Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మ్యాచులు పెద్దగా చూడటం లేదు… జియో ఆదాయానికి భారీ దెబ్బ…

May 10, 2026 by M S R

.

ఐపీఎల్ మ్యాచుల టీవీ ప్రసారాల ద్వారా మంచి రాబడి వస్తుందని అనుకున్న ముఖేష్ అంబానీకి ఎదురుదెబ్బ తగిలింది… ఐపీఎల్ టీవీ వ్యూయర్‌షిప్ కనీసం 26 శాతం పడిపోయిందట… జియో హాట్‌స్టార్ అంతర్గతంగా చెప్పుకుంటున్న లెక్కలే ఇవి… ఈ దెబ్బకు కనీసం 1000 కోట్ల మేరకు నష్టం వాటిల్లనుందని సంస్థ అంచనా వేసుకుంటోంది… (గత సీజన్ ఇంత దరిద్రంగా లేదు)…

ఎందుకిలా..? ఒకటి ప్రధానమైంది… టీవీల్లో మ్యాచులకన్నా జనం స్మార్ట్ ఫోన్లలో చూసేస్తున్నారు, అదీ జియో ఇచ్చిన చౌక బ్రాడ్‌బాండ్‌తోనే..! రెండోది ఫోర్లు, సిక్సర్ల మోత కోసం మొత్తం పిచ్‌లను బ్యాటింగ్ పిచ్‌లుగా మార్చేస్తున్నారు… దీంతో ఆటలో మజా లేకుండా పోయింది… ప్రతి బంతినీ దంచుతుంటే స్టేడియాలలో ఉన్న ప్రేక్షకులు కేరింతలు కొడుతున్నారు గానీ టీవీలకు, స్మార్ట్ ఫోన్లకు కళ్లప్పగించే సగటు క్రికెెట్ ప్రేక్షకుడికి మాత్రం చిరాకెత్తుతోంది…

Ads

బుమ్రా వంటి బౌలరే చేతులెత్తేస్తున్నాడు అంటే పిచ్‌లు బౌలర్లకు ఎంత నరకప్రాయంగా మారాయో అర్థం చేసుకోవచ్చు… మరి వికెట్లు పడటం లేదా..? పడుతున్నాయి, బ్యాటర్లు పొరపాట్లు చేస్తేనే పడుతున్నాయి… కానీ, డిజిటల్ వ్యూయర్‌షిప్ పెరిగింది కదా, టీవీ వీక్షణం తగ్గిన ఆదాయం, డిజిటల్ యాడ్స్ ద్వారా వస్తాయి కదా అంటారా…? కొంతవరకే నిజం… టీవీ యాడ్స్ రేట్లతో పోలిస్తే, సంపాదనతో పోలిస్తే డిజిటల్ రెవిన్యూ తక్కువ కాబట్టి…

డిజిటల్ లో వ్యూయర్‌షిప్ పెరిగిందీ అంటే… 44% మార్కెట్ షేర్ ఉన్న జియోకి డేటా కన్సంప్షన్ ద్వారా డేటా రీఛార్జ్ లూ పెరిగి ఉంటాయి… అదొక్కటే జియోకు కాస్త రిలీఫ్…

ఈసారి ఐపీఎల్ మ్యాచుల్ని ఆసక్తిగా చూస్తున్నవారెవరయ్యా అంటే..? బెట్టింగ్ రాయుళ్లు… వాళ్లకు క్రికెెట్ మీద ప్రేమ కాదు… జస్ట్, బెట్టింగ్… మరి టీవీ ప్రసారాల ఆదాాయం పెరగాలంటే ఏం చేయాలో తెలియక కొన్నాళ్లు జత్తు పీక్కున్నారు గానీ… ఇప్పుడు ఆ టైం కూడా అయిపోయింది… మహా అయితే ప్రతి జట్టుకు మూణ్నాలుగు మ్యాచులే మిగిలాయి… ముంబై, చెన్నై వంటి జట్లే తేలిపోయాయి… అతిరథ మహారథుల ఫ్యాన్లకు కూడా దీంతో ఇంట్రస్టు పోయింది…

ఈసారి స్టార్ అట్రాక్షన్ కూడా లేదు… కోహ్లీ ఒక్కడే రెగ్యులర్… ధోనీ లేడు, రోహిత్ కొన్ని మ్యాచుల్లో లేడు… ఏ కెప్టెన్ కూడా సరిగ్గా ఆడటం లేదు… అంటే, కన్సిస్టెన్సీ లేదు… బెంచ్ మీద రిజర్వులో ఉన్న మన జూనియర్లు కొందరు హఠాత్తుగా అవకాశాలొస్తే బాగా ఆడి చూపిస్తున్నారు తప్ప సీనియర్లలో ఆ పాత స్కిల్ కనుమరుగైంది…

200 ప్లస్ కామన్ స్కోర్ అయిపోయింది… వాటినీ ఛేజ్ చేసేస్తున్నారు… సో, ఇప్పుడు తగ్గిన టీవీ వ్యూయర్‌షిప్, రెవిన్యూ ప్రభావం జూన్ 2026 ఫిఫా ప్రపంచ కప్ ఫుట్ బాల్ ప్రసార హక్కుల మీద పడింది… ఇండియా బ్రాడ్‌కాస్ట్ రైట్స్ ఎవ్వరూ కొనడం లేదు… ఒకటి మార్కెట్ కండిషన్స్… ఇంకోటి అమెరికా మెక్సికో కెనడా టెలికాస్ట్ టైమింగ్స్… కనీసం 100 ఎం డాలర్ల ఆఫర్‌ పట్ల ఎవ్వడూ ఆసక్తి చూపించడం లేదు… 20 మిలియన్ డాలర్ల వరకు మాత్రమే ఇంట్రస్టు చూపిస్తున్నారట… అదీ సంగతి…   (గోపు విజయకుమార్ రెడ్డి) 

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అనంత శ్రీరామ్ ఓ క్షుద్ర రచయిత… ఈ శాస్త్రీయ విశ్లేషణ సాక్షిగా…
  • ‘‘భలేవారే మాస్టారూ… తాగినోడి మాటలకు అర్థాలేమిటి? మర్మాలేమిటి…’’
  • పిక్కపై చుక్క మిగలకుండా మామిడి పండు జుర్రుకోవడం… ఓ పెద్ద కళ…
  • ‘నా చేతికి ఏమీ అంటకుండా… జగన్‌ను జైలుపాలు చేయడం ఎలా..?’’
  • ‘రైతు డిస్కం’పై అడ్డూఅదుపు లేని అబద్ధాలు- బీఆర్ఎస్ తప్పుడు బాష్యాలు…
  • ‘నేను ఓడిపోతే నా బిడ్డనిచ్చి పెళ్లి చేస్తా’… తండ్రులెప్పుడూ మారలేదు..!!
  • సీఎం విజయ్… కోర్టు చెప్పింది, వీఐపీ- టారిఫ్ కల్చర్ మార్చగలవా..?
  • ‘వార్’పై ట్రంప్ మార్క్ మరో ప్రకటన..! చరిత్రాత్మక ఒప్పందమా? ఇదీ ఫేకేనా..?!
  • వైభవ్ సూర్యవంశీలో పరివర్తన..! ఈలోపే పాపం *నిష్క్రమణ…!
  • ఆసియా రాజకీయాల్లో భారీ మార్పులు…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions