సాక్షి మొదటి పేజీలో శ్రీచైతన్య గ్రూపు విద్యాసంస్థలు ఇచ్చిన వాణిజ్య ప్రకటన ఇంట్రస్టింగు… వేల కోట్ల విద్యావ్యాపారంలో భాగంగా ఈ గ్రూపు ఏటా కోట్లకుకోట్ల మీడియా యాడ్స్ జారీ చేస్తుంటుంది… ఆ బిస్కెట్ల కోసమే ఏ మీడియా కూడా వాళ్ల జోలికి పోదు… ఉభయతారకం… అదొక టెక్నిక్… ఆ టెక్నిక్కులు నారాయణ గ్రూపుకూ తెలుసు, శ్రీచైతన్యకూ తెలుసు… కానీ నారాయణ ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాడు…
తనతోపాటు తన వియ్యంకుడు కూడా జగన్ ప్రబల ప్రత్యర్థి తెలుగుదేశంలో ఉన్నారు… నారాయణ కీలకమైన పోర్ట్‌ఫోలియోతో చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా చేశాడు… అమరావతి రాజధాని నిర్ణయాల్లో తనూ భాగస్వామి… జగన్ అధికారంలోకి రాగానే అమరావతి బాధ్యుల కాళ్లుకీళ్లు సాఫ్ చేసే పనిలో పడ్డాడు కదా… వెంటనే నారాయణ లోప్రొఫైల్‌లోకి వెళ్లిపోయాడు… కానీ జగన్ వదలడు కదా… కొరడా పట్టుకుని నిలబడ్డాడు… ఆమధ్య కేసులు కూడా పెట్టాడు…
ఇవన్నీ చూస్తున్న నారాయణ మాజీ పార్టనర్, శ్రీచైతన్యకూ దడ బయల్దేరినట్టుంది… శ్రీచైతన్య ఓనర్ బొప్పన సత్యనారాయణరావు అలియాస్ బీఎస్‌రావు అలియాస్ డాక్టర్ సాబ్ పరిస్థితి గమనించాడు… అసలే జగన్ కమ్మ అంటే చాలు, కమ్మ (కాగితం) చింపేస్తున్నాడు… ఆ సినిమావాళ్లకు ఓ పాఠం చెప్పడానికి టికెట్ల ధరలు తగ్గించి, చివరకు తన దగ్గరకు రప్పించుకున్నాడు… సాగిలబడేలా చేసుకున్నాడు… అంతటి చిరంజీవే జగన్ ఎదుట ఎలా మాట్లాడాడో చూశారు కదా…
Ads
అందుకే ఎన్నాళ్లుగానో నమ్ముకున్న ఈ యాడ్ అస్త్రాన్ని ప్రయోగించినట్టున్నాడు… ఇది వాణిజ్య ప్రకటన కాదు… ఒకరకమైన మర్యాదపూర్వకమైన సరెండర్ ప్రకటన… జగన్ మూడేళ్ల పాలనను అభినందిస్తూ ఇచ్చిన పరోక్ష ప్రయోజన ప్రకటన… తెలివైన వ్యాపారి కదా… మామూలుగా వీళ్ల యాడ్స్ అనగానే ప్రధాన పత్రికలు, రెండు ప్రాంతాల్లోనూ కనిపిస్తాయి… కానీ దీని ఉద్దేశం వేరు కదా… ఆంధ్రజ్యోతికి ఇస్తే జగన్ కొరడా పట్టుకుంటాడు… ఈనాడుకు ఇచ్చినా అంతే… ఏపీలో చాలు… అందుకే జగన్ సొంత పత్రికకు మాత్రమే యాడ్ ఇచ్చారు…
యాడ్ పైభాగంలో వైఎస్ స్టాంపు… ఇటు పక్కన నవరత్నాల స్టాంపు… సరే, అన్నీ బాగానే ఉన్నాయి గానీ… తెల్లారిలేస్తే ఒకటీఒకటీఒకటీ, రెంఢూరెంఢూరెంఢూ, మూఢూమూఢూమూఢూ టైపు రొటీన్ రొడ్డకొట్టుడు ర్యాంకుల ప్రకటనలు రాసీ రాసీ, అది తప్ప ఇంకేమీ రాయలేని టీంకు యాడ్ బాధ్యతలు ఇచ్చినట్టున్నారు… అందుకే ఈ ప్రకటన ఎలా రాయలో అర్థంగాక యాడ్ ఏజెన్సీ వాళ్లు గింజుకున్నట్టున్నారు…
లేకపోతే… జగత్ మెచ్చిన జగన్ పాలన అట… కంటెంటులో సమైఖ్యంగా అభివృద్ధిపథంలో పయనిస్తోంది అనే వాక్యం నవ్వొచ్చేలా ఉంది… ఆల్‌రెడీ విడిపోయిన రాష్ట్రం ఇప్పుడు సమైఖ్య అభివృద్ధి పథంలో పయనించడం ఏమిటో వాళ్లకే తెలియాలి… మళ్లీ అదే భాష… సంచలన రికార్డులు అంటూ… ఇంకా నయం… పెద్దగా ఒకటి అంకె వేసి, దాని పక్కనే జగన్ నిల్చున్న బొమ్మ యాడ్ చేసి, వరుసగా మూడో సంవత్సరమూ జగనే నంబర్ వన్ అని రాయలేదు… సాధారణంగా నీట్, జేఈఈ తదితర ర్యాంకర్ల బొమ్మలు అలాగే ప్రచారం చేస్తారు కదా..!!
Share this Article