.
రాబిన్‌హుడ్ సినిమాకు సంబంధించి ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో దర్శకుడు వెంకీ కుడుముల (తనేనా..?) ఇంటర్వ్యూ చదువుతుంటే విస్మయం కలిగింది…
ఈ సినిమాకు సంబంధించి రెండు విమర్శలు… ఒకటి… పరమ చెత్తా డాన్స్ స్టెప్పులు కంపోజింగ్… బూతు మాస్టర్ శేఖర్ ఎప్పటిలాగే తన టేస్టును బట్టి ఓ ఐటమ్ సాంగ్‌కు ఓ ఐటమ్ డాన్సర్‌కు స్టెప్పులు కంపోజ్ చేశాడు… స్కర్టు విప్పి ఏదో చూపిస్తూ, వెగటుగా, జుగుప్సాకరంగా…
Ads
ఎస్, ఆ దర్శకుడు, ఆ నిర్మాత, ఆ కంపోజర్, ఆ హీరో ఎవరికీ అది బూతుగా అనిపించలేదట షూట్ చేస్తుంటే… మీకు కావల్సిందే అది కదా, బూతుగా ఎందుకు అనిపిస్తుంది… జనం అంత ఛీకొడుతున్నా సరే, దాన్ని సమర్థించుకునే పోకడ మరింత అసహ్యం…
పైగా సెన్సార్ బోర్డుతో చర్చించి ఆ స్టెప్పులు ఉంచాలో లేదో నిర్ణయిస్తాడట… ఒకరకంగా హెచ్చరికలు జారీ చేసిన మహిళ కమిషన్‌ను, ఎహెపో, నడుమ మీ పెత్తనం ఏమిటి అన్నట్టుగా ఉంది ఇది… సెన్సార్ బోర్డుతో సంప్రదింపులు అంటే తెలుసు కదా… సరే…
రెండోది… డేవిడ్ వార్నర్‌ను ఏదో ప్రమోషనల్ ఈవెంటులో రాజేంద్ర ప్రసాద్ అనబడే వృద్ధ నటుడు తలతిక్కతనంతో ముండాకొడుకు అని వ్యాఖ్యానించాడు… దాన్ని దర్శకుడు వార్నర్‌కు ఏదో వివరించి, అసలు అర్థం, ఉద్దేశం ఏమిటో చెప్పాడట… వార్నర్ దాన్ని లైట్ తీసుకున్నాడట…
అబ్బే, మేం క్రికెట్‌లో స్లెడ్జింగ్ చేస్తాం కదా, ఇదీ అలాంటిదే అనుకుంటున్నాంలే బ్రదర్ అన్నాడట… అంత సీన్ ఏమీ లేదు… ఆస్ట్రేలియన్ క్రికెటర్లు స్లెడ్జింగ్ చేస్తారు, కానీ మరీ ముండాకొడుకు వంటి టైపు తిట్లతో కాదు… పైగా వాళ్లు స్లెడ్జ్ చేస్తారు తప్ప, తమను ఎవరైనా స్లెడ్జ్ చేస్తే అస్సలు సహించరు.,.
అలాగని ఇప్పటికిప్పుడు వార్నర్ పీకేది కూడా ఏమీ లేదు… తనను ఓ తెలుగు సినిమాలోకి ఎందుకు తీసుకున్నారో ఆ టీమ్‌కే ఎరుక… ఐపీఎల్‌లాగే నాలుగు పైసలు వస్తాయి కదాని ఒప్పుకుని ఉంటాడు… తనకు ఓ సంపాదన మార్గం… భలే పిచ్చోళ్లు దొరికారు, వాడుకుందాం అనుకుని ఉంటాడు వార్నర్…
సో, రాజేంద్ర ప్రసాద్‌నూ క్షమిస్తాడు, వెంకీ కుడుములను భరిస్తాడు ప్రస్తుతానికి… రాజేంద్ర ప్రసాద్ తన సహజ పోకడను ప్రదర్శించినా సరే, లైట్ తీసుకుంటాడు… తప్పనిసరై… ఐనంతమాత్రాన రాజేంద్ర ప్రసాద్ మాటలు టేక్ ఇట్ ఫర్ గ్రాంట్ కాదు కదా…
అవునూ, ఇంతకీ సదరు డేవిడ్ వార్నర్‌ను ఎందుకు ఆ సినిమాలో తీసుకున్నట్టు బ్రో…? తను నటుడు కాదు, తను క్రికెటర్… తనకూ ఇండియన్ సినిమాకు సంబంధం లేదు… ఇండియన్ రూట్స్‌తో సంబంధాలూ లేవు… అదనంగా సినిమాకు ఏ ప్రయోజనం వస్తుందని సదరు వెంకీ కుడుముల భావించాడు..? దేవుడికి, తనకు మాత్రమే తెలియాలి…!!
చెప్పనే లేదు కదూ… రాజేంద్ర ప్రసాద్ సారీ చెప్పాడు వార్నర్‌కు… వార్నర్ లైట్ తీసుకున్నప్పుడు మరి ఈ హీరో గారు సారీ ఎందుకు చెప్పినట్టు డియర్ వెంకీ..?
Share this Article