.
గనులను చెరబట్టిన గాలి జనార్దనరెడ్డికి ఎన్నో ఏళ్ల అనంతరం కోర్టు శిక్ష వేసింది… అదీ జస్ట్, ఏడేళ్లు… అడ్డగోలు ఆర్జన… వేల కోట్లు… నడమంత్రపు అపార సిరిని నిస్సిగ్గుగా ప్రదర్శించుకున్న తీరును లోకం ఏవగించుకుంది…
డబ్బుతో ఏదైనా చేయగలను అనుకుని, చివరకు డెస్టినీ ఎదురుదెబ్బ తీసేసరికి… బెయిల్ కోసం నానా వంకరమార్గాలు పట్టుకుని, అవీ విఫలమై బెయిల్ ఇప్పించాలంటూ న్యాయవాదుల కాళ్లావేళ్లా పడ్డ తీరునూ లోకం కళ్లారా చూసింది…
Ads
బంగారు కుర్చీలు సహా ఇళ్లంతా బంగారమే… మన డొల్ల వ్యవస్థల సాక్షిగా భూమాతను గుల్లగుల్ల చేసిన ఈ ‘గను’డికి శిక్ష పడినట్టేనా..? లేదు, హైకోర్టు ఉంది, సుప్రీంకోర్టు ఉంది… మన న్యాయవ్యవస్థల గొప్పతనం సాక్షిగా ఈ ఘనుడికి ఇంకా చాలాకాలం సమయం, అవకాశం ఉంది…
అయితే… నిన్న కోర్టులో తను దేబిరించిన తీరు తనపై మరింత అసహ్యం పుట్టేలా ఉంది… అదీ ఇక్కడ చెప్పాలనుకున్నది… తను చేసిన ప్రజాసేవను పరిగణనలోకి తీసుకుని శిక్ష నుంచి మినహాయిస్తే ఇకపై దైవ సేవ చేసుకుంటాడట… ప్రపంచంలో ఎవ్వడైనా నమ్ముతాడా..?
‘నాకు పాత్ర లేదు, నా కంపెనీ చూసుకునేది, 50 వేల మందికి సామూహిక ఉచిత వివాహాలు చేయించాను’ అనీ బొంకాడు… వేల గొడ్లను తిన్న రాబందు శాంతిమంత్రం పఠిస్తున్నట్టు…
తనే కాదు, అప్పటి మైనింగ్ డైరెక్టర్ రాజగోపాల్ ‘‘నేనూ ప్రభుత్వ ఉద్యోగినే, కొందరిని వదిలేశారు కదా, నాకూ మినహాయింపు ఇవ్వండి, 70 ఏళ్లు వచ్చినయ్, పెళ్లాం చచ్చిపోయింది ప్లీజ్’ అని మొరపెట్టుకున్నాడు… అసలు ఈ కేసులో పెద్ద కల్‌ప్రిట్ తనే…
శ్రీనివాసరెడ్డి అనే మరో దోషి తన కొడుకు పెళ్లి ఉంది కనికరించండీ అంటాడు… మెఫజ్ అలీఖాన్ ‘నా పేరెంట్స్ ముసలోళ్లు, నలుగురు పిల్లలున్నారు, పైగా కిడ్నీ పేషెంటును, దయచూపండి’ అంటాడు… నేరాలు చేసేటప్పుడు తెలియదా వీళ్లకు..?
అందరికీ అన్నీ తెలుసు… ఈ వ్యవస్థలో మనల్నెవడు ఏం చేస్తాడనే గుడ్డి నమ్మకం… నిజంగానే నడిచినన్ని రోజులూ నడిచింది కదా… కోర్టు అడిగింది మీకు యావజ్జీవం ఎందుకు వేయకూడదు అని… నిజమే, ఎందుకు వేయలేదు, వేయాల్సిన శిక్షే అది కదా… ఇవి మర్డర్ కేసులకన్నా సీరియస్ కేసులు కాదా..?!
ఇక్కడ కాస్త మన పత్రికల జోలికి వద్దాం… తస్మదీయుడు కాబట్టి ఈనాడు, ఆంధ్రజ్యోతి పండుగ చేసుకున్నాయి… అర్ధరాత్రి దాటాక పాకిస్థాన్ ఉగ్ర స్థావరాల మీద ఇండియా దాడులు వార్త రావడంతో గాలి ఘన వార్తలు లోపల పేజీల్లోకి వెళ్లాయి అనివార్యంగా…
కానీ సాక్షి నిస్సిగ్గుగా సబితను నిర్దోషిగా ప్రకటించడాన్ని హెడింగ్ పెట్టుకుని, దాన్నే హైలైట్ చేసింది… అసలు ఆ దుర్మార్గుడికి శిక్ష పడటం కదా అసలు వార్త..? అస్మదీయుడు కాబట్టి, నువ్వు రాయవు సరే, కానీ జనానికి అర్థం కాదా..? దీన్నే దిగజారుడు పాత్రికేయం అంటారు..? పత్రిక లక్షణాల్ని తుంగలో తొక్కడంలో పదే పదే నైపుణ్యం చూపించడం ఇది…
నమస్తే తెలంగాణ మరీ మరీ దారుణం… సొంత ప్రింటింగ్ ప్రెస్ ఉండీ, అర్ధరాత్రి ఇండియా- పాక్ యుద్ధాన్ని కవర్ చేయలేని అత్యంత దుర్గతి… దాదాపు ప్రతి మెయిన్ పత్రిక కవర్ చేసింది… కనీసం కరపత్రికకైనా పత్రిక లక్షణాలు ఉంటాయేమో, కానీ నమస్తే తెలంగాణకు అదీ దిక్కులేదు…
ఫస్ట్ పేజీ సింహభాగంతోసహా రెండు పేజీలు కేటీయార్ రేవంత్ రెడ్డి మీద చేసిన విమర్శలను హైలైట్ చేసి, అబ్బ, భలే కవర్ చేశాను అని మురిసిపోయింది… భలే పత్రిక పెట్టావయ్యా కేసీయారూ…! గర్వించు నీలో నువ్వే..! (ఈ-పేపర్ల పరిశీలన తరువాత ఈ విశ్లేషణ)
ఇది చూశారు కదా… నమస్తే తెలంగాణ అనే ఓ దిక్కుమాలిన మీడియా తన వెబ్‌సైటులో రాసిన వార్త… నెటిజనం బండబూతులు తిట్టేసరికి డిలిట్ చేసుకుంది… కేసీయార్, గర్వపడు, నీ మీడియాను చూసి..!!
Share this Article