ఒక మణికర్ణిక పూర్వకాలపు యోధురాలు.., ఒక తలైవి మన కళ్లెదుటే కదలాడిన ఓ నియంత పాలకి… రెండూ బయోపిక్సే… రెండింటిలోనూ కంగనా రనౌతే కథానాయిక… వాటి గురించి ఆలోచిస్తే వాటి వెనుక పొలిటికల్ ఇంట్రస్టులేమీ కనిపించవు… ప్రొఫెషనల్‌గా ఇప్పుడు బయోపిక్స్ సీజన్ కాబట్టి తీశారు అనుకోవచ్చు… కానీ ఒక కాశ్మీర్ ఫైల్స్, ఒక తాష్కెంట్ ఫైల్స్ అనగానే ఓ పొలిటికల్ వాసన తగుల్తుంది… విజయేంద్రప్రసాద్ కథ రాస్తానూ అంటున్న రజాకార్ ఫైల్స్ వెనుక ఓ రాజకీయ ఉద్దేశం కనిపిస్తుంది…
సేమ్… కంగనా రనౌత్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన ఎమర్జెన్సీ సినిమా మీద కూడా కాస్త ఆసక్తి క్రియేటవుతోంది… దానికీ కారణముంది… ఇది ఇతర బయోపిక్స్ కోవలో చూడలేం… కొంతకాలంగా కంగనా ముంబై బాలీవుడ్ మాఫియాతో తలపడుతోంది… బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోంది… కానీ ఓ ఫైటింగ్ స్పిరిట్ ఉంది ఆమెలో… ఠాక్రే ప్రభుత్వం ఆఫీస్ కూలగొట్టినా, కేసులు పెట్టినా భయపడలేదు… బాలీవుడ్ పెద్ద తలలు సిండికేటై నీ అంతు చూస్తామనే బెదిరింపులకు దిగినా ఐ డోన్ట్ కేర్ అంటోంది…
ఈ నేపథ్యంలో ఇందిరాగాంధీ పాత్రలో తనే నటిస్తూ… తనే కథ రాసుకుని… తనే దర్శకత్వం వహిస్తున్న ఎమర్జెన్సీ సినిమా మీద అందుకే ఆసక్తి క్రియేటవుతోంది… ఎమర్జెన్సీ అనగానే ఇందిర విలన్‌గా కనిపిస్తుంది కదా… బీజేపీ క్యాంపు కొన్నాళ్లుగా నెహ్రూ కుటుంబాన్ని పలుచన చేసే ప్రచారం మీద కాన్సంట్రేట్ చేస్తోంది కదా… సో, ఈ సినిమా కూడా ఆ దిశలో నిర్మితమవుతోందా..? ఇందిరలోని నెగెటివ్ షేడ్స్‌ను బలంగా ఫోకస్ చేసే ప్రయత్నమా..? కంగనాకు చెందిన మణికర్ణిక కంపెనీ ఈ సినిమాకు సహనిర్మాత కూడా…! సో, ఇది కంగనా సినిమా…
Ads
ఇలాంటి సినిమాల్ని మరికొన్ని నిర్మించి జనం మీదకు వదలాలని బీజేపీ ఓవరాల్ పొలిటికల్ స్ట్రాటజీలో భాగమేనా..? ఆ విమర్శలన్నీ నిజమేనా..? సరే, సినిమా సంగతికొద్దాం… రాజకీయంగా, వ్యక్తిగతంగా కంగనాను వదిలేస్తే ఓ నటిగా తను ప్రతిభావంతురాలు… దాన్నెవరూ తోసిపుచ్చలేరు… ఆమె తలైవి సినిమా కోసం కష్టపడిన తీరు అభినందనీయం… కాకపోతే ఆమధ్య వచ్చిన థాకడ్ సినిమా మరీ ఘోరంగా ఫ్లాపయిపోయి కంగనాను పది అడుగులు వెనక్కి నెట్టేసింది…
80 కోట్లు ఖర్చు పెడితే 3, 4 కోట్లు కూడా వాపస్ రాలేదు… (మేం పెట్టిన ఖర్చు మొత్తం వచ్చింది అని కంగనా ఏదో ప్రెస్మీట్లో చెప్పుకుంది కానీ హంబగ్…) ఇప్పుడిక ఎమర్జెన్సీ మీద ఆశలున్నాయి ఆమెకు… ఇందిరాగాంధీలా కనిపించే మేకప్ కోసం ఆస్కార్ విజేత, స్పెషల్ ఎఫెక్ట్స్ మేకప్ ఆర్టిస్టు డేవిడ్ మలినోస్కిని పిలిపించుకున్నారు… బాగా కుదిరింది వేషం… ఇందిరాగాంధీ మాట్లాడుతున్నప్పుడు ఆమె నోరు కదిలే తీరును కంగనా భలే పట్టుకుంది… పైగా మొహంలో కాస్త రాజసాన్ని, గాంభీర్యాన్ని కూడా చూపిస్తోంది… అప్పటి అమెరికా అహంభావి అధ్యక్షుడితో డీల్ చేసినప్పుడు ఇందిరాగాంధీ ప్రదర్శించిన టెంపర్మెంట్ అపూర్వం… ఆ ఘట్టాలను ఈ సినిమాలో పెడుతున్నట్టున్నారు… మంచి ఆలోచన… అయితే ఇందిరాగాంధీని అంతిమంగా ఓ ప్రజావ్యతిరేకిగా, ఓ నియంతగా, ఓ క్రూరురాలిగా, ఓ ప్రజాస్వామ్య హంతకిలా చిత్రీకరించబోతున్నారా..?!
Share this Article