సింగర్ ప్రణవి … ఎక్కడో ఏదో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… సినిమాలో పాట పాడే అవకాశం ఇవ్వాలంటే తనతో పడుకోమన్నాడు అని చెప్పింది… చెప్పుతో కొడతానని చెప్పాను… ఒక పాట పాడితే మరీ వెయ్యి, రెండు వేలు చేతిలో పెట్టి దులుపుకునేవాళ్లూ ఉన్నారు అని నిర్మొహమాటంగా నిజాల్ని బద్దలు కొట్టింది…
తను ధైర్యంగా బయటపెట్టింది కానీ చాలామంది అనుభవిస్తున్నదే… కానీ బయటికి చెప్పరు, చెప్పలేరు… నిజంగానే సినిమా సంగీత ప్రపంచం దరిద్రంగానే ఉంది… అఫ్‌కోర్స్, సొసైటీలోని అన్ని ఫీల్డ్స్ అలాగే ఉన్నాయి… ఐతే దోపిడీ ఉంది, కొత్త రక్తం వస్తూనే ఉంది… ఇంకా వేల మంది నేర్చుకుంటూనే ఉన్నారు… పోటీలోకి అడుగుపెడుతూనే ఉన్నారు…
టీవీ చానెళ్లలో బోలెడు సింగింగ్ కంపిటీషన్ షోలు వస్తూనే ఉన్నాయి… కానీ ఎందరికి సినిమా పాటల చాన్సులు వస్తున్నాయి… ఎందుకు ఫీల్డులో నిలబడుతున్నారు… పెద్ద ప్రశ్నే… రెగ్యులర్ సింగింగ్ చాన్సులు రావాలంటే మెరిట్, లక్, బలమైన సపోర్ట్, ఇంకేదో లౌక్యం ఎట్సెట్రా కావాలి… ఇండియన్ ఐడల్ సీజన్-3 ఆడిషన్స్ చూస్తుంటే ఇదే అనిపించింది…
Ads
అమెరికా, ఆస్ట్రేలియా, కెనడాల నుంచి కూడా కంటెస్టెంట్లు వచ్చి పాడారు… అన్ని వేల మందిలో టాప్ 12 కంటెస్టెంట్లను ఎంపిక చేయడం నిజంగానే పెద్ద టాస్క్… అంత బలంగా పోటీలుపడ్డారు… వీళ్లందరిలో ఎవరు రెగ్యులర్ సింగర్‌గా నిలబడగలరు..? అవున్లెండి, లక్షల మంది క్రికెట్ ఆడుతారు మన దేశంలో… ఇండియన్ టీమ్‌లో లేదా ఐపీఎల్‌లో లేదా పేరున్న ట్రోఫీల్లో ఆడే అవకాశం కొందరికే కదా వచ్చేది… ఇదీ అంతే… కట్ థ్రోట్ కంపిటీషన్…
సరే, ఇండియన్ ఐడల్ తెలుగు షోకు వస్తే… ఈ 3 సీజన్‌లో కంటెస్టెంట్ల ఎంపికలోనూ రాగద్వేషాలు, ఏవో ఎమోషన్స్ ప్రభావం చూపించాయి… టీవీ షోలు కదా, ఇవన్నీ సహజమే… అంతిమంగా మెరిట్ గెలవొచ్చు, ఏమో గెలవకపోవచ్చు కూడా… కొత్త గాయకులకు పాడే విధానం నేర్పించే రామాచారి కొడుకు సాకేత్ ఒకరిని తీసుకొచ్చాడు… సెలక్ట్… మెల్‌బోర్న్ నుంచి వచ్చిన ఒక కంటెస్టెంటును శ్రీరామచంద్ర అప్రిసియేట్ చేశాడు… సెలక్ట్… పాత కంటెస్టెంట్ కార్తికేయ వచ్చి ఒకరిని సెలెక్ట్ చేశాడు… బాగుంది, గోల్డెన్ మైక్ నేరుగా…
ధర్మపురి నుంచి ఒకాయన… సంగీతం నేర్చుకోలేదు… కానీ కార్తీక్ ఫ్యాన్… సెలెక్ట్… మరొకామె ఒడిశా నుంచి వచ్చిన సింగర్ కూడా కార్తీక్ వీర ఫ్యాన్… కానీ టాప్ 12లోకి రాలేదనుకొండి… ఒకామె గీతామాధురికి బాగా తెలుసు… పైగా అమ్మ సెంటిమెంట్… సెలెక్ట్… ఫాఫం, ఈసారి థమన్ ఫ్యాన్స్ ఎవరూ రానట్టున్నారు… బట్, టాప్ 12 స్థూలంగా చూస్తే మెరిటోరియస్ సింగర్సే… సో, సీజన్ రక్తికట్టడం ఖాయం… దుమ్మురేపే ఆర్కెస్ట్రా కూడా ఉండనే ఉంది…
ఈ షోలో కాస్త ప్రతిభ చూపేవాళ్లకు ఓ మంచి అవకాశం… థమన్ నేరుగా పుష్ చేస్తాడు ఫీల్డులో… తనూ అదే చెప్పాడు… గత రెండు సీజన్లలో బాగా పాడిన వాళ్లు తనతోపాటు విదేశీ టూర్లు, కచేరీలకు వస్తున్నారని… గుడ్… అందరికీ సినిమాలకు పాడే చాన్స్ రావాలనేముంది..? ఆడిషన్స్ నాలుగు ఎపిసోడ్లు ఆసక్తికరంగా ముగిశాయి… ఇక నెక్స్ట్ లెవల్‌కు వెళ్లడమే… మరి ఆహా ఇంత ఖర్చు పెడుతోంది కదా, మరి మేమెందుకు దీటుగా ఈ మ్యూజిక్ షోలను తీసుకురాలేకపోతున్నామో స్టార్ మా, జీతెలుగు, ఈటీవీ ఆలోచించుకోవాలి ఓసారి..!!
Share this Article