, Shiv Sena (Uddhav Balasaheb Thackeray)
  96. Sadhguru, Founder, Isha Foundation
  97. Karan Johar, Director and producer
  98. Yusuff Ali M A, Chairman and MD, Lulu group
  99. Amitabh Bachchan, Actor
  100. Vinesh Phogat, World Champion, wrestling

ఈ జాబితాలో ప్రధానంగా రాజకీయంగా ఉన్నత హోదాల్లో ఉన్నవాళ్లు, అధికారిక పదవుల్లో ఉన్నవాళ్లు అధికం కాగా, టాప్ వ్యాపారవేత్తలు, వ్యాపార ఆర్థిక సంస్థల హెడ్స్ దాదాపు అందరూ జాబితాలో ఉన్నారు… క్రీడాకారుల్లో ధోనీ, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, వినేశ్ ఫోగల్, నీరజ్ చోప్రాలు మాత్రమే ఉన్నారు…

ఇంట్రస్టింగ్ ఏమిటంటే… షారూక్ ఖాన్, ఆలియా భట్, దీపిక పడుకోన్ బెటర్ ప్లేసుల్లో ఉండగా… బిగ్ బి షెహన్ షా అమితాబ్ బచ్చన్ మరీ 99వ ప్లేసులో ఉన్నాడు… మన పద్మవిభూషణాలు అస్సలు లేవు జాబితాలో… ప్రశాంత్ భూషణ్ వంటి లాయర్లున్నారు గానీ జాబితాలో ప్రముఖ పాత్రికేయులు కూడా ఎవరూ లేరు… రామోజీరావు, రాధాకృష్ణలు కూడా లేరు… సరే, ఆ ముగ్గురూ ఉన్నారా లేరా అనేదే కదా మీ  ప్రశ్న…

ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత ఫామ్ హౌజు చేరుకుని, ఒక్కసారి తప్ప మళ్లీ జనం ఎదుటకు రాని కేసీయార్ జాబితాలో లేడు… ఒకప్పుడు కేంద్ర రాజకీయాలను, అనగా దేశాన్ని శాసించిన చంద్రబాబు పేరు లేదు… చంద్రబాబు అనే అగ్నికి తోడుగా బలంగా వీస్తుందని చెబుతున్న వాయువు పవన్ కల్యాణ్ పేరు కూడా లేదు… రేవంత్, జగన్‌లకు తోడుగా జస్ట్, మజ్లిస్ అసదుద్దీన్ పేరు మాత్రం టాప్ 100లో ఉంది… ఇదీ సంగతి…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions