Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

థమన్‌కు భంగపాటు… పుష్ప-2 నిర్మాతలు పక్కన పడేశారా..?!

December 7, 2024 by M S R

.

నిజమే… థమన్ ఏం సాధించాడు… అనవసరంగా అవమానపడ్డాడు… తమ కంపోజింగ్ ఫీల్డులో ఓ అనారోగ్యకరమైన ధోరణికి తెరలేపి తనే భంగపడ్డాడు…

కిక్కుమనడం లేదు… స్పందన లేదు, బహుశా లోలోపల ఉడుక్కుంటూ ఉంటాడు… పుష్ప-2కు డైరెక్టర్ సుకుమార్… సుకుమార్‌కూ దేవిశ్రీప్రసాద్‌కూ మంచి బంధమున్నది… బన్నీకి కూడా ఇష్టుడే…

Ads

సరైన సమయమే ఇవ్వలేదో, అస్తవ్యస్తంగా సాగిన ప్రొడక్సన్ షెడ్యూల్ డీఎస్పీని కూడా డిస్టర్బ్ చేసిందో గానీ తన బీజీఎం అప్‌టుమార్క్ లేదు… అసలే 1000 కోట్ల లక్ష్యంతో చేస్తున్న సినిమా… దాంతో హీరో, దర్శకుడు డీఎస్పీని పక్కనపెట్టి బీజీఎం కోసం మరో ముగ్గురిని అడిగారు…

థమన్, అజనీష్, సీఎస్ శాం… రకరకాల వార్తలు వచ్చాయి… గతంలో మల్టీ కంపోజర్ల కల్చర్‌ను తెగనాడిన అదే థమన్ డీఎస్పీతో విభేదాలు వస్తాయని తెలిసీ, డబ్బు కోసం బీజీఎంకు సిద్దపడ్డాడు… ఎక్కువ టైమ్ లేకపోవడంతో ఒక పార్ట్‌కు బీజీఎం ఇచ్చానని చెప్పుకున్నాడు కూడా తనే…

శామ్ కూడా అదే చెప్పాడు… డీఎస్పీ మొదట్లో ఇచ్చిన కొంత పార్ట్ కూడా వాడుకుని, మిగతాది తను చేసినట్టు చెప్పుకున్నాడు… తీరా చూస్తే ఏం జరిగింది…? టైటిల్స్‌లో సంగీతం క్రెడిట్స్ డీఎస్పీ పేరే… అనుబంధ, అదనపు కంపోజర్ మాత్రమే శామ్,., థమన్ పేరు లేదు, బహుశా అజనీష్ చేసి ఉండదు, ఆ పేరూ లేదు…

అంటే, థమన్ చేసిచ్చిన ఓ పార్ట్ బీజీఎంను హీరో, దర్శకుడు పక్కన పడేశారా..? అఖండలో సౌండ్ బాక్సులు పగిలే ఆ రేంజ్ బీజీఎం ఇచ్చిన తనకు ఇంతకన్నా పరాభవం ఏముంటుంది..? రేప్పొద్దున, ఐదారుగురితో వర్క్ చేయించుకుని, ది బెస్ట్ అనుకున్నదే ఎంచుకుని, వాడుకునే రోజులు రానున్నాయా…? థమన్ ఎపిసోడ్ చెబుతున్నది ఇదేనా..?

పోనీ, ఇంత ప్రయాసపడి, ఇన్ని కథలు పడి, ఇన్ని వేషాలు వేసినా సరే… సినిమాలో బీజీఎం ఏమైనా గొప్పగా ఉందా…? జస్ట్, బాగుంది, అంతేతప్ప గొప్పగా ఏమీ లేదు… కలగూరగంప ఎప్పుడూ సరిగ్గా ధ్వనించదు… ఇదీ అంతే… ఫీలింగ్స్, సూసేకి పాటల కొరియోగ్రఫీతో సినిమాలో బాగున్నట్టు అనిపించాయి గానీ బయట పెద్దగా పుష్ప ఫస్ట్ పార్ట్ రేంజులో అనిపించలేదు…

ఊ అంటావా రేంజులో ఎక్స్‌పెక్ట్ చేసిన కసిక్కు పాట కంటెంట్ శుద్ధదండుగ… శ్రీలీల ఎనర్జీ, స్టెప్పులతో సినిమాలో బాగానే కనిపించింది… పుష్ప ఫస్ట్ పార్ట్ హిట్‌కు పాటలు కూడా ఓ ప్రధాన కారణం… ఈసారి అది అంతగా వర్కవుట్ కాలేదు… ఐనాసరే, మొదటిరోజే 294 కోట్లు, రికార్డు, ఫస్ట్ ఇండియన్ సినిమా కదా అంటారా..? నాలుగు రోజులు ఆగండి…!

ఈ లెక్కలు కూడా పబ్లిసిటీ స్టంట్… ప్రీమియర్స్ ప్లస్ ఫస్ట్ డే కలెక్షన్స్ కలుపుతారా అనేది మరో ప్రశ్న… రెండోరోజు దారుణంగా ఆక్యుపెన్సి పడిపోయింది… థియేటర్స్ ఖాళీ… శని, ఆదివారాలు దిక్కు… Let us wait what time decides… రెండోరోజు కలెక్షన్స్ 60 కోట్లకు పడిపోనున్నాయని ఓ అంచనా… అంటే, ఐదో వంతుకు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కశ్మీర్‌లో యూఎన్ ధర్మసత్రం షట్‌డౌన్… శెభాష్ జైశంకర్… ఇదీ టెంపర్‌మెంట్..!!
  • నరాల్ని సుతారంగా గిచ్చే పాటగత్తె… సరిజోడుగా ఆయన అల్లరల్లరి….
  • అసలే సుగర్… మామిడి పండు చూస్తే టెంప్టింగ్… మరెలా..?!
  • జాతికే పిత..! కానీ ‘మంచి పిత’ కాదు…! మిరుమిట్ల వెనుక చీకటి చారికలు..!!
  • ఈ తప్పుడు కలెక్షన్ల ప్రకటనలతో ఇప్పుడు ఒరిగేదేమిటి సూర్యా..?!
  • ప్చ్, మన బ్రాహ్మి ఆగిపోయాడు… కానీ వడివేలు వదలడం లేదు…
  • == యుద్ధము, వ్యాపారం, స్టాక్ మార్కెట్లపై ప్రభావం ==
  • నూకల అత్తెసరు..! ఈ తరానికి తెలియని సూపర్ రెసిపీ… విత్ పచ్చిపులుసు…!!
  • ఎస్.జైశంకర్..! నాన్- పొలిటికల్ మంత్రిగా ఓ విశిష్ట ఎంపికే..! చదవండి..!
  • అటు పాకిస్థాన్‌తో యుద్ధం… సేమ్ టైమ్, విదేశీ కక్కుర్తి మీడియాతోనూ…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions