Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పాకిస్థాన్ డర్టీ బాంబు కథను ఖతం చేసిన ఇండియన్ ఏజెంట్లు..?!

October 8, 2023 by M S R

పార్ధసారధి పోట్లూరి ….. ఎవరెన్ని అనుకోవచ్చు గాక! అంతిమంగా దేశ రక్షణే ముఖ్యం! ఇండియన్ మొస్సాద్ (రా) ఆపరేషన్స్ కి ఎదురే లేదు! మిగతా ప్రపంచం అలా చేష్టలుడిగి చూస్తూ ఉండాల్సిందే!

అదేంటి? నేరుగా అలా RAW ఆపరేషన్స్ గురుంచి బహిరంగంగా ఎలా చెప్తారు అని మీరు అనుకోవచ్చు గాక! కానీ ఒక స్పై ఏజెన్సీ గురుంచి మరో దేశానికి చెందిన స్పై ఏజెన్సీకి తెలిసిపోతాయి. ఎవరు ఎక్కడ కిడ్నాప్ కాబడ్డారు? దాని వెనుక ఎవరు ఉన్నారు? ఇలాంటి విషయాలు సామాన్య ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉండదు కానీ ప్రత్యర్థి దేశపు ఏజెన్సీలకి తెలిసిపోతాయి!

**********************

Ads

గత రెండు నెలలుగా పాకిస్థాన్ తో పాటు కెనడా, UK లలో భారత్ కి వ్యతిరేకంగా పని చేస్తున్న వాళ్ళు హత్యకి గురవడం లేక అపహరించబడడం జరుగుతూ వస్తున్నది. ఈ సంఘటనల వెనుక RAW ఉన్నది అనే అనుమానాలు ఉన్నాయి కానీ ఆధారాలు లేవు.

********************

కానీ…..

నిన్న అనగా అక్టోబర్ 6 శుక్రవారంనాడు జరిగింది మాత్రం పాకిస్థాన్ ISI కి ఎప్పటికీ మరిచిపోలేని రోజు! డేరా ఘాజీ ఖాన్ – పాకిస్థాన్ పంజాబ్ లోని దక్షిణ ప్రాంతం! Dera Ghazi Khan లో భారీ పేలుడు సంభవించింది! ఆ పేలుడు ఎంత శక్తివంతమైనది అంటే పొరుగు ప్రావిన్స్ లు అయిన బలూచిస్థాన్, ఖైబర్ ఫక్తున్ఖెవ్వ (KPK) వరకు శబ్దంతో పాటు ప్రకంపనలు వ్యాపించాయి! డేరా ఘాజీ ఖాన్ నుండి ఒక వలయం గీస్తే అది 30 కిలోమీటర్లు అవుతుంది. 30 KM రేడియస్ లో శబ్దం, ప్రకంపనలు వ్యాపించడం అనేది మామూలు పేలుడు వల్ల జరగలేదు! జరగదు!

****************

పాకిస్థాన్ అధికారులు ఇప్పటివరకు కారణం ఏమిటో చెప్పలేదు! ఇక సోషల్ మీడియాలో మాత్రం షాహీన్ మిసైల్ టెస్ట్ విఫలం అవడం వలన పేలుడు సంభవించింది అని ప్రచారం జరుగుతున్నది కానీ దానిలో ఏ మాత్రం నిజం లేదు. మిసైల్ పరీక్ష విఫలం అయితే అందులో ఉండే ఇంధనం మండుతుంది తప్పితే పేలుడు సంభవించడం జరుగదు. అది టెస్ట్ ఫైర్ కాబట్టి పేలోడ్ ఉండదు. టెస్ట్ ఫైర్ అయితే భారత్ తో పాటు ఇరాన్ దేశాలకి ఒక రోజు ముందే తెలియచేస్తారు. ఒకవేళ పేలోడ్ ఉన్నా అది 30 km వరకు ప్రకంపనలు సృష్టించే శక్తి ఉండదు.

******************

డేరా ఘాజీ ఖాన్ జిల్లా అధికారి ఒక కామెడీ ప్రకటన చేశాడు… ఆ శబ్దం జెట్ ఫైటర్ సృష్టించిన ‘సానిక్ బూమ్’ అని. సానిక్ బూమ్ అనేది కొద్ది ప్రాంతానికే పరిమితం అవుతుంది తప్పితే అది 30 km వరకు వినపడదు. సానిక్ బూమ్ అనేది జెట్ ఫైటర్ మాక్2 వేగాన్ని అందుకున్నప్పుడు పుడుతుంది. అదీ 1 కిలోమీటర్ లేదా 2 km పరిధిలో మాత్రమే ఉంటుంది దాని ప్రభావం!

*******************

మరి అసలు నిజం ఏమయి ఉంటుంది? డేరా ఘాజీ ఖాన్ ప్రాంతంలో యురేనియం పరిశోధనా కేంద్రం ఉంది. ఈ రీసెర్చ్ సెంటర్ లో వివిధ ప్రాంతాల్లో తవ్వి తీసుకొచ్చిన రాళ్లలో యురేనియం ఉందా లేదా అని రీసెర్చ్ జరుగుతుంది. అక్కడ యురేనియం (ముడి) సాంఫుల్స్ మాత్రమే ఉంటాయి! ముడి యురేనియం ప్రాసెస్ చేస్తే ఎంత మొత్తంలో యురేనియం లభ్యం అవుతుందో చెప్తారు అందులో పని చేసే శాస్త్రవేత్తలు! పేలుడు సంభవించింది ఈ రీసెర్చ్ సెంటర్లలోనే!

******************

పేలుడు సంభవించింది కానీ ఎవరు ఆ పని చేసి ఉండవచ్చు? బాలూచ్ రివల్యుషనరీ ఆర్మీ (BRA)? లేదు. వాళ్ళు AK47, RPG లతో గెరిల్లా దాడి చేయగలరు కానీ అత్యాధునిక ఎలక్ట్రానిక్ డివైజ్ లని వాడగల సామర్ధ్యం లేదు!

*****************

తాలిబన్లు? తెహ్రిక్ ఈ తాలిబన్ ఆఫ్ పాకిస్థాన్? ఈ రెండు సంస్థలకి ఆ సామర్ధ్యం లేదు!

*****************

YES! ఇది RAW ఆపరేషన్! రెండు కారణాలు ఉన్నాయి RAW ఆపరేషన్ అనడానికి. డేరా ఘాజీ ఖాన్ యురేనియం రీసెర్చ్ సెంటర్ లో ఉండేది ముడి యురేనియం సాంపుల్స్ మాత్రమే! ముడి యురేనియంతో అణు బాంబు తయారు చేయలేరు. దానిని ప్రాసెస్ చేసిన తరువాతే అణు బాంబులో వాడగలరు. ISI డర్టీ బాంబ్ తయారు చేసి దానిని భారత్ లో విధ్వంసానికి ఉపయోగించే ఉద్దేశ్యంతో ఉండి ఉండవచ్చు!

డర్టీ బాంబ్ అనేది ముడి యురేనియమ్ తో తయారు చేస్తారు. డర్టీ బాంబ్ పేలినప్పుడు చాలా కొద్ది మొత్తంలో అణు ధార్మికత విడుదల అవుతుంది!

సమాచారం అందుకున్న RAW డేరా ఘాజీ ఖాన్ రీసెర్చ్ సెంటర్ ని పేల్చేసి ఉండవచ్చు. అది తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. అందుకే పాకిస్థాన్ అధికారులు ఎవరూ కూడా ఆ ప్రాంతంలోకి వెళ్ళలేదు పేలుడు జరిగినప్పుడు. పాక్ మీడియాకి కూడా ఎలాంటి క్లూ లేదు ఏం జరిగిందో అని!

