.
రేపు తెలంగాణలో సర్పంచి ఎన్నికలకు తొలిదశ పోలింగు… పేరుకే పార్టీరహితం… కానీ అభ్యర్థులకు రకరకాల పార్టీల మద్దతుతో చిత్రమైన కూటములు కనిపిస్తున్నాయి… ఇక మందు, మాంసం, ప్రలోభాలకు లెక్కే లేదు… ఉన్న ఊళ్లో పోటీలు కాబట్టి అభ్యర్థులు ప్రతిష్టకు పోతున్నారు…
సరే, కామారెడ్డి జిల్లాలోని భిక్నూర్‌లో ఓ ఇంట్రస్టింగు స్టోరీ… ఇది లేడీ రిజర్వ్‌డ్ సీటు… ఇక్కడ పి.మైత్రేయి అనే అభ్యర్థి పోటీపడుతోంది… భర్త పేరు శ్రీధర్ రెడ్డి… ఆమె ఎంఏ, ఎంఫిల్, బీఈడీ… భర్త అగ్రికల్చర్ ఇంజనీరింగులో గ్రాడ్యుయేట్, రూరల్ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ, అమెరికాలో యూఎస్… కొన్నాళ్లు అక్కడ జాబ్ చేసుకుని, తొమ్మిదేళ్ల క్రితం ఊరికి వచ్చేశారు…
Ads
పిల్లలను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివించారు, ఊళ్లోనే వ్యవసాయం చేసుకుంటున్నారు… పిల్లల్లో ఒకరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్, మరొకరు నల్సార్ యూనివర్శిటీలో బీఏ ఎల్ఎల్‌బీ, ఇంకొకరు ఇంటర్మీడియెట్… చూడబోతే మంచి ఎడ్యుకేటెడ్, వోటు వేయదగిన కేరక్టర్ అనిపిస్తోంది కదా…

కానీ ఇప్పుడు ఎన్నికలంటే ఏమిటి..? వోటుకు రేటు కట్టడాలు, మద్యం, మాంసం, కానుకలు, కులాల వారీ ఈక్వేషన్లు… కానీ వీళ్లు వాటి జోలికి పోలేదు… తెల్లారి లేవగానే ప్రతి ఇంటికీ వెళ్లడం వోటు అడగడం, అంతే… కానీ వోటర్లు బాగా కానుకలకు, పార్టీలకు అలవాటు పడిపోయారు కదా…. కాదు, కాదు, పార్టీలు అలా అలవాటు చేశాయి కదా…
రోజూ అభ్యర్థి ఇంటికి వెళ్లడం… తలుపు కొట్టడం… బాటిళ్లు, డబ్బులు అడగడం స్టార్ట్ చేశారు… చివరికి విసిగిపోయి, ఇంటి ముందు ఇలా బోర్డు పెట్టేశారు…

సొంత ఊరికి ఎంతో కొంత మేలు చేద్దాం, ఇక్కడే ఉందాం అనుకున్న కుటుంబానికి ఇదీ ఎదురైన సమస్య… రాజకీయాలు అలా భ్రష్టుపట్టాయి మరి… ‘‘మేం ఓట్లు కొనం, do not disturb,, పైసలు పంచము, మందు తాపము, నిజాయితీగా ఆలోచించి ఓటు వేయండి’’ ఇదీ ఆ బోర్డులో రాసి ఉంది…
అబ్బే, మందు పోయకుండా, మటన్ పెట్టకుండా, కానుకలు ఇవ్వకుండా, డబ్బులు పంచకుండా ఉంటే ఎవరు వోట్లేస్తారు అంటారా..? చూద్దాం… అక్కడ నాకు వోటు లేదు, ఉండి ఉన్నట్టయితే ఈమెకే వేసేవాడిని...
Share this Article