పెద్ద పెద్ద స్టార్ హీరోలు సైతం ప్రమోషన్ వీడియోలు చేయించుకోవడానికి ఇష్టపడే సోషల్ మీడియా స్టార్ నీహారిక-ఎన్ఎం గురించి నిన్న చెప్పుకున్నాం కదా… ఇన్‌స్టా, ట్విట్టర్… ఏ వేదికైనా సరే ఆమె వీడియోలు క్రేజ్… ఆమెది ఒక స్టయిల్… కానీ ఓ భిన్నమైన ధోరణితో యూట్యూబ్‌ను దున్నేస్తున్న ఓ తెలుగు కేరక్టర్ గురించి కూడా చెప్పుకోవాలి… తన పేరు హర్ష సాయి… వయస్సు 25, 26 సంవత్సరాలు ఉంటాయేమో… యూట్యూబ్‌లో దున్నకాలు స్టార్ట్ చేసి మూణ్నాలుగేళ్లు కూడా ఇంకా కాలేదు… కానీ ఓ సెన్సేషన్…
తనకు మిలియన్లలో ఫాలోయర్లు ఇప్పుడు… తనకున్న పది చానెళ్లకూ కలిపి కోటి మంది దాకా ఉంటారు… విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్… నిన్నో మొన్నో బిగ్‌బాస్ ఆరో సీజన్ కోసం ఎంపికయ్యాడని ఏదో వార్త చదివి, ఎవరబ్బా ఈ యూట్యూబర్ అని వెతికితే చాలా ఇంట్రస్టింగు సమాచారం ఉంది… తెలుగు, తమిళం, మలయాళం, హిందీ… పలు భాషల్లో తన వీడియోలు కనిపిస్తాయి… ఎక్కువగా తన చారిటీకి సంబంధించిన వీడియోలు…
అవి కొత్తగా ఉంటయ్… సగటు ప్రేక్షకుడిని కనెక్ట్ చేస్తయ్… చిన్న చిన్న గేమ్స్, డిఫరెంట్ ఐడియాలతో జనాన్ని ఎంగేజ్ చేస్తాడు… చానెళ్ల ద్వారా వచ్చిన లక్షల ఆదాయాన్ని మళ్లీ వాటి మీదే ఖర్చు చేస్తుంటాడు… అంటే ఫాలోయర్ల సంఖ్య పెరగడం కోసం, జనాన్ని సర్‌ప్రయిజ్‌లో ముంచెత్తుతూ ఉంటాడు…
Ads
వెళ్తూ వెళ్తూ, ఓ రిక్షా ఆపుతాడు… కొద్దిదూరం పోగానే ఆపేస్తాడు… తన చేతిలో ఓ పదివేల రూపాయల కట్ట పెట్టేసి, వెళ్లిపోతాడు… అదంతా షూట్ అవుతూ ఉంటుంది… ఆ రిక్షా అతని మొహంలో ఆశ్చర్యంతో సహా… మరో ఉదాహరణ చెప్పుకుందాం… ఓ పేద పిల్లాడి స్కూల్ ఫీజులు చెల్లించడానికి చెక్కులు ఇస్తాడు, ఆ పిల్లాడి సైకిల్ కోరిక విని, క్షణాల మీద ఆ సైకిల్‌ను ఆ ఇంట్లోకి రప్పిస్తాడు… చిన్న చిన్న గుడిసెల్లోకి వెళ్లి వాళ్లు ఊహించనంత డబ్బు ఇస్తాడు…
మొత్తం అయిదు రూపాయల నాణేలు తీసుకుపోయి 20 లక్షల కారు కొంటాడు… ఒక బార్బర్ షాపుకి వెళ్లి, తన స్థితిగతులు తెలుసుకుని, ఓ పక్కా షాప్ కట్టించేస్తాడు… ఫ్రీ పెట్రోల్ పంప్ ఓపెన్ చేసి, ఉచితంగా పెట్రోల్ పోస్తుంటాడు… ఇలాంటివి బోలెడు… లక్షల రూపాయలు ఖర్చవుతూనే ఉంటాయి… వీడియోలు అప్‌లోడ్ అవుతూనే ఉంటాయి… ఫాలోయర్స్ పెరుగుతూనే ఉంటారు… రెవిన్యూ వస్తూనే ఉంటుంది… కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ… అదేదో స్టోరీ ఏకంగా కోటి వ్యూస్… చాలా వీడియోలు 60, 70, 50 లక్షల వ్యూస్ సాధించినట్టు యూట్యూబ్ చూపిస్తూ ఉంటుంది…
కొందరికి తన వాయిస్, డిఫరెంట్ స్టయిల్ నచ్చుతుంది… కొందరికి నచ్చదు… కానీ డిఫరెంట్ వీడియోలు అన్నప్పుడు అదీ డిఫరెంట్ ఉండాలని అనుకున్నాడేమో… అయితే కేవలం జనాన్ని సర్‌ప్రైజ్ చేయడం, కొందరికి ఊహించనంత ప్రయోజనం కల్పించడంతో వచ్చేదేముంది..? సార్థకత ఏముంది..? నాలుగు కాలాలపాటు నిలిచే పని చేయవచ్చు కదా అంటారా..? తప్పు, తను అలా చిన్న చిన్న వాళ్ల కోరికలు తీరుస్తూ పోతున్నాడు కాబట్టే ఆ వీడియోలు సక్సెస్, దాంతో రెవిన్యూ, పాపులారిటీ… నీది భలే స్టోరీ హర్ష… కీపిటప్… (ఎటొచ్చీ నువ్వు బిగ్‌బాస్ చెత్తా హౌజ్‌మేట్స్‌లో చేరితే నీ ఇజ్జత్ నువ్వే పోగొట్టుకున్నట్టు… కారణాలు అనేకం… బిగ్‌బాస్ ఓటీటీ నాన్ స్టాప్ సీజన్ చూస్తే దాని వెగటు వాసన ఎంత ఘాటో నీకే తెలుస్తుంది..)
Share this Article