ఓ పెద్ద ఉపోద్ఘాతానికి వెళ్దాం… కొన్ని సినిమాల పోస్టర్లు గమనిస్తే… ట్రెయిలర్లు చూస్తే… వార్తలు చదివితే ఇంట్రస్టింగుగా అనిపిస్తాయి… సరే, ఇదేదో సినిమా బాగానే ఉండేటట్టుంది అనుకుంటాం… తీరా థియేటర్‌కు వెళ్తే అది మన ఉత్సాహాన్ని తుస్సుమనిపిస్తుంది… లక్ష్మి బాంబు అనుకున్నది కాస్తా తోకపటాకలా జస్ట్ టప్‌మంటుంది… 18 పేజెస్ సినిమా అదే… సుకుమార్ రైటింగ్, అల్లు అరవింద్ సమర్పణ, బన్నీ వాసు నిర్మాణం…
ఫస్ట్ నుంచీ ఆ సాంగ్స్, ఆ వార్తలు, ఆ ట్రెయిలర్లు భిన్నంగా కనిపించాయి, వినిపించాయి… రొటీన్ సినిమాలకు భిన్నంగా ఉండనుందనే ఆసక్తిని క్రియేట్ చేశాయి… ప్రత్యేకించి ‘నన్నయ రాసిన’ పాట ట్యూన్, పాడిన తీరుతో పాటు పాడిన గొంతులూ బాగున్నయ్… ప్రత్యేకించి సితార కృష్ణకుమార్ గొంతు ఆ పాటలో భలే పలికింది… గాయకుడు పృథ్వి చంద్ర, సంగీతం గోపీసుందర్… టైం ఇవ్వు పిల్లా పాటకు కూడా రొటీన్‌కు భిన్నంగా శింబును ఎంచుకున్నారు…
Ads
సినిమా కూడా మరో సీతారామంలా హృద్యంగా కనెక్ట్ అవుతుందేమో అనిపించింది మొదట్లో… తీరా చూస్తే…? అంటే సినిమా బాగాలేదని కాదు… మరీ చెప్పుకునేంతగా బాగాలేదు… ఆ ధమాకాలు, ఆ లాఠీల జోలికి పోకుండా… ఇక్కడ ఓసారి సీన్ కట్ చేద్దాం… మరో సినిమా మీద కాస్త ఆసక్తి క్రియేటవుతోంది… దాని పేరు హను-మాన్…
ప్రజెంట్ ట్రెండ్ ఆధ్యాత్మికం ప్లస్ ఫిక్షన్… ఇదీ ఆ కోవలోనిదే… ఆమధ్య ట్రెయిలర్‌లో కొన్ని గ్రాఫిక్స్ సీన్లు చూస్తే బాగనిపించాయి… వందల కోట్ల భారీ గ్రాఫిక్ సినిమాలకు ఇది ఏం తక్కువ అనిపించేలా ఉన్నాయి ఆ సీన్లు… దర్శకుడు ప్రశాంత్ వర్మ నేతృత్వంలో నిర్మితమయ్యే ఈ సినిమాలో లీడ్‌రోల్‌కు మరీ కుర్ర హీరో తేజ సజ్జ ఆనుతాడా, అంటే సూటవుతాడా అనే డౌటు ఉండనే ఉంది… ఇది వైసీపీ రాజ్యసభ ఎంపీ, లాయర్ నిరంజన్‌రెడ్డి నిర్మించే సినిమా అనుకుంటాను బహుశా…
సినిమా టీం మాత్రం దీన్ని పాన్ ఇండియా రేంజ్ అని ముందే ఫిక్స్ చేసుకుని వర్క్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది… ఆర్ఆర్ఆర్ కోసం రాజమౌళి, రాంచరణ్ సినిమా కోసం డైరెక్టర్ శంకర్ అండర్ వాటర్ సీన్లు షూట్ చేశారు ఈమధ్య… శంకర్ దర్శకత్వంలో ఏ టీం అయితే పనిచేసిందో అదే టీం మొన్నీమధ్య ముంబైలో హను-మాన్ అండర్ వాటర్ సీన్లు కొన్ని షూట్ చేసింది… దీనికి తేజ సజ్జ 15 రోజులు శిక్షణ తీసుకున్నాడు అని ఓ టాక్…
సో, సినిమా నిర్మాణ సమయంలోనే మంచి హైప్ క్రియేటవుతోంది… కొన్నిసార్లు ఇది సినిమాకు బలం… అయితే అంచనాలు మరీ పెరిగిపోతే, సినిమా ఆ స్థాయిలో రాకపోతే మాత్రం ఎదురుతన్నే ప్రమాదం ఉంది… ఆల్‌రెడీ ఓటీటీ రైట్స్ 16 కోట్లకు అమ్మేశారు… అసలు సినిమా నిర్మాణ వ్యయమే 16 కోట్లుగా అంచనా వేశారు మొదట్లో…
కారణం ఏమిటో గానీ, అనుకున్న బడ్జెట్ ఆరు రెట్లకు పెరిగింది అని దర్శకుడు చెబుతున్నాడు… నిజానిజాల మాట దేవుడెరుగు… అంటే 100 కోట్లు… అంత భారీ బడ్జెట్ సినిమాను, పాన్ ఇండియా సినిమాను తేజ సజ్జతో తీస్తుండటం ఒక విశేషం కాగా… హీరోయిన్ అమృత అయ్యర్ పెద్దగా ఎవరికీ తెలియని కేరక్టరే… ఎటొచ్చీ ప్రధాన పాత్రల్లో వరలక్ష్మి శరత్‌కుమార్ మాత్రమే సీనియర్… ఇలా ఈ సినిమా నిర్మాణ విశేషాలు కొంత ఆశ్చర్యాన్ని, కొంత ఆసక్తినీ క్రియేట్ చేస్తున్నాయి…!!
Share this Article