నిజమే, మిత్రుడు నారపరాజు నరసింగరాావు చెప్పినట్టు… అయోధ్య కట్టినా, ఆర్టికల్ 370 ఎత్తేసినా, లా అండ్ ఆర్డర్ బాగున్నా, ఇంకేమేం చేసినా సరే… మోడీ నమ్మి పెత్తనాలు ఇచ్చిన బ్యూరోక్రాట్ పొలిటిషియన్లు తీసుకునే నిర్ణయాలు జనంలో వ్యతిరేకతను పెంచుతాయి… కనీసం ప్రధాని కార్యాలయానికి వీటిని సమీక్షించే టైమ్ లేనట్టుంది… 300 నుంచి 240కు ఎందుకొచ్చామో ఓసారి బీజేపీ ఆత్మపరిశీలన చేసుకోవాలి…
ఉదాహరణకు ఈ నిర్ణయమే తీసుకుందాం… అశ్విన్ వైష్ణవ్ అనే బ్యూరోక్రాట్‌ను రాజకీయాల్లోకి తీసుకొచ్చి, ఏకంగా రైల్వేలకు మంత్రిని చేశాడు మోడీ… ఈ కేబినెట్‌లో కూడా కొనసాగింపు… తనేం చేయాలి..? ప్రయాణికుల సౌకర్యాల పెంపు, రైల్వే స్టేషన్ల అప్‌గ్రేడేషన్, అన్నింటికీ మించి రైలు ప్రమాదాల నివారణకు ఉపయోగపడే కవచ్ అన్ని ప్రాంతాలకూ విస్తరణ, కొత్త ప్రాజెక్టులపై దృష్టి, కార్గో పెంపుదల, కొత్త టెక్నాలజీ అన్వయం… అదేసమయంలో సగటు రైలు ప్రయాణికుడికి అవస్థల్లేని ప్రయాణం…
రైల్వే అనేది మన వ్యవస్థకు ఓ జీవగర్ర… దాన్ని ఓ కమర్షియల్ రవాణా సంస్థగా చూడొద్దు… అది ప్రజారవాణా సంస్థ… ఈ మంత్రి వచ్చీ రాగానే కరోనాను సాకుగా చూపించి ముందుగా వృద్ధుల రాయితీని కత్తిరించాడు… తరువాత జర్నలిస్టుల పాసులను తీసిపారేశాడు… తరువాత వయోపరిమితిని పెంచి వృద్ధుల రాయితీని పునరుద్ధరించాను అనిపించుకున్నాడు… ఖర్చు ఆదా అంటే ఇవి కాదు, నిజంగా ధనం ఆవిరైపోతున్న అంశాల్లో కొరడా పట్టుకోవాలి…
Ads
తాజాగా వార్తల్లో వినిపిస్తున్న ప్రకారం… మరో చెత్త నిర్ణయం తీసుకున్నాడు ఈ మంత్రి… అవును మరి, తను పొలిటిషయన్ కాదుగా, ఈరోజుకూ బ్యూరోక్రాట్‌నే అనుకుంటున్నట్టున్నాడు… తమ రక్తసంబంధీకులు, కుటుంబసభ్యులు, తమ ఇంటిపేరున్న వారికి తప్ప ఇంకెవరికీ మనం ఐఆర్సీటీసీ ఐడీ ద్వారా టికెట్లు బుక్ చేయొద్దట… అలా చేస్తే జైలుశిక్షలు, జరిమానాలట… రైల్వే ఆథరైజ్డ్ ఏజెంట్లు మాత్రమే థర్డ్ పార్టీ బుకింగ్స్ చేయాలట… దరిద్రగొట్టు నిర్ణయం
నిజానికి ఐఆర్సీటీసీయే పెద్ద లోపభూయిష్టమైన వెబ్‌సైట్… రిజిష్టర్ కావడమే పెద్ద గగనం… సరైన మెయింటెనెన్స్ ఉండదు, గ్రీవెన్స్ చెప్పుకోవడమే ఉండదు… ఐనా ఎవడు బుక్ చేస్తే ఏమిటట..? ఒక సర్కిల్ ఒక టూర్‌కు వెళ్లాలనుకుంది… ఒకరి ఐడీతో అందరి టికెట్లు బుక్ చేస్తారు, తప్పేముంది..? దీనికి కూడా ఏజెంట్లను ఆశ్రయించి వాళ్లకు కమీషన్లు ఇవ్వాలా..?
నువ్వు చూసుకోవాల్సింది నీ టికెట్ రేటు మేరకు బుక్కయ్యాయా..? ఆధార్ కార్డులున్నాయా..? బుకింగు సమయంలో సరైన వివరాలు నమోదు చేశారా..? అంతే కదా… ఐఆర్సీటీసీ ద్వారా బుక్ చేస్తే నువ్వేమీ రాయితీలు ఇవ్వడం లేదు కదా… మరెందుకు ఈ కొత్త విధానం..?
పల్లెవాసులు, ముసలోళ్లు, చదువు రానివాళ్లు కోట్ల మంది… అందరికీ ఈ మంత్రికి ఉన్నన్ని తెలివితేటలు ఉండవు కదా… మరి వాళ్ల టికెట్ల బుకింగు కోసం ఎవరో తెలిసిన మిత్రులనో, బంధువులనో ఆశ్రయిస్తే తప్పేమిటట..? మోడీ ఎప్పుడూ ఇలాంటివి సమీక్షించుకోడా..? లేక, గుడ్, అంతా నేను కోరుకున్నట్టే జరుగుతోంది అని సంబరపడతాడా..?!
Share this Article