Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అమ్మల దినోత్సవం సందర్భంగా అద్దిరిపోయిన సితార ఇంటర్వ్యూ…!!!

May 8, 2022 by M S R

మదర్స్ డే… ప్రపంచవ్యాప్తంగా అమ్మతనాన్ని గుర్తుచేసుకోవడానికి ఓ దినం… అమ్మకు ప్రత్యేకంగా ఒక దినమేంట్రా, ప్రతిరోజూ అమ్మల రోజే కదా అనేవాళ్లూ ఉంటారు, అది వేరే చర్చ… మీడియా కూడా సెలబ్రిటీల అభిప్రాయాల్ని తీసుకుని, ఓచోట గుదిగుచ్చి, పబ్లిష్ చేసి, ప్రసారం చేసి, హమ్మయ్య ఈసారి అమ్మల దినోత్సవం చేసేశాం అనుకునే ధోరణి పెరిగిపోతోంది… నాసిరకం ఫీచర్ రిపోర్టింగ్ అది… కొంతలోకొంత టీవీ రియాలిటీ షోలు నయం…

ఈసారి సింగర్స్ కంపిటీషన్ షోలు, కామెడీ షోలు, ఇతర రియాలిటీ షోలలో ఆర్టిస్టులు, కంటెస్టెంట్ల ఒరిజినల్ అమ్మల్ని కూడా పిలిచి, వాళ్లను చూపించి, వాళ్ల ఫీలింగ్స్ కూడా ప్రేక్షకులతో షేర్ చేసుకోవడం బాగుంది… అమ్మ అంటే కనిపెంచితేనే కాదు… ఇంకా చాలా…! ఆ విస్తృతిని అర్థం చేసుకుని, అది ప్రాచుర్యంలోకి తీసుకువచ్చే సెన్సిటివ్ ఫీల్ ప్రజెంట్ పాత్రికేయంలో లేకుండా పోయింది… ఉదాహరణకు… ఒకామెకు పుట్టిన రెండు రోజులకే బిడ్డ చనిపోయింది, రోజూ వెళ్లి సమీపంలోని బ్రెస్ట్ మిల్క్ బ్యాంకుకు వెళ్లి చనుబాలను ఇచ్చి వస్తుంది… ఆమెకు ఆ బ్యాంకు వాడు ఇచ్చే తృణమో పణమో ఇక్కడ విశేషం కాదు, మరోచోట మరో తల్లి బిడ్డ కడుపు నిండితే చాలు అనుకోవడమే ఇక్కడ అమ్మతనం…

ఇది కేవలం ఓ ఉదాహరణ… అమ్మతనాన్ని ఎన్ని కోణాల్లో, ఎంత విస్తృతంగా దర్శించవచ్చో, ఆవిష్కరించవచ్చో జస్ట్, గుర్తుచేసుకోవడం కోసం… కానీ మనం ఏం చేస్తున్నాం… ఆ స్పిరిట్‌కు పూర్తి భిన్నమైన కోణంలో మరీ మరీ దిగువకు జారిపోతున్నాం… ఉదాహరణకు… సాక్షి ఫ్యామిలీ పేజీలో మదర్స్ డే సందర్భంగా వేసిన స్పెషల్ పేజీలో ఓ సగం పేజీ మహేశ్ బాబు బిడ్డ సితార ఇంటర్వ్యూ… ఆమె ఇంకా చిన్నపిల్ల… తన బాల్యాన్ని ఎంజాయ్ చేస్తోంది… వీడియోలు, ఇప్పుడు సర్కారువారిపాటలో ఓ డాన్స్ సాంగ్, ఓ పాపులర్ హీరో బిడ్డగా పాపులారిటీని ఆస్వాదిస్తోంది…

Ads

ఆ అమ్మాయిలో మంచి ఎనర్జీ ఉంది, డాన్సుల్లో మంచి టైమింగ్ ఉంది, సో, మంచిగా అభినందిస్తూ ఓ వార్త రాస్తే తప్పేం లేదు… మహేశ్ బాబు కూడా సితారను ఇదే ఫీల్డులో ఎంకరేజ్ చేయాలనుకుంటే ఆమెకు మీడియా కొంత ప్రోత్సహం ఇచ్చినా తప్పు లేదు… కానీ మదర్స్ డే సందర్భంగా చేసిన ఆ ఇంటర్వ్యూలో ఉన్న ప్రశ్నలేమిటో తెలుసా..? ఫ్యామిలీ టూర్ వెళ్లారుగా, ఎలా ఉంది..? చాక్‌లెట్లు, ఐస్‌క్రీములు తింటే మీ అమ్మ ఒప్పుకుంటుందా..? మీ ఇద్దరు పిల్లల్లో మీ అమ్మకు ఎవరంటే ఎక్కువ గారాబం..? నువ్వు మీ అమ్మను అమ్మా అని పిలుస్తావా..? మామ్ అని పిలుస్తావా..? ఇదుగో, ఇలాంటి ప్రశ్నలు… చివరి ప్రశ్న మాత్రం అబ్బో, సాక్షి జర్నలిజం ప్రమాణాల్ని ఓ రేంజుకు తీసుకుపోయింది…

