Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కాపీ అనకూడదు… స్పూర్తి, ప్రేరణ, అనుసృజన అని పిలవాలి…

November 2, 2024 by M S R

ఇమిటేషనా? ఇన్స్ పిరేషనా?
ఒక మాతృకను ఆధారం చేసుకుని మళ్లీ సృజించడం అనేది రెండు రకాలుగా సాగుతుంది.
ఒకటి యథాతథంగా అనుకరించడం దాన్ని పామర భాషలో కాపీ అంటారు.
ఇక రెండోది మాతృకను చూసి ప్రేరణ పొంది సరికొత్తగా దాన్ని ఉపయోగించడం. దీన్ని అనుసృజన లేదా ప్రేరణ అంటారు.
ఇలా తెలుగు సినిమాల్లో త్యాగరాయ కృతులతో పాటు బాగా ప్రచారం పొందిన సంగీత రచనల ప్రేరణతో వచ్చిన అపురూప గీతాల గురించి మాట్లాడుకుందాం …

రఘువంశ సుధాంబుధి చంద్రశ్రీ … విన్నారు కదా… పట్నం వారు రాసిన కీర్తనలు తెలుగు సినిమా దర్శకులకు మార్గ నిర్దేశం చేశాయి.
సినిమా సంగీత దర్శకుల్ని విపరీతంగా ఆకట్టుకున్న పట్నం వారి కీర్తన రఘువంశ సుధాంబుధి చంద్రశ్రీ.
కదన కుతూహల రాగంలో స్వరపరచిన ఈ కీర్తన ఆధారంగా రమేష్ నాయుడు, మణిశర్మలు రెండు పాటలను స్వరపరిచారు.
విచిత్రంగా రెండూ వేటూరి సుందరరామ్మూర్తే రాయడం విశేషం.
కట్నం కోసం మహిళల మీద జరుగుతున్న అమానుషాన్ని ఎండగడుతూ… రఘువంశ సుధాంబుధి వరసల్లోనే పాట రాశారు వేటూరి. కట్నమన్నదే కంఠ పాశమై…
కలకంఠి కంట నీరొలకగా…
ఆడపిల్లలకే అపచారమా?
అంటూ సాగుతుంది వేటూరి వారి కలం.
శ్రీవారికి ప్రేమలేఖలో.

ఇక ఇదే కదన కుతూహల రాగం ఆధారంగా నడిచిన మరో వేటూరి వారి రచన చూడాలని ఉంది సినిమాలో ఉంది.
మెగాస్టార్ చిరంజీవి కోసం హరిహరన్ పాడిన యమహా నగరి కలకత్తా పురి …. కూడా రఘువంశ సుధాంబుది బాణీలోనే సాగుతుంది.
ఇక వేటూరి ఛమక్కు కూడా చురుక్కున తగులుతుంది.
చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మది అంటాడు. అక్కడ పాడుతున్న పాత్రలో నటుడు చిరంజీవి. పాడుతున్న పాటేమో పట్నం సుబ్రహ్మణ్యం అయ్యర్ కృతి బాణీలో సాగేది.

Ads

మణిశర్మే చేసిన మరో సినిమా కెమేరామెన్ గంగతో రాంబాబు.
అందులో జనాలకు విపరీతంగా నచ్చేసిన పాటొకటి ఉంది.
అదేంటంటే…
నీ నగుమోము ఎక్ట్సార్టినరీ…
అది ఓ చారిత్రాత్మక విజయం సాధించిన ఎన్టీఆర్ సినిమా కోసం ఘంటసాల వారు చేసిన బాణీ ప్రేరణతో చేశారు మణిశర్మ.
ముందుగా ఒరిజినల్ చూడండి. చిత్రం లవకుశ.
పాట జగదభిరాముడు శ్రీరాముడే…
ఇప్పుడు జగదభిరాముడు శ్రీరాముడే పాట గుర్తు చేసుకున్నారు కదా…
ఉన్నది ఉన్నట్టుగా అదే బాణీలో సాగుతుంది కెమేరామెన్ గంగతో రాంబాబులోని నీ నగుమోము ఎక్ట్సార్టినరీ పాట.
దరువులో తేడా తప్ప మిగిలినదంతా సేప్ టూ సేమ్.
ఇది కూడా ఒక తమాషా కోసం చేసిన పనే తప్ప చౌర్యం కాదు. కాపీ అంతకన్నా కాదు.
అంటే మణి శర్మ ఆనందించేస్తాడు.

కీరవాణి స్వరం కట్టిన ఫీల్ గుడ్ మూవీ ఒకరికి ఒకరు లో కూడా ఇలాంటి ప్రయోగం జరిగింది.
త్యాగరాజ కీర్తన నాద తనుమ నిశం..శంకరం ఆధారంగా కీరవాణి ఓ మనోధర్మ గీతం ట్యూన్ చేశారు.
చిత్త రంజని రాగంలో స్వరపరచిన ఈ కృతి…నారదుడితో కలసి త్యాగయ్య పాడుతున్నట్టు సినిమాలో చూపించారు.

ఇప్పుడు కీరవాణి స్వరపరచిన ఒకరికి ఒకరు గీతం
నువ్వే నా ధ్యాస చూడండి.
ఈ రెండు పాటలూ ఒకేలా ఉండడం అర్ధమౌతుంది. ఇది కావాలనే కీరవాణి చేసిన ప్రయోగం.
ఇందుకు ఆయనకు తెలుగు సినిమా ప్రేక్షకులు ఎప్పటికీ రుణపడే ఉంటారు.

ఎవరైనా సంగీత దర్శకుడు ఒక పాత బాణీని అనుసరిచారంటే దానికో ప్రత్యేక కారణం ఉంటుంది. ఆ సందర్భం విన్నప్పుడు తన మదిలో స్ఫురించిన ఓ పాత పాటను ఉపయోగిస్తాడు.
సంగీత దర్శకుడు సత్యం దగ్గర ఇలాంటివి చాలానే కనిపిస్తాయి.
ఉదాహరణకు దేవానంద్ గైడ్ మూవీలో గాతారహే మేర దిల్ పాట వినండి.
ఎస్.డి. బర్మన్ చేసిన ఆ ట్యూన్ ప్రేరణతోనే అంతా మన మంచికే సినిమా కోసం ఓ అద్భుతమైన గీతం కంపోజ్ చేశారు సత్యం.
పాటంతా అలాగే ఉండదు.
చాలా వరకు మారుతుంది.
నవ్వవే నా చెలీ…. అంటూ వచ్చే ఈ పాట వింటుంటే ఎక్కడో విన్నట్టు ఉందే అనిపిస్తుంది… కాదేమో అనే సందేహమూ వేస్తుంది.

సాక్షాత్తూ శ్రీ కృష్ణుడే ఓ రఫీ గీతం విని ఇన్స్రైరై పాట పాడారంటే నమ్మగలమా? కానీ ఇది నిజం.
1962 లో వచ్చిన ఎక్ ముసాఫిర్ ఎక్ హసీనా చిత్రం కోసం ఓపీ నయ్యర్ చేసిన పాట శ్రీ కృష్ణుడికి నచ్చింది.
ఈ పాటను ఓపీ నయ్యర్ తిలంగ్ రాగంలో కంపోజ్ చేశారు. దీన్ని మిశ్రకమాజ్ అని కూడా అంటారు.
ఈ పాట విన్న శ్రీకృష్ణుడు పెండ్యాల గారి సంగీత దర్శకత్వంలో దాశరథి కృష్ణమాచార్యుల వారి సాహిత్యాన్ని ఆలపించారు.
ఘంటసాల గారి గళంలో వినిపించే ఓ చెలీ కోపమా పాటలో గోముతనము చాలా అద్భుతంగా పలికించారాయన.
ప్లేబ్యాక్ సింగర్స్ కు ఉండాల్సిన లక్షణాలు పుష్కలంగా ఉన్న గాయకుడు కావడంతో నటించే నటులకు చాలా వెసులుబాటు దొరికినట్టే బావించాలి …

ఎస్.డి.బర్మన్ నార్త్ టూ సౌత్ అనేక మంది సంగీత దర్శకుల్నీ గాయకుల్నీ ప్రభావితం చేసిన వ్యక్తి. ఆయన ప్రభావం చాలా మంది సంగీత దర్శకుల్లో అలా నిలచిపోయింది.
చాలా పరిశోధన తర్వాత కానీ ఈ పాట ఎస్డీ బర్మన్ పాట నుంచి ప్రేరణ పొంది చేసినది అని గుర్తుపట్టలేని విధంగా ట్యూన్లు వచ్చాయి.
ఉదాహరణకు శారద సినిమాలో శారదా నిను చేరగా పాట రాజేష్ ఖన్నా ఆరాధన కోసం ఎస్.డి.బర్మన్ చేసిన మేరీ సప్నోంకీ రాణీ కబ్ ఆయే గీతూ ప్రేరణతో చేసినదే.
శారద కోసం చక్రవర్తి స్వరం కట్టిన శారదా నిను చేరగా పాట వింటుండగా ఇలాంటి పాట ఎక్కడో విన్నామే అని చాలా మంది తీవ్రంగా మధనపడ్డారు.
పాట చివర్లో వచ్చే హమ్మింగ్… ఫినిషింగ్ లో వచ్చే ఆర్కెస్ట్రా అసలు విషయాన్ని పట్టించేస్తాయి. కావాలంటే వినండి.
పాత పాటల ప్రేరణతో చేసిన కొత్త బాణీలు చూశారుకదా… మళ్ళీ కలుద్దాం… (భరద్వాజ రంగావఝల)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మోడీజీ… అన్నీ బాగానే చెప్పావు… కానీ ఆ ఒక్క ప్రశ్నకు జవాబు..?!
  • ఆ భూకంపాలు ప్రకృతి కోపమా..? అణ్వస్త్ర గోదాముకు పడిన తూట్లా..?!
  • నీకోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో… ఇదో వింత కథ…
  • ఏమాత్రం ధృవీకరణ లేని… ఓ డిటెక్టివ్ స్టోరీ ఫ్రం ఆపరేషన్ సిందూర్…
  • మళ్లీ ఓసారి ఈ దేశం ఈ ఐరన్ లేడీ ఇందిరని గుర్తుతెచ్చుకుంటోంది..!!
  • ‘‘మొగుడు పోయిన ఆడది, ఎన్నిక ఓడిన లీడర్ జనంలోకి వెళ్లొద్దు’’
  • నిన్నటి కాల్పుల విరమణ మరియు మహాభారతంలోని ఓ సంభాషణ..!
  • కోహ్లి రిటైర్‌మెంట్ ప్రచారాల వెనుక అసలు కథలేమిటి..?
  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions