కేసీయార్ తమ పార్టీ తరపున హైదరాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ ప్రధాని పీవీ కూతురు వాణీదేవి పేరు ప్రకటించాడు… ఆయన కోణంలో ఆమె ఎంపిక సరైన ఎత్తుగడ… పార్టీ బరిలో దిగకుండా ఇంకెవరికో మద్దతు ప్రకటించడంకన్నా, తను గతంలో హామీ ఇచ్చిన మేరకు పీవీ కుటుంబసభ్యుల్లో ఒకరికి ఒక పొలిటికల్ చాన్స్ కల్పించడం వరకూ వోకే… అయితే తన క్యాంపు ఆమెను ఫోకస్ చేయడంలో రాంగ్ స్ట్రాటజీలో వెళ్తోంది… ఆమె అభ్యర్థిత్వం పట్ల బ్రాహ్మణ సంఘాలన్నీ ఆనందాన్ని, మద్దతును ప్రకటించడం.., వాటిని నమస్తే తెలంగాణ బొంబాట్ చేయడం ఒకరకంగా కౌంటర్ ప్రొడక్ట్ అయ్యే ప్రమాదం కూడా ఉంది… ఆమెను ఒక కులానికి ప్రతినిధిగా మాత్రమే ఎక్స్పోజ్ చేస్తున్నారు… అదీ కరెక్టు వ్యూహం కాదనిపిస్తోంది… ఎందుకంటే..?
- బరిలో ఉన్న బీజేపీ రాంచందర్ బ్రాహ్మణుడే… కపిలవాయి దిలీప్ బ్రాహ్మణుడే… మరి వాణిదేవి మాత్రమే బ్రాహ్మణ కులానికి ప్రతినిధి ఎలా అయ్యింది..? అధికార పార్టీ అయినందునా..? ఎవరు గెలిచినా బ్రాహ్మలు గెలిచినట్టే కదా..!
- అర్చక సంఘాలు, పురోహిత సంఘాలు గట్రా మద్దతు ప్రకటించడం వరకూ వోకే… కానీ ఉద్యోగసంఘాలు, గ్రాడ్యుయేట్లు, విద్యార్థి సంఘాలు, ఇతర కులాలకు చెందిన ఆర్గనైజేషన్ల మాటేమిటి..? అసలు వోట్లు వేయాల్సింది ఎవరు..?
- ఆమె అభ్యర్థిత్వాన్ని ఇన్నాళ్లూ ప్రకటించకపోవడం వెనుక కారణమేంటి..?
- బాబ్రీ కట్టడం కూల్చివేతకు సంబంధించి అసలే మైనారిటీలకు పీవీ అంటే కోపం… ఆయా సెక్షన్లు వాణిదేవి అభ్యర్థిత్వానికి పెద్దగా మద్దతు చెప్పకపోవచ్చు… కేవలం బ్రాహ్మణ కుల ప్రతినిధిగా ముద్ర వేయడం వల్ల ఇతర కులాలు నారాజ్ అయ్యే అవకాశమూ ఉంది… ఈ కోణంలో టీఆర్ఎస్ క్యాంపు ఎందుకు ఆలోచించలేదో అర్థం కాదు…
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వోటర్లు మరో అభ్యర్థి వైపు చూస్తే… అప్పుడు జరిగే నష్టం మాటేమిటి..? ఇదంతా పరోక్షంగా లెఫ్టిస్టు నాగేశ్వర్‌కు అనుకూలించబోతోందా..?
- బ్రాహ్మణులంతా వాణిదేవిని తమ అభ్యర్థి అని ఓన్ చేసుకునే పక్షంలో… మరి మిగతా అభ్యర్థులు ఏం చేయాలి..? నాన్-బ్రాహ్మిణ్ స్లోగన్ అందుకోవాలా..? అదే జరిగితే ఎవరికి నష్టం..?
Ads
వాణిదేవి ఎన్నికను ఏకగ్రీవం చేయాలంటూ పలు బ్రాహ్మణ సంఘాలు ప్రకటనలు జారీచేస్తున్న తీరు మీద బీజేపీకి చిర్రెత్తుకొస్తోంది… పీవీ విధానాల్ని అనుసరించడం పీవీకి నివాళి అవుతుంది తప్ప ఆయన బిడ్డకు ఓ పదవి ఇస్తే, వస్తే అది నివాళి అవుతుందా అని ప్రశ్నిస్తోంది… అంతేకాదు, టీఆర్ఎస్ ఎప్పుడైతే పీవీని తెలంగాణ గర్వసూచికగా ప్రమోట్ చేస్తూ, ఆ ప్రయోజనం ఆశిస్తున్నదో… ఇక దాన్ని ఖండించే పని మొదలుపెట్టాయి బీజేపీ శ్రేణులు… నిజానికి బీజేపీ శ్రేణులు ఎప్పుడూ పీవీకి వ్యతిరేకంగా ఎప్పుడూ దూకుడు క్యాంపెయిన్ చేయలేదు… కానీ ఇప్పుడు బీజేపీతో ఉన్న పోటీ వేరు కదా… అసలు పీవీ తెలంగాణ వ్యతిరేకి అనే ప్రచారానికి మెల్లిగా తెరతీస్తున్నాయి… అప్పట్లో పీవీకి సీఎంవో కార్యదర్శిగా ఉన్న పీవీఆర్కే ప్రసాద్ రాసిన ‘అసలేం జరిగిందంటే…’ పుస్తకంలోని కొన్ని పేజీలను బీజేపీ వాట్సప్ గ్రూపుల్లో సర్క్యులేట్ చేస్తున్నాయి… ఆయన తరువాత ప్రధాని పీఆర్వోగా కూడా పనిచేశాడు… ఓసారి ఆ పేజీలు చూడండి…
నిజానికి ఆ పుస్తకంలోని అధ్యాయాలు ఐఏఎస్ అధికారిగా పనిచేస్తున్నప్పుడు తనకు ఎదురైన అనుభవాల సమాహారం… జై ఆంధ్ర, జై తెలంగాణ ఉద్యమాల నేపథ్యంలో… సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉద్యమాలకు పీవీ ఆర్థికసాయం చేశాడు… కొంత డబ్బును తన చేతుల మీదుగానే పంపిణీ చేయించాడు అని సాక్షాత్తూ ఆయన కార్యదర్శే బయోగ్రఫీలో రాసుకుంటే… ఇక పీవీ తెలంగాణ ప్రైడ్ ఎలా అవుతాడు..? అనేది పరోక్షంగా బీజేపీ ప్రచార మర్మం అన్నమాట… సోనియా ఇదే పీవీని నానా అవమానాల పాలు చేస్తే, చివరకు ఆయన మృతదేహం పట్ల కూడా అగౌరవాన్ని ప్రదర్శిస్తే ఇదే కేసీయార్ ఎందుకు స్పందించలేదు, అప్పుడు పీవీ తెలంగాణ బిడ్డగా కనిపించలేదా అనే సోషల్ ప్రచారాన్ని కూడా బీజేపీ ఎత్తుకుంది… మొత్తానికి చప్పగా ఉంటుందనుకున్న హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది…!!
Share this Article