ఎస్… పెద్దగా పాత్రికేయంలో శిక్షణ పొందని, పెద్దగా సాధనసంపత్తి లేని, నిబద్ధత లేని చిన్న చిన్న వాట్సప్ పత్రికల్లో ఏమైనా తప్పులు వస్తే మరీ భూతద్దంలో చూడాల్సిన పనిలేదు… వాటి రేంజ్ అదే… తెల్లారిలేస్తే వాట్సప్ గ్రూపుల్లో ఇలాంటి పత్రికలు బోలెడు… ష్, పెద్ద పెద్ద విలేఖరులుగా గతంలో పలు పోస్టుల్ని ఉద్దరించిన వాళ్ల డిజిటల్ పత్రికలూ ఉంటున్నయ్…
ఐతే ఏ పత్రికలైనా సరే కొన్ని పాత్రికేయ ప్రమాణాల్ని పాటించాలి… అలా పాటిస్తేనే వాటిని పత్రికలు అనాలి… మరీ ప్రత్యేకించి సొసైటీకి మస్తు నీతులు చెప్పే పార్టీల బాకాలు ఖచ్చితంగా ప్రమాణాల్ని పాటించాలి… మరి ఎదుటోడికి చెప్పేటప్పుడు తాము పాటించి చూపించాలి కదా… మరీ ప్రత్యేకించి అత్యాచారాల కేసుల్లో, మరీ ప్రత్యేకించి చిన్న పిల్లల అత్యాచారాల కేసుల్లో పేర్లు రాయకూడదు సరికదా, ఫలానా వాళ్లు అని హింట్స్ వచ్చేలా కూడా వార్త రాయకూడదు… అలా రాస్తే చట్టరీత్యా నేరం కూడా…
సేమ్, మతకలహాలు, ఇతర జాతిపోరాటాల వార్తల విషయంలోనూ స్వీయనియంత్రణ, జాగ్రత్త అవసరం… అఫ్‌కోర్స్, ఇప్పుడు దేశంలో సీపీఎం పరిస్థితి బాగా లేకపోవచ్చు… ఏమో, ఇంకా దెబ్బతినవచ్చు కూడా… కానీ దేశమంతా కేడర్ ఉంది… పార్టీకి సైద్ధాంతిక పునాదులున్నయ్… నిబద్ధత కలిగిన పార్టీ శ్రేణులున్నయ్… సో, జాగ్రత్తగా రిపోర్టింగ్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంది… దానికి తెలుగులో, తెలంగాణలో ఓ పత్రిక ఉంది… అందులో ఫస్ట్ పేజీలో కనిపించిన ఓ వార్త చూస్తే ఆశ్చర్యం వేసింది… (వేరే పత్రికల్లో అసలు ఈ వార్తే కనిపించలేదు… బహుశా ఎక్కడైనా మరీ చిన్నగా కవర్ చేశారేమో…)
Ads
‘రాజధానిలో మతోన్మాదుల వీరంగం’… ఇదీ వార్త శీర్షిక… చర్చి ధ్వంసం, క్రైస్తవులపై దాడి అనేది డెక్… విచిత్రంగా దానికి ఓ ఫైల్ ఫోటో యాడ్ చేశారు… చూడగానే నిన్నటి సంఘటన ఫోటో అనుకునేట్టు… అసలు ఇలాంటి మతసున్నితమైన వార్తలు ఫైల్ చేసేటప్పుడే ఫలానా మతం అని తెలియకుండా జాగ్రత్త పడాలి… అందుకే మెయిన్ స్ట్రీమ్‌లో మతకల్లోలాలు గట్రా సాగుతుంటే ఒక ప్రార్థన మందిరం, ఒక సామాజికవర్గం అని రాస్తుంటారు తప్ప మతాలు, ఆలయాల పేర్లను రాయరు… రాయకూడదనేది నైతిక పాత్రికేయ నియమం… ఒక ప్రమాణం…
నవతెలంగాణలో యథేచ్ఛగా చర్చి, క్రైస్తవులు, జీసస్, బైబిల్ అని పలుసార్లు రాశారు… చర్చిపై దాడిని ఖండించాల్సిందే… కానీ అదే సమయంలో సదరు వార్త పబ్లిష్ చేసేటప్పుడు, అది మరింత కలవరాన్ని కలిగించేలా, ఉద్రిక్తతలు పెంచేలా ఉండకూడదు… సరే, ఇదంతా ఒకెత్తు… ఇదేతరహా దాడి హిందూ, ఇతర మతస్తుల ప్రార్థనా మందిరాలపై జరిగితే ఇలాగే హైలైట్ చేసేవాళ్లా..? ఇలాగే మతం పేరు, ప్రార్థన మందిరం పేరు బయటపడేలా రాసేవాళ్లా..?
అది రాజధాని కాబట్టి… అక్కడ శాంతిభద్రతలు లెఫ్టినెంట్ గవర్నర్ చేతుల్లో ఉంటాయి కాబట్టి… అనగా బీజేపీ పెత్తనం కింద ఉంది కాబట్టి… ఇలాంటివి వెంటనే ప్రజల్ని రెచ్చగొట్టే రీతిలో బీజేపీ మెడలో వేయాలనే కోరిక కాబట్టి… ఈ వార్తకు ఈ ప్రాముఖ్యత… అంతేనా కామ్రేడ్స్..? పోనీ, ఈ దాడికి పూర్వాపరాలు, రెచ్చగొట్టే చర్యలు, పరిణామాలు గట్రా రిపోర్ట్ చేశారా అంటే అదీ లేదు… జస్ట్, మతోన్మాదులు, దాడి, నినాదాలు, ఆ మందిరంలో ఏమేం చేశారో వివరంగా రాస్తూ పోయారు… దీన్ని ఏ పాత్రికేయం అంటారు కామ్రేడ్స్..?! ఈ పోకడ సమర్థనీయమేనా..?
Share this Article