Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఐపీఎల్ ఫైనల్స్‌లోకి… పాకిస్థానీ జాతిపిత మునిమనుమడి టీమ్…!!!

June 2, 2025 by M S R

.

తక్కువ స్కోరుకే మూడు వికెట్లు… ఇక ప్రీతి జింతా ఆశలు గల్లంతే అనుకున్నారు స్టేడియంలోని ప్రేక్షకులు, అంటే పంజాబ్ జట్టు పనైపోయింది, ఇక ముంబై టీమ్ ఫైనల్స్‌లోకి చేరినట్టే అనిపించింది ఓ దశలో…

కానీ ఈ ఐపీఎల్ సీజన్ మొదటి నుంచీ అద్భుతంగా సారథ్యం వహిస్తున్న కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఉన్నాడు కదాని అందరిలోనూ చిన్న ఆశ… ఎస్, అదే పెద్దదై ముంబై జట్టును ముంచేసింది… వాట్ ఏ బ్యాటింగ్… ఎక్కడా టెంపర్ కోల్పోకుండా, పరిణతితో ఆడి, తమ జట్టును ఫైనల్స్‌లోకి చేర్చాడు…

Ads

ipl punjab

2014 తరువాత పంజాబ్ మళ్లీ ఐపీఎల్ ఫైనల్స్‌‌లోకి చేరింది… రోహిత్ శర్మ, సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా, బుమ్రా వంటి అతిరథ మహారథుల జట్టు శ్రేయాస్ అయ్యర్ వల్ల భంగపడింది… ఆమధ్య ఒకాయన ఓ ‘ఫిక్సింగ్ బొమ్మ’ పెట్టాడు కదా సోషల్ మీడియాలో…

అదే నిజం కాబోతోందా..? లేక శ్రేయాస్ అయ్యర్ బెంగుళూరును కొట్టేసి, కప్పు పట్టేస్తాడా..?

ipl

ఈ బొమ్మలో ఉన్నట్టే జరుగుతోంది… ఫైనల్స్‌లో కూడా ఇదే జరిగితే కోహ్లీ హీరో… సరే, చూద్దాం… కానీ ఇప్పుడు ఫైనల్‌లోకి చేరిన ఈ పంజాబ్ జట్టు పాకిస్థాన్ జాతిపితి జిన్నా మునిమనుమడిదే అని  John Kora రాసిన పోస్టు చాలా ఆసక్తికరం… ఓసారి ఆ కథ చదువుకుందాం… ఇలా…



పాకిస్తాన్ జాతిపిత మొహమ్మద్ అలీ జిన్నా ముని మనుమడి టీమ్ ఫైనల్స్ ఆడబోతోంది. ఎస్.. పంజాబ్ కింగ్స్ ఓనర్లలో ఒకడైన నెస్ వాడియా ఫ్యామిలీ గురించి తెలుసా? అతను పాకిస్తాన్ జాతిపిత మొహమ్మద్ అలీ జిన్నా ముని మనుమడని తెలుసా? ఎలాగో చెప్తాను చదవండి..

జిన్నా రెండో భార్య పేరు రత్తన్‌బాయి జిన్నా. ఈమెను మరియం జిన్నా అని కూడా పిలుస్తారు. వీరిద్దరి ఏకైక కుమార్తె పేరు దినా జిన్నా. ఈమె 1919 ఆగస్టు 15న లండన్‌లో జన్మించింది. దినా జిన్నాకు పదేళ్ల వయస్సు ఉన్నప్పుడే తల్లి రత్తన్‌బాయి చనిపోయింది.

దీంతో దినాను జిన్నా చిన్న చెల్లి ఫాతిమా జిన్నా పెంచింది. తండ్రి పాకిస్తాన్ కోసం పోరాడుతూ.. రాజకీయాల్లో బిజీగా ఉన్న సమయంలో.. దినా జిన్నా బొంబాయిలో అత్త దగ్గర పెరిగింది. ఏనాడూ తాను జిన్నా కూతురిని అని బహిరంగంగా చెప్పుకోలేదు.

పైగా దేశ విభజన సమయంలో దినా జిన్నా భారతీయురాలిగా ఇక్కడే ఉండిపోయింది. ముస్లిం కట్టుబాట్లతో పెరిగినా.. దినా జిన్నా మాత్రం తన తల్లి సామాజిక వర్గమైన పార్శీ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అతనే నెవిల్లె వాడియా. అతను బ్రిటన్‌లో పుట్టిన భారతీయ వ్యాపారి. దినా, నెవెల్లికి ఇద్దరు సంతానం. అందులో ఒకరు నుస్లి వాడియా. ఈ నుస్లీ వాడియా కొడుకే నెస్ వాడియా. అదీ సంగతి…. ఐపీఎల్ పంజాబ్ జట్టు భాగస్వామి… #భాయ్‌జాన్



ipl

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఎంత డబ్బిచ్చినా సరే.., మోహన్‌బాబుతో మాత్రం పోను అంటుందామె..!!
  • రేయ్, ఫుడ్ బ్లాగర్లూ… నా మొహం కూడా మాడింది ఆ మసాలా దోశలాగే…
  • 2 ఫ్లాట్లు… 639 కోట్ల రికార్డు ధర… ఇంతకీ ఆ ధనికురాలు ఎవరంటే..?
  • అదే సీన్… 2 పాటలు… ఒకటి తండ్రి, మరొకటి కొడుకు… కానీ ఎంత తేడా…
  • కాశీ తిరగబడింది… ఆ తెల్ల గవర్నర్ జనరల్ రాత్రికిరాత్రి పారిపోయాడు…
  • జైషా నిశ్శబ్ద దరహాసం..? మొత్తం ఆ వైరల్ ఫోటోలో ఉన్నట్టుగానే…?!
  • ఓహో… కమలహాసన్ తాజా సంకుచితత్వం వెనుక అదా కథ…!?
  • వీడొక యాదవ సాంబుడు..! లాలూ చెప్పే డొల్ల కుటుంబ విలువలు..!!
  • ఆ చిన్నారులు… ప్రపంచ సుందరిని కలిసిన తరువాత… ఛ, దుర్విధి…
  • ప్రేమతిట్ల సీజన్… మీ దుంపల్‌తెగ… మీరెక్కడ తయారయ్యార్రా బాబూ…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions