Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఓహ్… బీర్ అలా పుట్టిందా..? ప్రపంచవ్యాప్తంగా అలా మత్తెక్కిస్తోందా..?!

August 2, 2024 by M S R

బీర్ అనేది ప్రపంచం లోని అత్యంత విస్తృతంగా సేవించే ఆల్కహాల్‌ డ్రింక్స్‌లో ఒకటి.. మరి ఈ బీరు పుట్టు పూర్వోత్తరాల గురించి మీకు తెలుసా..? అసలు బీరుకు ఓ రంగును, రూపుని, రుచిని ఇచ్చింది, తెచ్చింది, అంతా మహిళలే నని మీకు తెలుసా..? ఈ రోజు అంతర్జాతీయ బీర్ డే సందర్భంగా బీరు పుట్టు పూర్వోత్తరాలు.. దాని చరిత్ర గురించి తెలుసుకుందాం..!

సుమారు 7 వేల సంవత్సరాల క్రితం మెసోపోటామియా సంస్కృతిలో బీరు తయారీ ఆసక్తికరంగా ప్రారంభమైంది.. అప్పట్లో ఆడవాళ్లు బలవర్థకమైన ఆహారం.. అంటే ఇప్పుడు ఇమ్యూనిటీ ఫుడ్‌ అని అంటున్నామే దాని కోసం అంబలి కాచుకునే వారు.. అంబలి అంటే అందరూ కాచుకునేదే.. కానీ, కొంతమంది మరీ డిఫరెంట్ గా కాస్తారు కదా..

అలా కొంత మంది ఆడవాళ్లు మాత్రం ధాన్యాలకు మూలికలను కూడా కలిపి వాటిని నీళ్లలో బాగా మరిగించి పానీయాలు తయారు చేసే వారు.. అలా మరిగించిన ఆ పానీయాలను నిల్వ చేసే వారు.. అవి పులిసిపోయి విచిత్రమైన వాసన, రుచి మారేది. అది తాగితే లైట్ గా మత్తుగా మధురంగా ఉండేది. అందుకే అప్పట్లో వాటిని మత్తు ద్రావణాలు అని అనేవారు.. ఆ మత్తు వారికి బాగుండేది. ఏదో లోకంలో విహరించినట్లుగా వింతగా.. సరదాగా ఉండేది. దాంతో, చాలా మంది వాటిని ఇంట్లోనే తయారు చేసుకోవడం మొదలు పెట్టారు..

Ads

ప్రపంచ వ్యాప్తంగా మంచి నీళ్లు, టీ, కాఫీ తర్వాత ఎక్కువ మంది బీరే తాగుతారు..

జర్మనీకి చెందిన ఓ సన్యాసిని చొరవతో న్యూ లుక్.!! అలా మధ్య యుగం నాటికి.. పులిసిన పానీయాల తయారీ, వాటి అమ్మకం బాగా పెరిగింది. ఉన్నత వర్గాల నుంచి కింది వర్గాల వరకూ అంతా వాటికి అలవాటు పడ్డారు. కానీ, పులిసిన ఆ పానీయాలు ఎక్కువ కాలం నిల్వ ఉండేవి కాదు. పాచి వాసన వచ్చేవి.. దీంతో, రకరకాల ప్రయోగాలకు తెర తీశారు. అలా పలు ప్రయోగాల్లో భాగంగా గంజాయి మొక్కలకు చెందిన హోప్స్‌ మొక్క పువ్వులను వేచి కాచే వారు. అవి ద్రావణాలను పాడు కాకుండా ఉంచడంతో పాటు మత్తు పాళ్లు కాస్త పెరిగాయి. అలా బీరులోకి కిక్ మొదలైందన్న మాట..

జర్మనీకి చెందిన ఓ సన్యాసిని.. హిల్డెగార్డ్‌ ఆఫ్‌ బింగెన్‌ (హిల్డెగార్డ్‌) విప్లవాత్మక ధోరణితో ఆధునిక కాలంలో బీర్‌కు ఒక రూపం తీసుకొచ్చింది.. అయితే బలవర్థకమైన ఈ పులిసిన పానీయాలను డొమెస్టిక్‌ నుంచి కమర్షియల్‌గా మార్చేయాలన్న ఆలోచన వచ్చింది మాత్రం మగవాళ్లకే.. ఆడవాళ్లు తెలివిగా గుర్తించిన సహజమైన కార్బొనేషన్‌ను పక్కన పెట్టేసి.. బలవంతంగా పరిశ్రమల్లో కార్బొనేషన్‌ను ఎక్కించటం మొదలు పెట్టారు..

“ఇంటర్నేషనల్‌ బీర్‌ డే” పుట్టు పూర్వోత్తరాలు..

2007లో కాలిఫోర్నియా, శాంటా క్రూజ్‌కు చెందిన జెస్సే అవ్‌షాలోమోవ్న్‌ అనే తాగుబోతు.. ఈ “బీర్‌ డే” పుట్టుకకు కారణం.. అది ఓ మందు బాబు పుణ్యం అన్నమాట.. 2012 దాకా ఆగష్టు 5నే “ఇంటర్నేషనల్‌ బీర్‌ డే” ను జరిపే వారు. అయితే, ఆ తర్వాత ఆగష్టు మొదటి శుక్రవారం రోజును “బీర్‌ డే” గా నిర్వహించుకోవాలని మందు బాబులకు పిలుపునిచ్చాడు జెస్సే.. అలా పాశ్చాత్య సంస్కృతి నుంచి పుట్టిన ఈ రోజు (2024 ఆగస్టు 2).. ఇప్పుడు దాదాపు 80కి పైగా దేశాల్లో జరుగుతోంది.. ముఖ్యంగా 200 నగరాల్లో ఈ బీర్‌ వేడుకలను సెలబ్రేట్ చేసుకుంటున్నారు మందు బాబులు.. ఆ లిస్ట్‌లో మన భారత్ కూడా ఉంది…

(ఈ కథనంలో ఒక్క పదమూ నాది కాదు… ఒక తెలుగు న్యూస్ వాట్సప్ గ్రూపులో కనిపించింది… కాస్త కిక్కిచ్చేదిగానే ఉంది కదాని దింపేశాను యథాతథంగా… కథన రచయితకు ధన్యవాదాభినందనలు…)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • దిక్కుమాలిన, తలకుమాసిన మర్యాద… వీటినే బానిస ధోరణులు అంటారు…
  • ఏ కులమైతేనేం… బలుపు చూపే కులంపై తిరగబడేవాడే,.. కర్ణన్…
  • సినిమా టైటిల్‌లో మొనగాడు ఉంటే చాలు… మనోళ్లకు ఖుషీ…
  • అంతే… ఆ స్పీచ్ తరువాత కాంగీ, సీపీఎం మొహాలు మాడిపోయాయ్…
  • యుద్ధంకన్నా క్లిష్టం… సింధు జలాల వాటాలు… దిక్కుతోచని పాకిస్థాన్…
  • వావ్ మద్రాస్..! అప్పట్లోనే ఆంధ్రాలీడర్లు ఇంకాస్త గట్టిగా పట్టుపట్టి ఉంటే..?!
  • అదే పాట, ప్రతీ నోటా..! ఈ ట్యూన్ రికార్డు మరే సినిమా పాటకూ లేదేమో..!!
  • ఓ ప్రధాని మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసినట్టు… రోడ్రిగో కథే వేరు…
  • కేసీయార్ లేదా బాబు అయిఉంటే… ఈ ఈవెంట్ దద్దరిల్లిపోయేది…
  • భారత్ చేతిలో భార్గవాస్త్రం… విదేశీ డ్రోన్లకు పర్‌ఫెక్ట్ విరుగుడు మంత్రం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions