Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నను వలచావని తెలిసేలోగా నివురై పోతానూ… నేటికీ జ్వలించే పాటే అది…

October 11, 2024 by M S R

ఏడు రంగుల ఇంద్రధనసు ఈడు వచ్చిన నా సొగసు , నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమవాసివి . ఇంద్రధనస్సు సినిమా అనగానే ఈ రెండు పాటలే ముందుగా గుర్తుకొచ్చేవి . కె వి మహదేవన్ సంగీత దర్శకత్వంలో ఆత్రేయ వ్రాసిన పాటలు అద్భుతంగా పండాయి . మిగిలిన పాటలు ఇది మైకమా బింకమా ఇదే ఇదే నీకు అందమా , తడిసిన కోక కట్టుకుని కడవ సంకన పెట్టుకుని వస్తుంటే , మూసుకో మూసుకో తలుపులన్నీ మూసుకో , ప్రేమకు మరణం లేదు కూడా బాగుంటాయి .

కె బాపయ్య దర్శకత్వంలో 1978 లో వచ్చిన ఈ ఇంద్రధనస్సు సినిమా ఎబౌ ఏవరేజిగా ఆడినట్లు గుర్తు . మహిళలకు బాగానే నచ్చింది . మొత్తం మీద వంద రోజులు ఆడింది . ఆ రోజుల్లో వచ్చిన అప్పలాచార్య ప్రత్యేక హాస్యరచనలు చాలా వరకు అపహాస్యమే అయ్యాయి . అయితే ఈ సినిమాలో మెయిన్ కధలో కలిపాడు . అది కాస్త సంతోషం . చాలా వాటిల్లో కామెడీ ట్రాక్ మెయిన్ ట్రాక్కుకు సంబంధం లేకుండా నేసేవారు . ఈ సినిమాలో కామెడీ ట్రాకులో జయమాలినికి కాసేపు నటించేందుకు అవకాశం ఇచ్చారు .

సాధారణంగా ఏ సినిమాలో అయినా లేడీ ఆర్టిస్టులను అందంగా చూపించేందుకు మేకప్ టీం , దర్శకుడు ప్రయత్నిస్తారు . మరి ఈ సినిమాలో ఆ మేకప్ టీం ఎవరో కాని శారదను , కాంచనను , జయమాలినిలను అందంగా చూపలేకపోయారు . కృష్ణ చాలా అందంగా కనిపిస్తారు . నటన కూడా బాగుంటుంది .

Ads

ఈ సినిమా ప్రత్యేకత పోలో . బహుశా తెలుగు సినిమాలలో పోలోని చూపిన మొదటి సినిమా ఇదే అనుకుంటాను . సినిమాను కూడా రిచ్ గా తీసారు . ఔట్ డోర్ షూటింగ్ అంతా ఊటీ అనుకుంటా . లొకేషన్స్ అన్నీ అందంగా కనిపిస్తాయి .

చాలా మంది నటీనటులు నటించారు . ఇద్దరు శారదలు ఉంటారు . ఒకరి తర్వాత మరొకరు వస్తారు . కృష్ణ , గిరిబాబు , గుమ్మడి , శరత్ బాబు , ప్రసాద్ బాబు , సారధి , నగేష్ , పద్మనాభం , పి జె శర్మ , ప్రభాకరరెడ్డి , కాకరాల , శ్రీధర్ , కాంచన , పుష్పకుమారి , జయమాలిని , ఫణి , బేబి వరలక్ష్మి నటించారు .

నాకీ సినిమా నచ్చింది . రెండు సార్లు చూసా . టివిలో వచ్చినట్లు గుర్తు లేదు . సినిమా యూట్యూబులో ఉంది . చూడబులే . కృష్ణ , శారద అభిమానులు అయితే , ఇంతకుముందు చూసి ఉండకపోతే తప్పక చూడండి . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు ….. (దోగిపర్తి సుబ్రహ్మణ్యం)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • శాపగ్రస్త..! రాస్తే నవల… తీస్తే సినిమా… బతుకంతా ప్రేమరాహిత్యమే..!!
  • ఆ కుటుంబమే క్షమించేసింది… మళ్లీ ఇప్పుడు ఈ ఆగ్రహ ప్రకటనలేల..?!
  • “కావమ్మ మొగుడు… అంటే కామోసు అనుకున్నాను… నాకేం సంబంధం…?’’
  • బహుశా విజయశాంతికీ గుర్తుండి ఉండదు ఇదో సినిమా చేసినట్టు..!!
  • దటీజ్ రాజనాల..! వేషం దొరికితే చాలు, దర్శకులకే క్లాసులు…
  • అల్లు రామలింగయ్య ఓ శాడిస్టిక్ విలన్… చిరంజీవి బాధితుడు ఫాఫం…
  • నా పెంపుడు కోడి కాళ్లు విరగ్గొట్టాడు వెధవ… వాడిని వదలొద్దు సర్…
  • అయ్యో రామా… ఓ అనాసక్త సినిమాలో ఆమే ప్లజెంట్ భామ…
  • ‘‘మేం ఏం నష్టపోయాయో, పగిలిన ఒక్క గాజుముక్క చూపించండోయ్…’’
  • ఆల్రెడీ యూట్యూబ్ వీడియోల క్వాలిటీకి ఎఐ టూల్స్ పర్యవేక్షణ…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions