.
అవును, ఐపీఎల్ అంటే ఎప్పుడూ ఫిక్సింగ్ ఆరోపణలే… అప్పటిదాకా అద్భుతంగా ఆడుతున్న జట్లు హఠాత్తుగా చేతులెత్తేస్తాయి, మరీ గల్లీ క్రికెట్ ఆడేస్తాయి… మంచి పర్‌ఫార్మర్స్ కూడా వైడ్స్, లూజ్, టాస్ బాల్స్ వేస్తుంటారు..
బ్యాటర్లు చేజేతులా వికెట్లు సమర్పించుకుంటారు.,. క్యాచ్ డ్రాపులు, మిస్ ఫీల్డింగులు కనిపిస్తుంటాయి… ఇదేకాదు, దేశవ్యాప్తంగా ఓవర్లవారీగా, బాల్స్‌వారీగా కూడా బెట్టింగులు నడుస్తుంటాయి వందలు, వేల కోట్లలో… సో, ఐపీఎల్ అంటేనే ఓ పెద్ద మాయాజూదం…
Ads
ఆడించే బిగ్‌బాస్ ఎవరు…? ఎప్పటికప్పుడు ఏదో పేరు తెరమీదకు వస్తుంది… చెన్నై టీమ్ ఒకప్పుడు టెరిఫిక్ పర్‌ఫార్మర్… ఈసారి అట్టగున నిలబడిపోయింది… హైదరాబాద్ టీమ్ మీద చాలామందికి ఆశలుండేవి అదీ తీవ్రంగా నిరాశపరిచింది…
కోల్‌కత్తా బెటర్ పర్‌ఫామ్ చూపిస్తుందని అనుకుంటే అదీ దెబ్బతీసింది ఈసారి… అనూహ్యంగా గుజరాత్, పంజాబ్, ఢిల్లీ, ముంబై, బెంగుళూరు టీమ్స్ ఆల్ రౌండ్ ప్రతిభను కనబరచాయి… ప్రత్యేకించి పంజాబ్ ఇరగేసింది… పాయింట్ల పట్టికలో టాప్, ఫైనల్స్ కూడా చేరింది…
కీలక మ్యాచులో ఢిల్లీ ఎందుకంత ఘోరంగా ఆడిందో ఎవరికీ అంతుపట్టదు… ముంబై అలవోకగా కొట్టేసింది దాన్ని… అయితే ఒక ఫోటో సోషల్ మీడియాలో ఆసక్తికరంగా కనిపిస్తోంది… ఇదుగో ఇదే….
జైషా ఎలా ఫిక్స్ చేశాడనేది… నిజానికి తనదే ఇప్పుడు క్రికెట్ మీద పెత్తనం… తను చెప్పినట్టు నడుస్తుంది సరేగానీ… తనకు ఫిక్సింగు వల్ల ఏమొస్తుందనేదే ప్రశ్న… ఈ ఫోటో చూద్దాం…
- టాప్ టూ జట్లలో బెంగుళూరు పంజాబ్ మీద గెలిచి ఫైనల్స్ వస్తుందీ అని రాశారు, అదే జరిగింది… క్వాలిఫయర్ మ్యాచ్…
- నాకవుట్‌లో గుజరాత్ మీద ముంబై విన్ అని రాశారు, అదే జరిగింది…
- టాప్ టూలో పంజాబ్‌కు ఇంకో చాన్స్ ఉంది కదా, సో, నిన్న గెలిచిన ముంబైతో సెమీ ఫైనల్… అందులో ముంబై మీద పంజాబ్ గెలుస్తుందని రాశారు, రేపు చూడాలిక…
అంటే… ఫైనల్స్ బెంగుళూరు, పంజాబ్ నడుమ జరుగుతుందని ఈ ఫిక్సింగ్ ఫోటో చెబుతోంది… మొదటి నుంచీ బెంగుళూరు జట్టు ‘ఈసాల కప్ నమ్‌దే’ అని జోష్ మీద ఉంది కదా… అదే జరుగుతుందా..? చూడాలి…
ఈ ఫోటో కూడా ఎవరో బెంగుళూరు ఫ్యాన్ క్రియేట్ చేసినట్టుగా ఉంది… ఐతే ఫిక్సింగ్ చేసేంత ఆసక్తి, సాధనసంపత్తి ఇప్పుడు బెంగుళూరు జట్టుకు ఉన్నాయా అనేదీ ప్రశ్న…
ఒకవేళ పంజాబ్ మీద కూడా ముంబై గెలిచి ఫైనల్స్‌కు వస్తే..? ముంబై టీమ్ ఏదైనా చేయగలదు..? సో, పైన కనిపించే ప్రిడిక్షన్ నిజం అవుతుందా చూద్దాం… అవునూ, నిజంగానే జైషా ఫిక్స్ చేయాలని అనుకుంటే గుజరాత్ టీమ్‌ను కదా గెలిపిస్తాడు… లేదా ముంబై… అంబానీ కూడా గుజరాతీయే కదా…!!
Share this Article