Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ప్రపంచ సుందరి కిరీటపు ధగధగల వెనుక… కన్నీళ్లు, కష్టాలు…

June 1, 2025 by M S R

.

మిస్ వరల్డ్ పోటీలు ముగిశాయి… ఈసారి కిరీటం మిస్ థాయ్‌లాండ్ ఒపల్ సుచత చువాంగ్ శ్రీ గెలుచుకుంది… థాయ్‌లాండ్‌కు ఇది మొదటి మిస్ వరల్డ్ కిరీటం…

పుకెట్‌కు చెందిన ఓ సాదాసీదా కుటుంబం నుంచి వచ్చిన ఈ 21 ఏళ్ల యువతి ఇప్పుడు తమ్మసాట్ యూనివర్శిటీలో డిగ్రీ చేస్తోంది… ఒక విషయం తప్పక చెప్పుకోవాలి…

Ads

ఈ సుంద‌రి వెనుక ఒక క‌న్నీటి క‌థ ఉంది. క్యాన్స‌ర్‌తో పోరాడి గెలిచి ఈ స్థాయిలో నిలుచుంది. ఇప్పుడు క్యాన్స‌ర్‌కి వ్య‌తిరేకంగా పోరాటం చేస్తూ ఎంద‌రికో స్ఫూర్తిదాయ‌కంగా నిలుస్తున్న‌ది.

16 సంవత్సరాల వయస్సులో ఒపల్ రొమ్ము క్యాన్స‌ర్‌ బారిన ప‌డింది. దీంతో స‌ర్జ‌రీ ద్వారా రొమ్ము తొలగింపు చేయించుకున్నది. ఆ స‌మ‌యంలో జీవితంలో త‌న క‌ల‌ల‌ను నిజం చేసుకుంటానో లేదోన‌ని చాలా భ‌య‌ప‌డింద‌ట చువాంగ్‌శ్రీ‌.

కానీ ఆమె మ‌నోధైర్యం ఆమెను మ‌ళ్లీ నిల‌బెట్టింది. ఆ త‌ర్వాత‌ ఒపల్ రొమ్ము క్యాన్సర్‌కు వ్యతిరేకంగా చైతన్య పోరాటం ప్రారంభించింది. అవ‌గాహ‌న క‌లిగించ‌డ‌మే కాదు.. క్యాన్స‌ర్ బాధితుల కోసం నిధులను సేకరించాలని నిశ్చయించుకుంది.

ఆమె క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్న‌వారు, జ‌యించిన‌వారు, వైద్యులు, వారి కుటుంబ సభ్యులతో ఇంటర్వ్యూల పాడ్‌కాస్ట్‌లను రూపొందించాలని అనుకుంటున్న‌ది. అంతేకాదు.. బ్రాలు, టీ-షర్టులు, ఇత‌ర‌ ఆభరణాలను ఉత్పత్తి చేయడం ద్వారా నిధుల‌ను సేక‌రించాల‌నే సంక‌ల్పంతో ముందుకు సాగుతున్న‌ది.

ప్రపంచవ్యాప్తంగా పది లక్షలకు పైగా మహిళలు ఈ వ్యాధి నుంచి విముక్తి పొందేలా సహాయం చేయడమే ఆమె లక్ష్యంగా ముందుకు సాగుతున్న‌ది….

క్యాన్స‌ర్‌ని జ‌యించిన త‌ర్వాత త‌న చ‌దువును కొన‌సాగించింది ఒపల్‌. ఇంటర్నేషనల్ రిలేషన్స్ విద్యార్థిని అయిన ఒపల్‌కి మనస్తత్వశాస్త్రం, మానవ శాస్త్రంలో కూడా ఆసక్తి ఉంది. పెంపుడు జంతువులంటే ప్రేమ… పదహారు పిల్లులు, ఐదు కుక్కలను పెంచుకుంటోంది…

miss world

ఈమె ఫ్యాషన్ కెరీర్‌లో ఒకటీరెండు చిన్న చిన్న అంశాలు కూడా ఇంట్రస్టింగ్… 2021 నుంచి ఆమె మోడలింగులో ఉంది, ఇలాంటి పోటీల్లో పాల్గొంటోంది… Miss Rattanakosin 2021 కి ప్రిపేరైంది గానీ చివరి వరకూ పోటీలో లేదు…

తరువాత 2022లో, అంటే ఏడాదిలోనే Miss Universe Thailand 2022 పోటీల్లో పాల్గొంది… థర్డ్ రన్నరప్‌గా నిలిచింది… కానీ అనూహ్యంగా ఫస్ట్ రన్నరప్ దాన్ని వద్దనుకోవడంతో ఈమెను సెకండ్ రన్నరప్‌గా ప్రకటించారు… అంటే థర్డ్ ప్లేసు…

ఆ తరువాత ఆమెకు ధీమా వచ్చింది… రెండేళ్లలోనే మళ్లీ అదే మిస్ యూనివర్స్ థాయ్‌లాండ్ పోటీ… మిస్ చార్మింగ్ టాలెంట్, మిస్ బ్యూటీ విత్ కాన్ఫిడెన్స్ స్పెషల్ అవార్డులతో పాటు ఏకంగా మిస్ యూనివర్స్ థాయ్‌లాండ్ విజేతగా నిలిచింది…

opal

ఆ కాన్ఫిడెన్స్‌తో మిస్ యూనివర్స్ 2024 పోటీలకు హాజరైంది… మెక్సికోలో జరిగాయి ఈ పోటీలు… 125 దేశాలు పాల్గొన్నాయి… ఈమె థర్డ్ రన్నరప్‌గా నిలిచింది… సేమ్, Miss Universe Thailand 2022 లో జరిగినట్టుగానే…

2025… మిస్ వరల్డ్ పోటీలకు వచ్చింది… ఇక్కడే ట్విస్టు… మిస్ యూనివర్స్ పోటీల తరువాత 12 నెలల గ్యాప్ ఉండాలి మరో వరల్డ్ లెవల్ పోటీలకు… 12 నెలలు గడవకముందే ఈ మిస్ వరల్డ్ పోటీలకు రావడంతో ఆమె ఆ థర్డ్ రన్నరప్ పొజిషన్ రద్దు చేశారు…

పోతే పోయింది, పోయిందే మంచిదైంది… అందులో కేవలం థర్డ్ రన్నరప్… కానీ ఇప్పుడు ఏకంగా మిస్ వరల్డ్… ఆ దేశానికి కూడా ప్రైడ్… సో, ఏది జరిగినా మన మంచికే… ఇదే నిదర్శనం… కంగ్రాట్స్ సుచత…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఘర్షణలో నష్టాలు సహజం… కానీ మనం 100 % అప్పర్ హ్యాండ్ సాధించాం…
  • నో డౌట్… రాఫెల్ అల్టిమేట్ వార్ ఫైటర్… మన పైలట్లూ సేఫ్…
  • అప్పటికప్పుడు కొత్త సీన్లు… ఆలోచనల కసరత్తులు… మేధో మథనాలు…
  • బాపూ, నీ పాదాలేవి..? ఒక్కసారిగా బావురుమని ఏడవాలనుంది..!!
  • మీడియా చెవుల్లో శ్రీలీల పూలు… నువ్వూ తయారయ్యావా తల్లీ…
  • …. అసలు ఇలాంటి సినిమాలు కదా రీరిలీజ్ చేయాల్సినవి…
  • ‘మా’ పూనుకుని… రాజేంద్ర ప్రసాద్‌కు మానసిక చికిత్స చేయించాలి..!!
  • ‘పోషకాల పుట్ట’గొడుగు..! మాంసాహార ముద్ర తప్పు.., తినకపోతేనే తప్పు..!!
  • ఐపీఎల్ ఫైనల్స్‌లోకి… పాకిస్థానీ జాతిపిత మునిమనుమడి టీమ్…!!!
  • మమత బెనర్జీ… ఆమె అంతే… దేశభక్తి ఆమె దృష్టిలో ఎప్పుడూ నేరమే…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions