.
ఓ పోస్టు చూస్తే… పాపం పుష్పరాజ్ అనిపించింది…, ఇక వీర బన్నీ ఫ్యాన్స్‌కు ఎంత కోపమొస్తుందో…
Ads
చూశారు కదా పోస్టు… ఎవరో ఇద్దరు హీరోలు అరెస్టయ్యారు అంటూ రెండు ఫోటోలు పెట్టాడు సోషల్ మీడియాలో… పోలిక… ఒకరు బన్నీ, ఒకరు పల్లవి ప్రశాంత్…
పల్లవి ప్రశాంత్ ఎవరూ అనడక్కండి… ది గ్రేట్ బిగ్‌బాస్ గత సీజన్ విన్నర్… గరుడపురాణ ప్రవచనకర్త శివాజీ వీరశిష్యుడు… తెలుసు కదా… గుర్తుంది కదా తను విన్నరై బయటికి వచ్చాక జరిగిన విధ్వంసం…
అటు ర్యాలీ చేయొద్దని పల్లవి ప్రశాంత్‌కి పోలీసులు సూచించినా కూడా వాళ్ల మాటని లెక్క చేయకుండా ర్యాలీగా వెళ్లాడు… ఇతన్ని చూసి అల్లరి మూకలు, గంజాయి బ్యాచ్‌లు మరింత రెచ్చిపోయారు…
ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేశారు… వాహనదారులపై దాడులు చేశారు… అలాగే రన్నర్‌గా నిలిచిన అమర్‌దీప్ ఫ్యామిలీపై నిర్ధాక్షిణ్యంగా దాడి చేశారు. అమర్ దీప్‌తో పాటు.. అతని భార్య, తల్లిని దారుణంగా తిడుతూ.. కొడుతూ ఉరికించి ఉరికించి కొట్టారు. వాళ్ల కారుని పూర్తిగా ధ్వంసం చేశారు.
వాళ్లతో పాటు.. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అయిన గీతు, అశ్విని, భోలే, సందీప్ మాస్టర్, శోభాశెట్టి కార్లను కూడా ధ్వంసం చేశారు… పోలీసులు వారిస్తున్న వినకుండా… ఆ అల్లరి మూకల్ని రెచ్చగొట్టి, ఆ దాడికి బాధ్యుడైన పల్లవి ప్రశాంత్‌ని అరెస్ట్ చేసి అప్పట్లో రిమాండ్‌కి తరలించారు పోలీసులు…
అదీ ఆ ఉద్దారకుడి అరెస్టు కథ… సరే, అల్లు అర్జున్ అరెస్టు కథ రెండురోజులుగా దేశప్రజలు పారాయణం చేస్తున్నదే కదా… కొత్తగా చెప్పుకోనక్కర్లేదు…
ఈ పోస్టు ఎవరో పెడితే తను షేర్ చేసుకున్నాడా..? లేక పోస్టు పెట్టించి తను షేర్ చేస్తుంటాడా..? కానీ దీన్నే పైత్యం అంటారు… ఇదుగో ఇలాంటి వాళ్లను హీరోలను చేసి, జనం మీదకు అచ్చోసి వదులుతుంది బిగ్‌బాస్ రియాలిటీ షో… అదే స్టార్ మాటీవీలో పిచ్చి షోలు చేస్తుంటారు కదా, వీళ్లే హాజరై వినోదం పేరిట వెకిలి చేష్టలు చేస్తుంటారు ఆ షోలలో…
ఇక వీళ్లు హీరోలం అనుకుని, మేమేమైనా బన్నీకి తక్కువా అనుకుని… ఇదుగో ఇలాంటి పైత్యం పోస్టులకు ఒడిగడతారు… ఇంకా బన్నీ వీరాభిమానుల దృష్టికి రానట్టుంది ఈ పోస్టు… ఏమో, వచ్చి ఉందేమో కూడా… అరె, ఏముంది భయ్, అక్కడ విధ్వంసం, ఇక్కడ తొక్కిసలాట, వాళ్లకు ప్రత్యక్షంగా సంబంధం ఉందా… ఐనా ఇద్దరినీ అరెస్టు చేశారు కదా అంటారా..? ఏమోలెండి… మరీ బన్నీ ఎక్కడ..? ఈ పిల్లబిత్తిరి ఎక్కడ..?
జాతీయ అవార్డు గ్రహీతల జోలికి, బిగ్‌బాస్ విన్నర్ల జోలికి మాత్రం పోలీసులు వెళ్లకూడదు… ఇదీ ఈ నీతి..! అంతేనా సార్..!!
Share this Article