sitara

సెలబ్రిటీ బిడ్ద కాబట్టి రీడర్‌షిప్ ఉంటుంది, ఐనా సినిమా వార్తల్లో ఇంతకుమించి రాయడానికి ఏముంటుంది అనేది విఫల సమర్థన… అది ఫ్యామిలీ పేజీ… మొదట్లో రకరకాల విభిన్న మహిళా అంశాలతో కనిపించేది… దాన్ని మరీ ఓ పేజ్‌త్రీని చేసింది సాక్షే… సరే, వాళ్లు టేస్టు అది… నిజానికి గత ఏప్రిల్‌లో ఆంధ్రజ్యోతి మరింత చిల్లర ఇంటర్వ్యూ ప్రచురించింది… సో, మేం ఆంధ్రజ్యోతికన్నా ఏం తక్కువ అన్నట్టుగా సాక్షి పెట్టుకున్న వాత ఇది… కాకపోతే ఆంధ్రజ్యోతితో పోలిస్తే సాక్షి ఒక్క అంశంలో మాత్రం కాస్త మెరుగు… అదేమిటంటే..?

sitara

సినిమా ఇండస్ట్రీ అంటేనే అదొక భక్తిప్రపంచం… దేవుడు అన్నిచోట్లా తను ఉండలేక హీరోలను, వాళ్ల కుటుంబసభ్యులను పంపించినట్టుగా… ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కడూ వాళ్లకు వంగి వంగి దండాలు పెట్టాలి… తోచినరీతిలో కీర్తనల్ని ఆలపించాలి… అనువైనచోట భజన అందుకోవాలి… భక్తి, ప్రేమ, ఆరాధనలుగా పైకి కనిపించే ఓరకమైన అవకాశవాద దాస్యం… సరే.., పెద్ద పెద్ద దిగ్దర్శకులే తలలు వంచుకుని, మనసులు చంపుకుని, తమను తాము దిగజార్చుకుని… పిల్ల హీరోలు, వాళ్ల కుటుంబసభ్యులకు సలాములు కొడుతుంటే ఇండస్ట్రీలోని చిన్నచిన్నవాళ్లను అనడం దేనికిలెండి… కానీ జర్నలిస్టులకు ఈ దుర్గతి దేనికి..?

ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో కూడా చాలా భయంగా, భక్తిగా, ఆరాధనగా వేసిన కొన్ని ప్రశ్నలు… కోవిడ్ సమయంలో ఎలా చేశారు..? భవిష్యత్తులో ఏం అవ్వాలనుకుంటున్నారు..? వేసవి సెలవుల్లో ఏదైనా టూర్‌కు వెళ్తున్నారా..? కోపం, సంతోషం వచ్చినప్పుడు ఏం చేస్తారు..? ఇలా…… సరే, ఆ పాపకు అంతకుమించి ఏం తెలుసు అంటారా..? మరెందుకు ఈ ఇంటర్వ్యూ..? పైగా ఆ చిన్న పాపకు కూడా రు రు అంటూ బహువచనపు గౌరవప్రపత్తుల ప్రశ్నలు అవసరమా..? హాయ్, సితార, హవ్ ఆర్ యూ, నీ నెక్స్ట్ వీడియో ఏమిటమ్మా అనడిగితే అదేమైనా అవమానమా..? చిన్నతనమా..? అగౌరవమా..?! థాంక్ గాడ్, సాక్షి కూడా సేమ్ ఆంధ్రజ్యోతిలాగే… చెప్పండి మేడం సితూ పాప గారూ, పొద్దున్నే టిఫినీలోకి ఏం తిన్నారు..? చట్నీ బాగుందా..? సాంబారు బాగుందా..? మీ మదర్ మరాఠీ డిషెస్ చేసిపెడతారా..? చేతితో తింటారా..? స్పూన్ తప్పనిసరా..? వంటి రుచికరమైన ప్రశ్నలు వేయలేదు… సంతోషం…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఏమాత్రం ధృవీకరణ లేని… ఓ డిటెక్టివ్ స్టోరీ ఫ్రం ఆపరేషన్ సిందూర్…
  • మళ్లీ ఓసారి ఈ దేశం ఈ ఐరన్ లేడీ ఇందిరని గుర్తుతెచ్చుకుంటోంది..!!
  • ‘‘మొగుడు పోయిన ఆడది, ఎన్నిక ఓడిన లీడర్ జనంలోకి వెళ్లొద్దు’’
  • నిన్నటి కాల్పుల విరమణ మరియు మహాభారతంలోని ఓ సంభాషణ..!
  • కోహ్లి రిటైర్‌మెంట్ ప్రచారాల వెనుక అసలు కథలేమిటి..?
  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions