.
Narukurti Sridhar ……… బెస్ట్ పిక్చర్ , బెస్ట్ యాక్ట్రెస్ , బెస్ట్ డైరెక్టర్ లాంటి ఆస్కార్లు వచ్చాయి . కథలో బరువున్నా screwball/ డార్క్ కామెడీ Genre లో తీయడంతో సినిమా బరువెక్కలేదు.
రష్యన్ తెలిసిన వేశ్య కావాలని వచ్చిన 21 ఏళ్ల ఇవాన్ దగ్గరికి వెళ్తుంది అనోరా ! ఆమె పరిధికి మించిన సర్వీస్ నచ్చి మర్నాడు ఇంటికి ఆహ్వానిస్తాడు . లంకంత ఇంటిలో ఒక్కడే ఉంటున్న ఇవాన్ రష్యన్ businessman కి ఏకైక వారసుడని తెలిసి ఆశ్చర్యపోతుంది . ఇరవై నాలుగు గంటలూ అమ్మాయిలు, వీడియో గేమ్స్ , పార్టీలు, డ్రగ్స్ ! ఇదే అతని జీవితం .
Ads
అనోరా ఒక వారం పాటు తనతో గడిపితే 10000 డాలర్లు ఇస్తానని చెబుతాడు . ఆమె 15000 డాలర్లు అడుగుతుంది . అదీ ముందే ఇవ్వాలి ! అతను ఒప్పుకుంటాడు .
“నేను 10000 కే ఒప్పుకుని ఉండేదానిని తెలుసా !” అంటుంది.
“ నీ ప్లేసులో నేనుంటే 30000 అడిగి ఉండేవాడిని “ అంటాడు .
ఒక ట్రాన్సాక్షన్ ముగుస్తుంది .
****
ఇద్దరూ మిత్రులతో కలిసి లాస్ వేగాస్ వెళ్తారు . తనని పెళ్లి చేసుకోమని అడుగుతాడు . ముందు జోక్ చేస్తున్నాడని అనిపించినా ఏదో ఆశతో ఆమె ఒప్పుకుంటుంది . ఇద్దరూ పెళ్లి చేసుకోవడంతో ఇంకొక ట్రాన్సాక్షన్ ముగిసినట్లు కనిపిస్తుంది .
****
పెళ్లి విషయం తెలిసి రష్యా లో ఉంటున్న అతని పేరెంట్స్ ఆ పెళ్లిని ఎలాగైనా రద్దు చేయాలని అమెరికాలో అతని లోకల్ గార్డియన్ టోరోస్ ని కోరతారు .
అనోరా తన పెళ్లిని కాపాడుకోగలుగుతుందా ! పెళ్లి కేవలం ఇద్దరు వ్యక్తులకి సంబంధించినదా ! క్లాస్ కి సంబంధించినదా ! అపారమైన ఆస్తికి వారసత్వం ఎందుకూ పనికిరాని ఒక ఆకతాయికి విలువను కల్పిస్తుంది! వ్యక్తికి ఉండే విలువ పూర్తిగా క్లాస్ కి సంబంధించినదేనా !
అనోరా నిజంగా ఇవాన్ ని ఇష్టపడే పెళ్లి చేసుకుందా ! కేవలం ఆశపడిందా!! లేక రెండూనా ! అసలు మానవ సంబంధాలు అంత binary వ్యవహారమా ! వారం రోజుల అనుభవం ఒక ఇచ్చిపుచ్చుకునే ట్రాన్సాక్షన్ లా సఫలమైనా , పూర్తిగా భిన్నమైన వర్గాల మధ్య పెళ్లి అనే ట్రాన్సాక్షన్ సఫలం అయ్యే శాతం అతి తక్కువ .
పెళ్లి, వారసత్వ ఆస్తిహక్కు , డబ్బు మానవ సంబంధాల పరిణామ క్రమంలో అత్యంత ముఖ్యమైనవి . అవి మానవ సంబంధాలని బిజినెస్ ట్రాన్సాక్షన్స్ లా మార్చేసాయి . ఈ ట్రాన్సాక్షన్స్ మీద అవగాహన తప్పినప్పుడల్లా దుఃఖమే!
ముగింపు ప్రేక్షకుడికి తెలియనిదేమీ కాదు . అయినా తెలియనట్లే కొన్ని క్షణాలన్నా మెదడుపై హృదయం సాధించే విజయం కోసం ఎదురు చూస్తాడు .
సినిమా బాగుంది, అయితే ఒక కామెడీ సినిమాకి ఆస్కార్ ఎలా వచ్చింది ? బహుశా బరువైన విషయాన్ని ప్రేక్షకులపై భారం వేయకుండా చెప్పినందుకేమో ! Must watch …
దీనిని రూ. 52 కోట్లు పెట్టి తీస్తే రూ. 352 కోట్లకు పైగా వసూలు చేసింది. ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్, యాపిల్ టీవీప్లస్ లో స్ట్రీమింగ్ అవుతోంది… ఇక్కడ ఓ ప్రశ్న… ఇలాంటి కథాంశంతో సినిమాలు తీస్తే మన జనం చూస్తారా..? ఆమధ్య ఇంద్రగంటి ఇదే స్క్రూబాల్ కామెడీ పేరిట అమీతుమీ అనే సినిమా ఒకటి తీశాడు… అట్టర్ ఫ్లాప్… (స్క్రూబాల్, డ్రామెడీ, రొమ్‌కామ్ భిన్న జానర్లు మనవాళ్లకు పట్టవు ఎక్కువ శాతం)…
లీడ్ కేరక్టర్స్‌కు మోరల్ వాల్యూస్ ఆశిస్తారు జనం… మేల్ లీడ్ వ్యభిచారి, జూదరి, అబద్దాలకోరు, అక్రమార్కుడు, స్మగ్లర్, దేశద్రోహి, ఆకతాయి ఎట్సెట్రా ఎన్ని అవలక్షణాలున్నా సరే ఆమోదించే మన జనానికి ఫిమేల్ లీడ్ కేరక్టర్ మాత్రం ఫక్తు సంప్రదాయిని, సుప్పిని, సుద్ధపూసని తరహా ఉండాలి… అందుకే ఇండియన్ ప్రేక్షకుల్లో చాలామందికి నచ్చకపోవచ్చు… మరీ మొదటి అరగంట……. – ముచ్చట
Share this Article