అసలు చాలా పత్రికలకు ఆ వార్తే తెలియదు… సహజంగానే టీవీలకు అక్కర్లేదు… నిజానికి ఆసక్తికరమైన వార్తే… ఆంధ్రజ్యోతిలో కూడా దీన్ని కనీకనిపించనట్టుగా వేశారు… అనేకానేక క్షుద్ర రాజకీయ వార్తలు, భజనల నడుమ ఇలాంటి వార్తలకు ఈమాత్రం స్పేస్ దొరకడమే ఎక్కువ… ఏదైనా సంఘటన జరిగినప్పుడు సెన్సేషన్ కోసం ప్రయత్నించే టీవీలు తరువాత ఫాలో అప్, లాజికల్ ఎండ్ పట్టించుకోవు… ఈ వార్త ఏమిటంటే..? విశాఖపట్టణానికి చెందిన జంబాడ లక్ష్మివరప్రసాద్… తను తెలుగు టీవీ సీరియళ్లలో నటించే రవికృష్ణ పేరుతో ఓ ఫేక్ ఫేస్బుక్ ప్రొఫైల్ క్రియేట్ చేశాడు… అసలు ఫేస్ బుక్ అంటేనే ఫేక్ ఖాతాలు, ట్రోలింగ్ ఎదవలు కదా… ఈ ఫేక్ ప్రొఫైల్ నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ అందుకున్న దుండిగల్ అమ్మాయి ఒకరు దాన్ని యాక్సెప్ట్ చేసింది… అప్పుడప్పుడూ చాటింగ్ చేసేది… స్నేహం పెరిగింది… ఆమె ఫోటోలను సంపాదించి బ్లాక్ మెయిల్ స్టార్ట్ చేశాడు… 2.2 లక్షలు దండుకున్నాడు… మరింత డబ్బు కోసం వేధిస్తుండటంతో సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించింది… ఆ పోలీసులు వాడిని పట్టుకుని కేసు పెట్టింది… సోమవారం కూకట్పల్లి కోర్టు రెండేళ్ల జైలుశిక్ష విధించింది… ఇదీ వార్త…
ఈ రవికృష్ణ పేరుతోనే ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసింది… పాపం, మంచోడే… ఆమధ్య బిగ్‌బాస్ ద్వారా కూడా అదనపు పాపులారిటీ సంపాదించాడు కూడా… కానీ ఫేక్ ప్రొఫైల్స్ ద్వారా సైబర్ మోసాలకు పాల్పడే వాళ్లు ఇలాంటి పాపులర్ యాక్టర్ల పేర్లనే వాడుకుంటారు… వాస్తవానికి ఈ వార్తకు కాస్త ఎక్కువ ప్రయారిటీ రావాలి… ఫేస్ బుక్ ఆకర్షణలు ఎంత ప్రమాదమో అందరికీ తెలియాలి… ఇలాంటి విషయాల్లో అమ్మాయిలు, మహిళల తప్పులు కూడా ఉంటున్నయ్… ఇదే కేసు తీసుకుందాం… 1) మామూలు ఫోటోలతో ఎవరూ బ్లాక్ మెయిల్ చేయలేరు… మరీ గ్రాఫిక్స్‌తో అసభ్యంగా మారిస్తే తప్ప… అసలు ఈమె ఎలాంటి ఫోటోలు పంపించింది..? అది తప్పు కదా..? 2) బ్లాక్ మెయిలింగ్ ప్రారంభించిన వెంటనే పోలీసులను ఆశ్రయిస్తే బాగుండేది కాదా… 3) అసలు ముక్కూమొహం తెలియని ఎవడో కోన్ కిస్కా ఫేస్ బుక్ అనబడే ఓ ఫేక్ ప్రపంచంలో పరిచయం అయితే, వాడిని నమ్మేసి ఫోటోలు పంపించడం సరైనదేనా..? అవకాశం కోసం ఎదురుచూసి, వలలు వేసి రెడీగా ఉండే ఇలాంటి మోసగాళ్లు ఫేస్ బుక్‌లో లక్షల మంది… సో, ఇక్కడ జాగరూకత అనేది అమ్మాయిల వైపు నుంచి కూడా అత్యవసరం… అందుకే ఇలాంటి కేసుల గురించి ఎక్కువ తెలియాలి… ఈ కథనం ఉద్దేశం కూడా అదే…! (ఇక్కడ రవికృష్ణ ఒరిజినల్ ఫోటో వాడటానికి కారణాలు రెండు… 1) తన పేరుతోనే ఈ మోసం జరిగింది… 2) తన ఫోటో వార్త వల్ల రేప్పొద్దున కొందరు మహిళలైనా మోసాల నుంచి తప్పించుకుంటే అది రవికృష్ణకే పుణ్యం…)
Ads
Share this Article