‘‘అన్ని రంగాల్లో… చివరకు సినిమా రంగంలో కూడా గుజరాతీలదే చెల్లుబాటు కావాలా..? వాళ్లు పాలిస్తున్నంతమాత్రాన ఆ భాషాచిత్రాన్నే ఆస్కార్‌కు పంపించాలా..?’’…….. ఇదొక అభియోగం…! ‘‘సో వాట్..? వెయ్యి కోట్లు వసూలు చేస్తే తప్ప అది ఆస్కార్‌కు పోకూడదా..? ఇదేం ప్రాతిపదిక..? అలాంటప్పుడు ఆర్ఆర్ఆర్ బదులు కేజీఎఫ్-2ను పంపించడం బెటర్ కాదా..?’’… ఇదొక విమర్శ…! ‘‘అసలు ఆర్ఆర్ఆర్‌లో ఏముందని..? పిచ్చి గ్రాఫిక్స్ తప్ప… దాన్ని ఆస్కార్‌కు పంపించడం లేదనే బాధ దేనికి..? పంపించడం లేదు, హమ్మయ్య అని ఆనందించాలే గానీ..’’….. ఇదొక వెటకరింపు…!
ఇలా రకరకాల స్పందనలు… వచ్చే ఏడాది ఆస్కార్ అవార్డుల కోసం ఇండియా నుంచి అధికారిక ఎంట్రీగా గుజరాతీ చిత్రం ఛెలో షో (ఆఖరాట, ఫైనల్ షో)ను ఎంపిక చేశారు తాజాగా… అదుగో దాని మీద స్పందనలు అన్నమాట ఇవన్నీ… అరె, ఆర్ఆర్ఆర్, ది కశ్మీర్ ఫైల్స్ వంటి బ్లాక్ బస్టర్లను పక్కనపెట్టి అసలు పేరు కూడా వినని ఛెలో షోను పంపించడం ఏమిటనేది ఒక విమర్శ… మరీ రాజమౌళి భక్తగణం, తెలుగు ప్రాంతీయ వాదాన్ని నెత్తిన మోస్తూ తెగబాధపడిపోతోంది…
అసలు తెలుగు సినిమా ఏమిటి..? గుజరాతీ సినిమా ఏమిటి..? అది ఇండియన్ సినిమా కాదా..? అనే సోయి మాత్రం కనిపించడం లేదు… ఈ చిత్రం ఎంపికలో వివక్ష, పక్షపాతం కనిపించిందనే అభిప్రాయం సోషల్ మీడియాలో బలంగా వ్యాప్తిచెందుతోంది… ఈ గుజరాతీ చిత్రం ఆస్కార్ ఉత్తమ విదేశీ చిత్రాల కేటగిరీలో పోటీపడాల్సి ఉంది… దీని దర్శకుడు పన్ నళిన్… అది ఇప్పటికే పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రశంసలను పొందింది… పైగా ఈ సినిమా జ్యూరీ ఏకగ్రీవ ఎంపిక…
Ads
సదరు దర్శకుడు కూడా సంసార, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, యాంగ్రీ ఇండియన్ గాడెసెస్ వంటి చిత్రాలతో మంచి పేరే సంపాదించాడు… అంతగా కొట్టిపారేయదగిన దర్శకుడేమీ కాదు… సినిమా కూడా విడుదల కావల్సి ఉంది… అక్టోబరులో రిలీజ్ చేయబోతున్నారు… ఇక్కడ ప్రధానంగా ఈ సినిమా సమర్థకుల వాదన ఏమిటంటే..? ‘‘గతంలో తమిళ, మలయాళ, కన్నడ, మరాఠీ, బెంగాలీ, హిందీ చిత్రాలు ఇలా ఎంపికైనప్పుడు ఈ కూనిరాగాలు, సన్నాయినొక్కులు ఏమైపోయాయ్..?’’
ఈసారి జ్యూరీ ఛైర్మన్ ప్రముఖ కన్నడ దర్శకుడు టీఎస్ నాగాభరణ… ఆయనకు మంచిపేరే ఉంది… పైగా మనం చూసిన పాపులర్ సినిమాయే ఆస్కార్‌కు వెళ్లాలా..? సరే, ఇదంతా ఒకెత్తు… మరో ప్రధాన విమర్శ బలంగా వ్యాపిస్తోంది… అసలు ఇండియన్ సినిమాల్లో ఛెలో షోను మించిన మంచి సినిమాలు బోలెడు వచ్చాయి కదా, ఇదే ఎందుకు ఎంపిక చేయాలి..? ఇండియన్ సినిమా ఇజ్జత్ తీయడానికేనా..? 1988లో ఓ ఇటాలియన్ సినిమా వచ్చింది, దాని పేరు సినిమా పారడైసో… అప్పట్లోనే దానికి విదేశీ ఉత్తమ చిత్రాల కేటగిరీలోనే ఆస్కార్ అవార్డు దక్కింది… ఇప్పటి గుజరాతీ సినిమా ఛెలోషో ఆ సినిమాకు నాసిరకం అనుసరణ… దీన్ని చూసి ఆస్కార్ జ్యూరీ నవ్వుకోదా..? ఇండియన్ సినిమా పరువు పోదా..? ఇదీ ఆ విమర్శ…
రెండు సినిమా ట్రెయిలర్ల ఆధారంగా ఒకాయన… ఈ రెండు సినిమాలూ సేమ్ కాన్సెప్టు అంటూ ఓ వీడియోను ట్వీట్ చేశాడు… తన ఉద్దేశం ఏమిటంటే… ఆ ఇటాలియన్ సినిమానే పన్ నళిన్ ఇండియనైజ్ చేసి ఛెలోషో సినిమా తీశాడు అని… మన జ్యూరీకి ఆమాత్రం సోయి లేదంటారా..? అవునూ, దీని వెనుక కూడా అమిత్ షా ఉన్నట్టు ఇంకా ఏ రాజకీయ నాయకుడూ కూయలేదా..?!
VIDEO: I've combined trailers of Italian masterpiece CINEMA PARADISO (1988) & CHHELLO SHOW in one video. Pls watch complete video.
Plot of both movies is totally same. A small-town boy befriends a projectionist at cinema hal and falls in love with the magic of cinema.. #Oscars pic.twitter.com/5AFwTsiscP
— Navneet Mundhra (@navneet_mundhra) September 20, 2022
Share this Article