రష్మిక మంథన కొత్త సినిమా సీతారామం ప్రమోషన్‌కు సంబంధించిన ఒక వీడియో చూస్తుంటే… ఆశ్చర్యం వేసింది… అచ్చం తెలుగింటి స్త్రీలాగే… ఫ్లూయెన్సీ మాత్రమే కాదు… కొన్ని పదాలు, ప్రత్యేకించి కొన్ని క్రియాపదాల్ని తెలుగువాళ్లలాగే ల్యాండ్ చేయడం వేరే భాషీయులకు కష్టం… తెలుగు నేర్చుకోవడానికి రష్మిక చూపే శ్రమ నచ్చింది… ఇంకా తడబాట్లున్నా సరే, ఇప్పుడున్న పాపులర్ హీరోయిన్లందరిలోనూ… ఎహె, ఇన్నాళ్లూ గొప్ప పేరు వెలగబెట్టిన పెద్ద పెద్ద ప్రముఖ హీరోయన్లకన్నా చాలా చాలా బెటర్…
ఒక నటి ప్రదర్శించే ఎమోషన్స్ సరిగ్గా ఫోకస్ కావాలంటే వాళ్లే డబ్బింగ్ చెప్పుకుంటే చాలా బెటర్… ఆ ఇంటెన్స్, ఆ ఎమోషన్ క్యారీ అవుతాయి… కానీ ఎవరో తెల్లతోలును తీసుకురావడం, నేవీ అందాల చుట్టూ కెమెరాను గిరగిరా తిప్పడం, హీరో ఆమెతో కిందామీదా పడటం, చెక్కులు తీసుకుని చెక్కేయడం… ఇదే జరుగుతోంది… సరే, ఈ జాతర సరుకును, పాత మొహాల్ని వదిలేస్తే… ఇప్పుడు లైమ్‌లైట్‌లో ఉన్న వేరే భాషల తారలను పరిశీలిస్తే తామే తెలుగులో డబ్బింగ్ చెప్పుకునేవారిలో కనిపించేది రష్మికతోపాటు సాయిపల్లవి, నిత్యామేనన్…
Ads
మిగతావాళ్లలో ఎవరైనా ప్రయోగం చేస్తే అది కర్ణకఠోరం… ఆ ఇంటర్వ్యూ చూస్తుంటే రష్మిక చెబుతోంది… ఏ భాషలో నటిస్తుంటే ఆ భాషలో రోజూ సాయంత్రం గంట చొప్పున ట్రెయినింగ్ తీసుకుంటాను అని…. వావ్… నిజానికి ఆమె పుట్టింది కొడవ కుటుంబంలో… మాతృభాష అదే… కానీ ఇప్పుడు కన్నడ ఫుల్లుగా, తెలుగు ఓ మోస్తరుగా, హిందీ, తమిళం కూడా వచ్చేశాయి… కొడవ అంటే తెలుసు కదా… హైదర్ అలీ, టిప్పు సుల్తాన్‌ల సైన్యాన్ని 31 సార్లు ఓడించిన జాతి… తరువాత ఓ కుట్రతో కొడవలను ఊచకోత కోస్తే, అడవుల్లోకి వెళ్లి తలదాచుకున్నారు… ఇప్పటికీ ఆయుధాన్ని పూజిస్తారు… వాళ్ల కల్చరే వేరు…
సిక్కులు, గూర్ఖాల్లాగా లైసెన్సుల్లేకుండా కత్తులు ధరించే అనుమతి ఉన్న జాతి కొడవ… మాణెక్ షా దగ్గర నుంచి కరియప్ప, తిమ్మయ్య సహా బోలెడు మంది మేజర్ జనరల్స్, బ్రిగేడియర్స్, కల్నల్స్, లెఫ్టినెంట్ కల్నల్స్… ఒక్క ముక్కలో చెప్పాలంటే అది జనరల్స్ నేల… ఆయుధం, సైన్యం అనగానే అందరికీ సిక్కులు, ఉత్తరాఖండ్ ప్రజలు, గూర్ఖాలు గుర్తొస్తారు… కానీ ఆయుధాన్ని గర్వంగా, జన్మహక్కుగా, గౌరవంగా, ఆచారంగా భావించేది వీళ్లే…
తెలుగులో డబ్బింగ్ చెప్పుకోవడానికి కష్టపడేది సాయిపల్లవి కూడా… ఏ భాషైనా సరే తనే డబ్బింగ్ చెప్పుకుంటుంది… సరైన ఉచ్ఛరణ కోసం కష్టపడుతుంది… కానీ తెలుగులో సరిగ్గా ఎక్స్‌ప్రెస్ చేయలేదు ఈరోజుకూ… మొన్నామధ్య అలా ఏదేదో చెప్పబోయి, జనానికి ఏదేదో అర్థమై రచ్చ రచ్చ చేసుకుంది… రష్మికలాగే సాయిపల్లవిది కూడా ఓ విశిష్ట జాతి… బడగ… వీళ్లు కూడా మైసూరు ముస్లిం పాలకుల మతహింసకు నీలగిరి అడవుల్లోకి పారిపోయిన జాతి… సో, జాతులపరంగా సేమ్ బాధితులు… కాకపోతే రష్మికది కర్నాటక… సాయిపల్లవిది తమిళనాడు…
బడగ భాష, కల్చర్ డిఫరెంట్… బడగ, కొడవ… రెండూ దాదాపు గౌడ, ఒక్కళిగ తరహా సామాజికవర్గాలు… బడగ మొదట్లో ఎస్టీల్లో ఉంటే, తరువాత బీసీల్లో చేర్చారు… కొడవ కూడా బీసీ… అయితే సాయిపల్లవి, రష్మికను పోల్చిచూస్తే క్వయిట్ అపోజిట్… పల్లవి ఎక్స్‌పోజ్ చేయదు, లిమిటేషన్స్ ఎక్కువ… తన మెరిట్ ప్రూవ్ చేసుకునే మంచి పాత్రలు దొరికాయి… కానీ రష్మిక ఈరోజుకూ పాపులర్, కమర్షియల్ హీరోయిన్… పేరున్న గొప్ప పాత్రలేమీ రాలేదు… ఎక్స్‌పోజింగుకు ఎవర్‌రెడీ… కానీ గార్గి, విరాటపర్వం సినిమాతో పల్లవి డిమాండ్ ఘోరంగా పడిపోయింది… కానీ రష్మిక పుష్ప సినిమాతో ఎక్కడికో వెళ్లిపోయింది… ఆమె చేతిలో ఆరు సినిమాలున్నాయి ఇప్పుడు… వీళ్లందరికన్నా యంగ్…
నిత్యామేనన్ కూడా తెలుగులో డబ్బింగ్ చెబుతుంది… అక్కడక్కడా తడబడుతుంది కానీ తెలుగులో మాట్లాడటానికే ప్రయత్నిస్తుంది… కాకపోతే ఆమెకు సినిమాల్లేవు, డిమాండ్ లేదు… స్వయంకృతం… ఆమె పుట్టింది బెంగుళూరే అయినా మలయాళ కుటుంబం… ఇక సమంత… ఈ తెలుగు మాజీ కోడలికి కూడా పెద్దగా సినిమాలేవీ లేవు,.. చైతన్యను వదిలేశాక తెలుగు ప్రేక్షకుల్లో ఆమె పాపులారిటీ బాగా పడిపోయింది… ఈమెదీ డిఫరెంట్ స్టోరీయే… తెలుగు తండ్రికీ, మలయాళ తల్లికి తమిళ రాజధానిలో పుట్టిన క్రిస్టియన్… తెలుగు కూడా సరిగ్గా రాదు… రష్మిక హిందూ… పల్లవి పుట్టపర్తి సాయిబాబా భక్తురాలు… నిత్యామేనన్ కృష్ణభక్తురాలు… (ఈ ముగ్గురిలో పల్లవి ఎండుకుపోయినట్టు ఉంటే, నిత్య ఎక్కువ పుష్టికరంగా ఉంటుంది… రష్మిక పొట్టి అయినా ఆరోగ్యంగా కనిపిస్తుంది…)
ఇక రాశీ ఖన్నా… లావణ్య త్రిపాఠీ… తమన్నా… పూజా హెగ్డే… తాప్సి… మెహరీన్… కృతిశెట్టి… నయనతార… చాలామంది ఉన్నారు… ఎవరూ తెలుగులో డబ్బింగ్ చెప్పుకోరు… అందరూ దేహప్రముఖులే… బయట కూడా ఆ ఫ్లూయెన్సీ ఉండదు వాళ్ల తెలుగులో… పూజా హెగ్డే అయితే మరీ ఘోరం… ఆమధ్య ఆకాశాన్నంటిన డిమాండ్ ఆమెది… పెద్దగా నటనను ప్రూవ్ చేసుకున్న పాత్రలేమీ లేవు… అక్షయ్ కుమార్ నుంచి బన్నీ దాకా ఆమె కాళ్లనే ఎందుకు ప్రేమిస్తారో ఆమెకే తెలియాలి…
ఓ పిచ్చి ప్రయోగం చేసి మొత్తం కెరీర్‌ను ధ్వంసం చేసుకున్నది అనుష్క శెట్టి… లేకపోతే ఆమె టాప్ వన్ ప్లేసులో ఉండేది… కీర్తిసురేష్ మంచి నటి… నటనను మాత్రమే నమ్మితే సరిపోదనే తత్వం బోధపడి ఇక కాస్త స్లిమ్మయి, అందాల ప్రదర్శనకు దిగింది… ఆమె కూడా ఓ మలయాళీ దర్శకుడికి, ఓ తమిళ హీరోయిన్‌కు పుట్టింది… మరొక్క మంచి పాత్ర పడితే ఇంకా వెలిగిపోతుంది… కానీ నో తెలుగు డబ్బింగ్… ఇక కొంచెం కష్టపడితే కృతి శెట్టికి మంచి అవకాశాలు రావచ్చు… ఇక మిగతా వచ్చీపోయే హీరోయిన్లంటారా..? పాసింగ్ క్లౌడ్స్…!
Share this Article