************************

కొన్ని సంఘటనలని ఉదహరించాల్సి ఉంటుంది. డేరా ఘాజీ ఖాన్ లో నిన్న పేలుడు జరిగింది! రెండు రోజుల క్రితం ఆఫ్ఘనిస్థాన్ రాయబార కార్యాలయం మూసివేసింది! ఎప్పుడో ఘనీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో దౌత్యాధికారులని నియమించాడు . ప్రస్తుత ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వానికి గుర్తింపు లేనందున కొత్తగా ఎవరినీ నియమించలేదు. ఆర్ధికంగా కూడా బలంగా లేకపోవడం వల్ల తమ రాయబార కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఇది కేవలం ఎలిబీ మాత్రమే!

********************

మొన్ననే పాకిస్థాన్ ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది.. పాకిస్థాన్ లో అక్రమంగా ఉంటున్న ఆఫ్ఘన్లు నవంబర్10 లోగా దేశం విడిచిపెట్టి పోవాలని హెచ్చరించింది. దాదాపుగా 3 లక్షల 50 వేల మంది పష్టూన్లు ఎలాంటి పత్రాలు లేకుండా పాకిస్థాన్ లో ఉంటున్నారు. మరో 13 లక్షల మంది పష్టూన్లు శరణార్థి హోదాలో పాకిస్థాన్ లో ఉన్నారు. శరణార్ధుల గుర్తింపు పత్రాలు ఉన్నవాళ్ళని బలవంతంగా తిరిగి ఆఫ్ఘనిస్థాన్ కి పంపడం కుదరదు. కానీ పత్రాలు లేకుండా పాక్ లో ఉంటున్న వాళ్ళని నవంబర్ 9 తరువాత బలవంతంగా పంపించేస్తామని హెచ్చరించింది పాక్! రెండు లక్షల మంది రోహింగ్యాలు కూడా ఉన్నారు పాక్ లో.

*********************

వీటన్నిటిని చూస్తే ఏమని అర్ధం అవుతుంది? RAW పాకిస్థాన్ లోని మూలమూలలకి విస్తరించింది. ఎవరు మనవాళ్ళు? ఎవరు RAW కి పనిచేస్తున్నారు? ఇదీ పాక్ ISI ని భయపెడుతోంది! ఏదో పెద్దది జరగబోతున్నది– అదేమిటో ఎక్కడ జరగబోతున్నదో క్లూ లేదు! అనుమానం పష్టూన్ల మీదకి వెళ్ళింది. అలా అని 3 లక్షల 50 వేల మంది అక్రమంగా ఉంటున్న పష్టూన్ల లో ఎవరు RAW కి సహకరిస్తున్నారో ఇప్పటికిప్పుడు తెలుసుకోవడం కష్టం! కాబట్టి అందరినీ పంపించేస్తే సరి! నవంబర్ 9 డెడ్ లైన్! ఆ తరువాత అందరినీ ఆఫ్ఘనిస్థాన్ పంపించేస్తారు! RAW అప్పటిదాకా ఆగలేదు! నిన్ననే పని కానిచ్చేసింది!

********************

హై లైట్ ఆఫ్ ఫ్రైడే! వరుస హత్యలు, కిడ్నాపులతో అతలాకుతలం అవుతున్న పాకిస్థాన్ కి సహాయం అందించేందుకు అమెరికా నుండి CIA అధికారుల టీం ISI కి ఎలాంటి సహాయం కావాలో అని అడగడానికి రహస్యంగా పర్యటిస్తున్నది పాకిస్థాన్ లో! కానీ భారత్ లెక్కచేయలేదు! CIA బృందం పాక్ పర్యటనలో ఉండగానే డేరా ఘాజీ ఖాన్ లేబొరేటరీ పేల్చేసింది! ముంబై మీద ISI దాడులు చేసిన సమయంలో CIA పాక్ కార్యాలయమ్ కరాచీలో యాక్టివ్ గా ఉంది. నిన్న అదే CIA టాప్ ఆఫీషియల్స్ పాక్ లో ఉండగానే డర్టీ బాంబ్ ని న్యూట్రల్ చేసింది RAW..!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions