పార్ధసారధి పోట్లూరి ….. ఈ వార్త బహుశా కమ్యూనిస్ట్ లకి, కాంగీలకి మింగుడు పడనిది! ఇజ్రాయెల్, తైవాన్ దేశాలు భారత్ నుండి లేబర్ లేదా వర్క్ ఫోర్స్ దిగుమతి చేసుకోవాలని నిర్ణయించాయి! ఇజ్రాయెల్ దేశం ఒక లక్ష మందిని, తైవాన్ దేశం మరో లక్షమందిని దిగుమతి చేసుకోవాలని నిర్ణయించాయి!
ఇజ్రాయెల్ కి లక్షమంది ఎందుకు అవసరం? గత అక్టోబర్ 7 వ తారీఖు వరకు ఇజ్రాయెల్ లో పని చేయడానికి గాజా, వెస్ట్ బాంక్ లోని పాలస్తీనా ప్రజలకి 80 వేల వర్క్ పర్మిట్స్ ఇస్తూ వచ్చింది. ప్రతి రోజూ దాదాపుగా 60 వేల మంది పాలస్తీనా ప్రజలు బోర్డర్ చెక్ పోస్ట్ ల వద్ద తమ వర్క్ పర్మిట్ లని చూపించి ఇజ్రాయెల్ లోకి ప్రవేశించి పని చేసి డబ్బులు తీసుకొని సాయంత్రానికి తిరిగి వెళ్లిపోతూ ఉంటారు!
అక్టోబర్ 7 న ఏం జరిగింది? హమాస్ దాడి మొదలవక ముందే గాజా నుండి వ్యవసాయ, నిర్మాణ రంగంలో పనిచేసే వాళ్ళు చెక్ పోస్ట్ ద్వారా ఇజ్రాయెల్ లోకి ప్రవేశించి తమ పనులలో చేరిపోయారు. హమాస్ దాడి మొదలవగానే రోడ్ల పక్కన నిర్మాణ పనుల్లో ఉన్న పాలస్తీనా ప్రజలు, వ్యవసాయ పనుల్లో ఉన్నవాళ్లు, షాపింగ్ మాల్స్ లో పని చేసే వాళ్ళు హమాస్ ఉగ్రవాదులకు ప్రత్యేక సంకేతాల ద్వారా ఎవరు ఎక్కడ ఉన్నదీ చెప్పారు.
Ads
దాడికి ముందే వీళ్ళు ఒంటరి మహిళలు, వృద్ధులు, ఉండే ఇళ్ళని గుర్తు పెట్టుకొని సమాచారం హమాస్ కి ఇచ్చారు! వరసగా 7 రోజుల సెలవులు కావడంతో ట్రాఫిక్ పెద్దగా లేకపోవడం, ఇజ్రాయెల్ పోలీస్, సైన్యం ఉండే బేస్ లకి దారి చూపించడం అంతా CC కేమేరాలలో రికార్డ్ అయ్యింది!
హమాస్ దాడికి సహకరించారు కాబట్టి ఇక గాజా, వెస్ట్ బాంక్ ప్రజలకి వర్క్ పర్మిట్లు ఇవ్వడం నిలిపివేసింది ఇజ్రాయెల్ ప్రభుత్వం! ఇక ముందు కూడా అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించారు!
ప్రస్తుతం గాజాలో ఇజ్రాయెల్ సైన్యం ఉగ్రవాదుల వేటలో ఉండడం, రిజర్వ్ లో ఉన్నవాళ్ళని యుద్ధ సన్నద్ధంగా ఉంచడంతో కార్మికులకు తీవ్ర కొరత ఏర్పడింది. ఇజ్రాయెల్ యుద్ధ ప్రాతిపదికన లక్ష మంది స్కిల్డ్, అన్స్కిల్డ్ భారతీయ కార్మికులకు వర్క్ పర్మిట్లు ఇవ్వాలని నిర్ణయించారు! ఈ విషయం మీద ఇప్పటికే భారత ప్రభుత్వాన్ని సంప్రదించినట్లు తెలుస్తున్నది!
భారత ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయడంతో డిసెంబర్ నెలలో ఇజ్రాయెల్ వర్క్ పర్మిట్లు జారీ చేసే అవకాశాలు ఉన్నాయి! అయితే భారతీయ కార్మికులు ఇజ్రాయెల్ వెళ్ళడానికి ఒక పటిష్టమయిన ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని నిర్ణయించారు! నేరుగా కార్మిక, విదేశాంగ శాఖల ద్వారా పంపించాలా లేక అధీకృత సంస్థల ద్వారా పంపించాలా అనే దాని మీద చర్చలు జరుపుతున్నారు! ప్రయివేట్ సంస్థలకి ఇచ్చే పక్షంలో ఎలాంటి మోసాలు జరగకుండా చూసేందుకు కావాల్సిన జాగ్రత్తలు తీసుకొని అప్పగించవచ్చు!
ఇక తైవాన్ విషయానికి వస్తే యువకుల కొరతను ఎదుర్కొంటున్నది! తైవాన్ జనాభా 2,39,33,160 మంది! ఇందులో 20% మంది వృద్ధులు ఉన్నారు! అంటే షుమారుగా 45 లక్షల మంది వృద్ధులు అన్నమాట! వచ్చే సంవత్సరం వృద్ధులు లేదా పదవీ విరమణ చేసే వాళ్ళు మరో 5 లక్షల మంది ఉండవచ్చు అని అంచనా! పని చేయడానికి కావాల్సిన అర్హత కల వయస్సు రావడానికి తైవాన్ బాలురకు మరో 4 ఏళ్ళు పట్టవచ్చు కానీ ఈ విరామంలో ఉత్పత్తి పడిపోతుంది కాబట్టి తైవాన్ కార్మికుల కొరత లేకుండా భారత్ నుండి కార్మికులకు వర్క్ పర్మిట్ లు ఇవ్వాలని నిర్ణయించింది!
తైవాన్ విషయంలో చైనాకి అభ్యంతరాలు ఉంటాయి. అది భారత్ నుండి వర్క్ ఫోర్స్ ని తీసుకోవడం మీదనే! కానీ ఇంతకంటే ప్రత్యామ్నాయం లేదు. ఎందుకంటే 2035 వరకు భారత్ లో యువకుల సంఖ్య ఎక్కువగా,ని లకడగా ఉంటుంది! అఫ్కోర్స్ చైనాలో కూడా 2028 నాటికి వృద్ధుల సంఖ్య ఎక్కువగానూ, యువకుల సంఖ్య తక్కువగానూ ఉండబోతుంది!
So! చైనా కూడ ఏదో ఒక దేశం నుండి వర్క్ ఫోర్స్ ని దిగుమతి చేసుకోక తప్పదు! ఎక్కడి నుండి తీసుకుంటుంది? రష్యానా? రష్యాకి కూడా మరో ఐదేళ్లలో హీన పక్షం 2 లక్షల వర్క్ ఫోర్స్ అవసరం ఉంటుంది… అదే సమయంలో చైనాకి 5 లక్షల మంది అవసరం అవుతారు! ఉత్తర కొరియా..? మహా అయితే 5 వేల మందిని ఇవ్వగలదు ఉత్తర కొరియా!
2035 వరకు ప్రపంచంలో ఏ దేశానికి అయినా వర్క్ ఫోర్స్ ని ఇవ్వగల దేశం భారత్ మాత్రమే! భారత్ కి లాభం ఎలా ఉండబోతుంది! ఇజ్రాయెల్, తైవాన్ దేశాలు భారత కార్మికులకు డాలర్ల రూపంలో చెల్లింపులు చేస్తాయి. అంటే రెమిటెన్స్ రూపంలో మన దేశానికి డాలర్లు వస్తాయి! మన డాలర్ రిజర్వ్ పెరుగుతుంది!
ఇజ్రాయెల్, తైవాన్ లకి వెళ్ళడానికి మన విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేస్తుంది! ఎవరిని ఎలా కలవాలో విదేశాంగ శాఖ వెబ్ సైటులో పెడుతుంది! దాని ఆధారంగా వెళితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు! నా దృష్టికి వస్తే వెంటనే పోస్టులో వివరంగా తెలియచేస్తాను! ట్రావెల్ ఏజన్సీలని నమ్ముకుంటే విజిట్ వీసా ఇచ్చి మోసం చేస్తారు జాగ్రత్త!
Share this Article